Begin typing your search above and press return to search.

జవాన్ ఎఫెక్ట్.. షారుక్ అసలు ప్లాన్ ఇదే!

జవాన్.. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్‌ కు సౌత్ పవర్ ఏంటో చూపించిన మూవీ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.

By:  M Prashanth   |   16 Sept 2026 1:00 AM IST
జవాన్ ఎఫెక్ట్.. షారుక్ అసలు ప్లాన్ ఇదే!
X

జవాన్.. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్‌ కు సౌత్ పవర్ ఏంటో చూపించిన మూవీ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. జవాన్ తో అట్లీ ఇచ్చిన భారీ సక్సెస్ తర్వాత.. ఇప్పుడు కింగ్ చూపు మరోసారి సౌత్ వైపే పడిందని తెలుస్తోంది. అయితే ఈసారి లెక్క చిన్నది కాదు. తన స్టార్ ఇమేజ్‌ కు సౌత్ మాస్ మేకింగ్‌ ను యాడ్ చేసి మరింత బిగ్ పాన్ ఇండియా గేమ్ ఆడాలన్నదే షారుక్ ప్లాన్‌ గా టాక్ వినిపిస్తోంది.

ఇక సౌత్ దర్శకులతో షారుక్‌ కు ఇప్పుడే ఏర్పడిన పరిచయం కాదు. ఆయన కెరీర్‌ లోనే చాలా కాలం క్రితమే ఆ ప్రయోగాలు మొదలయ్యాయి. 1998లో మణిరత్నం దర్శకత్వంలో దిల్ సే చేశారు. ఆ సినిమా అనుకున్న రేంజ్ లో కమర్షియల్ సక్సెస్ సాధించకపోయినా.. ఆ తర్వాత క్లాసిక్‌ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సంతోష్ శివన్ దర్శకత్వంలో అశోకలో నటించారు షారుక్. భారీ స్థాయిలో తెరకెక్కించిన ఆ సినిమా నిరాశపరిచింది.

అయినా సౌత్ టాలెంట్‌ తో ప్రయోగాలు చేయడానికి షారుక్ ఎప్పుడూ వెనకాడలేదనే చెప్పాలి. కమల్ హాసన్ దర్శకత్వంలో వచ్చిన హే రామ్ లో కీలక పాత్రలో కనిపించారు. అయితే ఆ ప్రయోగాలన్నింటికీ, జవాన్ కు మధ్య చాలా తేడా ఉంది. ‘ఆ మూవీతో అట్లీ షారుక్ స్టార్‌ డమ్‌ ను మాస్ ట్రీట్మెంట్‌ లోకి తీసుకెళ్లారు. యాక్షన్, ఎమోషన్, హీరో ఎలివేషన్, కమర్షియల్ ఎలిమెంట్స్‌ ను కలిపి అందరికీ కనెక్ట్ అయ్యేలా తీశారు.

దీంతో మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారీ విజయంగా నిలిచింది. ఇప్పుడు మరోసారి షారుక్ డైరెక్టర్ లైనప్ లో అట్లీ పేరు వినిపిస్తోంది. ఆయనతోపాటు ప్రశాంత్ నీల్ తో కూడా వర్క్ చేయాలని షారుక్ చేస్తున్నారట. అయితే నీల్ మేకింగ్ కంప్లీట్ గా వేరే మోడ్ లో ఉంటుంది. డార్క్ వరల్డ్, భారీ యాక్షన్, పవర్‌ఫుల్ హీరో ఎలివేషన్స్ ఆయన సినిమాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంటాయి.

అలాంటి దర్శకుడి సినిమాలో షారుక్ కనిపిస్తే.. ఇప్పటివరకు చూసిన కింగ్ ఖాన్ లోని కొత్త యాంగిల్ కచ్చితంగా బయటకు రావచ్చు. ఊహించుకుంటేనే ఆ కాంబోపై హైప్ పెరుగుతుంది. షారుక్ చరిష్మా, ప్రశాంత్ నీల్ మాస్ టేకింగ్ కలిస్తే భారీ స్థాయిలో పనిచేసే యాక్షన్ ఎంటర్టైనర్‌ కు మంచి ఛాన్స్ ఉంటుంది. అదే సమయంలో సుకుమార్, లోకేష్ కనగరాజ్ కు కూడా షారుక్‌ ఛాన్సులు ఇద్దామనుకుంటున్నారట.

అయితే వీటిలో ఏది నిజమవుతుందో, ఏది కేవలం రూమర్ గా మిగిలిపోతుందో చెప్పలేం. కానీ షారుక్ ప్లాన్ మాత్రం క్లియర్ గా తెలుస్తోంది. ఆయన ఇప్పుడు కేవలం ఒక హిట్ కోసం దర్శకులను వెతకడం లేదు. కొత్త మేకింగ్ స్టైల్స్ కోసం చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంతే కాదు.. జవాన్ తర్వాత సౌత్‌ పై ఆయన నమ్మకం మాత్రం మరో రేంజ్ కు వెళ్లిందనిపిస్తోంది.