Begin typing your search above and press return to search.

చిన్నతనంలోనే అమ్మానాన్న దూరమై ఇల్లు లేక బాధపడ్డాను!

చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయి సొంతిల్లు లేకపోవడం తనను ఎంతో బాధించేదని షారుఖ్ ఖాన్ గుర్తుచేసుకున్నారు. పెళ్లి తర్వాతే గౌరీ ఖాన్‌తో కలిసి సొంతింటి కల నెరవేరిందన్నారు. ముంబైలోని మన్నత్ కూడా ఒకప్పుడు తన స్థాయికి మించిన ఇల్లేనని చెప్పారు. కష్టపడి నిజాయితీగా కలలు కంటే అవి తప్పకుండా నెరవేరుతాయని అభిప్రాయపడ్డారు.

By:  Srikanth Kontham   |   12 Nov 2026 7:00 PM IST
చిన్నతనంలోనే అమ్మానాన్న దూరమై ఇల్లు లేక బాధపడ్డాను!
X

బాద్‌షా షారుఖ్ ఖాన్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను పెద్ద స్టార్. కోట్లాది రూపాయల సామ్రాజ్యానికి అధిపతి. అయితే షారుక్ ఈ స్థాయికి రాకముందు పడ్డ‌ కష్టాలను..బాల్యపు గుర్తులను ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేరు. తాజాగా ఓ కార్యక్ర మంలో షారుఖ్ ఖాన్ జీవితానికి సంబంధించి బ‌య‌ట ప్ర‌పంచానికి తెలియని కొన్ని భావోద్వేగ విష యాలను పంచుకున్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడం వల్ల తనకంటూ సొంతిల్లు లేదనే వెలితి ఉండేదని షారుక్ గుర్తు చేసుకున్నారు.

చిన్నతనంలో సొంతిల్లు లేకపోవడంతో ఇల్లు సంపాదించాలనేదే షారుక్ జీవితంలోని అతిపెద్ద కలగా మారిందన్నారు. `నాకు కుటుంబం అంటే ఇష్టం. నా పని అంటే ప్రాణం. కానీ ఈ ప్రపంచంలో వీట‌న్నింటికే ఎక్కువగా సొంతిల్లు ఉండాలనే కోరుకున్నాను. వివాహం అయ్యే వరకు నాకంటూ సొంత ఇల్లు లేదని గౌరీ ఖాన్‌ను పెళ్లి చేసుకున్న తర్వాతే ఓ ఇల్లు అమ‌రింద‌ని` షారుఖ్ గుర్తు చేసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా షారుక్ కలల సౌధమైన ముంబైలోని మన్నత్ బంగ్లా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `మేము కొనుగోలు చేసిన మొదటి ఇల్లు మా స్థోమతకు మించి ఉండేది. ఆ తర్వాత కొన్న చివరి ఇల్లు `మన్నత్` కూడా ఒకానొక సమయంలో నా ఆర్థిక స్థాయికి మించిందే. అయినా? సొంతిల్లు కొనాలని నిజాయితీగా కలలు కనేవారికి దేవుడు ఎప్పుడూ సహాయం చేస్తాడని.. మనం మనల్ని నమ్ముకుంటే మన కలల ఇల్లు కచ్చితంగా సొంతమ వుతుందని షారుక్ ఆశాభావం వ్యక్తం చేశారు.

కుటుంబ సభ్యులు కూడా తన ఇంటి పిచ్చిని చూసి సరదాగా నవ్వుకుంటార‌ని షారుఖ్ అన్నారు. కుటుంబంతో కొత్త నగరానికి వెళ్లినప్పుడ‌ల్లా? అక్కడా ఓ ఇల్లు కొనాలని అటాన‌ని ప్రతి నగరంలో ఇల్లు ఉండటం సాధ్యం కాదని పిల్లలు ఏడిపిస్తుంటారని షారుక్ సరదాగా వ్యాఖ్యానించారు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా? రోజంతా కష్టపడి అలసి ఇంటికి తిరిగొచ్చిన‌ప్పుడు సొంతింట్లోనే అసలైన ప్రశాంతత దొరుకుతుందని షారుక్ అభిప్రాయపడ్డారు.

ఇక షారుక్ ఖాన్ సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం `కింగ్` చిత్రంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. సిద్దార్ద్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సినిమా షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అన్ని ప‌నులు పూర్తి చేసుకుని డిసెంబ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి.