Begin typing your search above and press return to search.

షారుక్ ఖాన్‌ ఒక్కో ఇల్లు రూ.50 కోట్లు.. అయినా కొనడానికి పోటీపడ్డ కుబేరులు!

దుబాయ్‌లో డాన్యూబ్ ప్రాపర్టీస్ నిర్మిస్తున్న షారుఖ్ ఖాన్ ‘షారుఖ్జ్ రెసిడెన్సెస్’లోని అన్ని లగ్జరీ పెంట్‌హౌస్‌లు అధికారిక ప్రారంభానికి ముందే అమ్ముడయ్యాయి. గౌరీ ఖాన్ డిజైన్ చేసిన ఒక్కో పెంట్‌హౌస్ ధర రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ఉంది. నవంబర్ 11న జరిగిన ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో ఈ విషయాన్ని డాన్యూబ్ గ్రూప్ ఛైర్మన్ రిజ్వాన్ సజన్ వెల్లడించారు.

By:  Priya Chowdhary Nuthalapti   |   12 Nov 2026 6:00 PM IST
షారుక్ ఖాన్‌ ఒక్కో ఇల్లు రూ.50 కోట్లు.. అయినా కొనడానికి పోటీపడ్డ కుబేరులు!
X

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈ హీరో వల్ల.. ఒక ప్రాజెక్ట్ తెగ క్లిక్ అయ్యి అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అసలు విషయానికి వస్తే..తాజాగా దుబాయ్‌లో షారుక్ ఖాన్ పేరు మీద నిర్మిస్తున్న లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్.. కోట్ల రూపాయల లాభం తెచ్చిపెడుతోంది.

ఈ ప్రాజెక్టులో భాగంగా గౌరీ ఖాన్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఖరీదైన పెంట్‌హౌస్‌లన్నీ.. అధికారిక ప్రారంభోత్సవానికి ముందే.. అమ్ముడైపోయాయి. ఒక్కో పెంట్‌హౌస్ ధర సుమారు రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ఉండటం విశేషం.

దుబాయ్‌లోని డాన్యూబ్ ప్రాపర్టీస్ సంస్థ నిర్మిస్తున్న 'షారుఖ్జ్ రెసిడెన్సెస్' ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం నవంబర్ 11న ఘనంగా జరిగింది. కోకా-కోలా అరేనాలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి షారుక్ ఖాన్, ఆయన భార్య గౌరీ ఖాన్, డాన్యూబ్ గ్రూప్ ఛైర్మన్ రిజ్వాన్ సజన్, మేనేజింగ్ డైరెక్టర్ అడెల్ సజన్ హాజరయ్యారు. ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఈ సందర్భంగా డాన్యూబ్ గ్రూప్ ఛైర్మన్ రిజ్వాన్ సజన్ పెంట్‌హౌస్‌ల అమ్మకాల గురించి ప్రకటించారు. మొత్తం పెంట్‌హౌస్‌లు అమ్ముడైనట్లు వెల్లడించారు. ముఖ్యంగా రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల ధర ఉన్న ఈ ఇళ్లకు మొదట భారీ డిమాండ్ వచ్చిందని తెలిపారు. ప్రాజెక్ట్ వెనుక రిజ్వాన్ సజన్ విజన్, కృషి ఉన్నాయని ప్రశంసించారు.

ఈ ప్రాజెక్టులోని పెంట్‌హౌస్‌లను గౌరీ ఖాన్ స్వయంగా డిజైన్ చేశారు. ఇప్పటికే ఎన్నో విలాసవంతమైన ఇళ్లకు ఇంటీరియర్ డిజైనింగ్ చేసిన ఆమెకు, తన భర్త పేరు మీద రూపొందుతున్న ప్రాజెక్టులో భాగం కావడం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి అని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో చెప్పకొచ్చారు.

ఇక ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటూనే పెద్ద మాన్షన్‌లో నివసిస్తున్న అనుభూతి కలిగేలా వీటిని డిజైన్ చేసినట్లు చెప్పారు. ఖరీదైన ఇటాలియన్ ఫర్నిచర్, విశాలమైన లివింగ్ రూమ్స్, ప్రత్యేకమైన కిచెన్స్, సముద్రం కనిపించే అందమైన వ్యూస్.. ఈ ఇంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.