Begin typing your search above and press return to search.

15 ఏళ్లుగా డాడీ కూల్.. కింగ్‌తో బెబో డ్యాన్స్ ఫ్లోర్‌పై చిల్లింగ్

షారుఖ్ ఖాన్, కరీనా కపూర్ 15 ఏళ్ల తర్వాత ‘కింగ్’ సినిమా కోసం ‘డాడీ కూల్ (కింగ్ వెర్షన్)’ పాటలో కలిసి సందడి చేశారు. అరిజిత్ సింగ్, శిల్పా రావు ఆలపించిన ఈ పాటకు వైభవి మర్చంట్ కొరియోగ్రఫీ అందించారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కింగ్’ 2026 డిసెంబర్ 24న విడుదల కానుంది.

By:  Sivaji Kontham   |   28 Nov 2026 10:21 PM IST
15 ఏళ్లుగా డాడీ కూల్.. కింగ్‌తో బెబో డ్యాన్స్ ఫ్లోర్‌పై చిల్లింగ్
X

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `కింగ్` నుంచి తాజాగా విడుదలైన డాడీ కూల్ (కింగ్ వెర్షన్) పాట సంగీత ప్రియులను గొప్పావ‌డ‌న‌ప‌గా ఆకట్టుకుంటోంది. సుమారు 15 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత హిందీ సినిమాలోని అత్యంత ఆక‌ర్ష‌ణీయ‌మైన‌ ఆన్-స్క్రీన్ జంట షారుఖ్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ మళ్లీ కలిసి ఈ పాటలో సందడి చేయడం అభిమానులకు కనువిందుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా క్లాసిక్ హిట్‌గా నిలిచిన బోనీ ఎం పాడిన `డాడీ కూల్` పాట స్ఫూర్తితో రూపొందిన ఈ ట్రాక్‌లో షారుఖ్ తనదైన క్లాసిక్ హంగులు, కరీనా తన స్టైలిష్ ప్రజెన్స్‌తో డ్యాన్స్ ఫ్లోర్‌ను రఫ్ఫాడిస్తూ అద్భుత‌ కెమిస్ట్రీని మరోసారి తెరపై ఆవిష్కరించారు.

ఫ్రాంక్ ఫారియన్, జార్జ్ రేయమ్ రచనలో రూపొందిన ఒరిజినల్ ట్రాక్‌కు సచిన్ -జిగర్ ద్వయం ఉత్సాహభరితమైన బీట్స్.. ఆకట్టుకునే రెట్రో గ్రూవ్‌తో బాలీవుడ్ సరికొత్త సొబగులు అద్దారు. జాతీయ అవార్డు గ్రహీతలైన గాయకులు అరిజిత్ సింగ్, శిల్పా రావు తమ గాత్రంతో ఈ పాటకు మరింత ఎనర్జీ తీసుకురాగా.. కుమార్ అందించిన హిందీ సాహిత్యం, జాతీయ అవార్డు గ్రహీత వైభవి మర్చంట్ కొరియోగ్రఫీ పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. మెటా ప్రతిష్టాత్మక కార్యక్రమం `హౌస్ ఆఫ్ ఇన్‌స్టాగ్రామ్ 2026` వేదికపై.. దేశంలోని 700 మందికి పైగా ప్రముఖ కంటెంట్ క్రియేటర్ల సమక్షంలో ఈ పాటను ఘనంగా ఆవిష్కరించడం విశేషం.

ఇప్పటికే `తూ మిల్ జాయే` పాటలో రొమాంటిక్, యాక్షన్ యాంగిల్‌తో ఆకట్టుకున్న షారుఖ్ ఖాన్ ఇప్పుడు `డాడీ కూల్ (కింగ్ వెర్షన్)`తో సినిమాపై హైప్‌ను రెట్టింపు చేశారు. ప్రస్తుతం ఈ పాట జీ మ్యూజిక్ కంపెనీ, టీ-సిరీస్ యూట్యూబ్ ఛానెళ్లలో అందుబాటులో ఉండి ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. వరుస అప్‌డేట్లతో రోజురోజుకీ అంచనాలను పెంచుతున్న `కింగ్` 2026లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలవబోతోందనే బజ్ ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, మార్ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. క్రిస్మస్ కానుకగా 2026 డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న `కింగ్` చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.