గ్రే హెయిర్‌తో షాకిచ్చిన కింగ్ కొత్త లుక్
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఇటీవల `కింగ్` చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అతడు ఏజ్డ్ మాఫియా డాన్ గా నటిస్తున్నాడు.
By: Sivaji Kontham | 6 Sept 2025 10:27 PM ISTబాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఇటీవల `కింగ్` చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అతడు ఏజ్డ్ మాఫియా డాన్ గా నటిస్తున్నాడు. అతడి కుమార్తె సుహానా ఖాన్ ఓ కీలక పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రానికి పఠాన్ ఫేం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఖాన్ కెరీర్ లో అత్యంత ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే అతడు మొదటిసారి గారాల కుమార్తె సుహానా ఖాన్ తో కలిసి నటిస్తున్నాడు.
అందుకే ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ వచ్చినా అభిమానులు చాలా ఎగ్జయిట్ అవుతున్నారు. కింగ్ సెట్స్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు భుజం గాయం కారణంగా షారుఖ్ ఖాన్ షూటింగ్‌ను కొద్దిరోజులు నిలిపివేశారు. కానీ ఖాన్ ఇటీవల చిత్రీకరణను తిరిగి ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే సెట్స్ నుంచి ఒక ఫోటో ఒకటి లీకవ్వడం కలకలం రేపింది. కింగ్ అధికారిక లుక్ రిలీజ్ కాకుండా ఇదెలా లీకైంది? ఒకవేళ చిత్రయూనిట్ కావాలనే లీక్ చేసిందా? అన్నదానిపై ఇంకా స్పష్ఠత లేదు.
గ్రే హెయిర్ తో ఖాన్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించాడు. అతడు బ్లాక్ షేడ్స్ (కళ్లద్దాలు) ధరించి సహజమైన స్వాగ్ తో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించాడు. ``లుక్ పరంగా ఎలాంటి తప్పు చేయలేదు. వైట్ ఫాక్స్ బావుంది.. స్టైలింగ్ పరంగా ఈ స్పేస్ ఎగ్జయిట్‌మెంట్ ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాడు. ఇది గ్రే షేడ్ యాక్షన్ డ్రామా. పెద్ద ప్లస్ పాయింట్ షార్ట్ హెయిర్ కన్ఫర్మ్డ్.`` అని ఒక నెటిజన్ రాసాడు. ఈ లుక్ చూడగానే కొలేటరల్ నుండి టామ్ క్రూజ్‌ని గుర్తు చేస్తుంది.. చాలా బాగుంది! అని మరొక నెటిజన్ ప్రశంసించాడు. షారూఖ్ లుక్‌ను ది లాస్ట్ ఆఫ్ అస్ నుండి జోయెల్ మిల్లర్‌తో పోల్చారు. SRK ఈజ్ బ్యాక్ ఎగైన్! అని మరొకరు వ్యాఖ్యానించారు.
దాదాపు రెండు సంవత్సరాల విరామం తర్వాత షారుఖ్ ఖాన్ తిరిగి నటనలోకి వచ్చాడు. అతడు ఈసారి ఆసక్తికర కథాంశాన్ని ఎంచుకున్నాడు. అండర్ వరల్డ్ నుంచి ప్రమాదాలను ఎదుర్కొనే హంతకుడి పాత్రను పోషిస్తున్నాడు. గ్రే వరల్డ్ లో మనుగడ కళను నేర్చుకునే అమ్మాయిగా, ఖాన్ నుంచి శిక్షణ పొందే పాత్రను సుహానా ఖాన్ పోషించనుంది. ఈ చిత్రంలో దీపికా పదుకొనే, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, జైదీప్ అహ్లవత్, రాణి ముఖర్జీ, అర్షద్ వార్సీ, అభయ్ వర్మ, రాఘవ్ జుయల్ తదితరులు నటిస్తున్నారు.
