Begin typing your search above and press return to search.

"షారుఖ్ ఖాన్ ఫిలిం ఫెస్టివల్".. ప్రత్యేకతలివే!

అందులో భాగంగానే "షారుఖ్ ఖాన్ ఫిలిం ఫెస్టివల్" పేరిట.. దిల్ సే, ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ప్రెస్, మై హూనా, దేవదాస్ ఇలా మొత్తం ఐదు చిత్రాలు రీ రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి.

By:  Madhu Reddy   |   27 Oct 2025 2:00 AM IST
షారుఖ్ ఖాన్ ఫిలిం ఫెస్టివల్.. ప్రత్యేకతలివే!
X

బాలీవుడ్ బాద్ షాగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న షారుఖ్ ఖాన్ నవంబర్ 2వ తేదీన అంగరంగ వైభవంగా తన 60వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకోబోతున్నారు. అయితే తమకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ అలరిస్తున్న తమ అభిమాన హీరో కోసం ఏదైనా బహుమతి ఇవ్వాలని తలచిన అభిమానులు "షారుఖ్ ఖాన్ ఫిలిం ఫెస్టివల్ " పేరుతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. ముఖ్యంగా ఇప్పటివరకు ఏ హీరోకి దక్కని ఘనత రూపంలో అభిమానులు ఈ కార్యక్రమానికి పూనుకున్నారు. మరి షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా షారుఖ్ ఖాన్ కోసం నిర్వహించనున్న ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత లేంటో ఇప్పుడు చూద్దాం.

అసలు విషయంలోకి వెళ్తే.. ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ చిత్రాల హవా ఎక్కువగా కొనసాగుతోంది. అందులో భాగంగానే అభిమాన హీరోలకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన రోజు వచ్చిందంటే చాలు.. వారి సినీ కెరియర్లో బ్లాక్ మాస్టర్ గా నిలిచిన చిత్రాలను రీ రిలీజ్ చేసి అటు నిర్మాతలకు కూడా మంచి లాభాలను తెచ్చిపెడుతున్నారు. ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ గా నిలిచిన ఐదు చిత్రాలను ఇప్పుడు రీ రిలీజ్ చేయడానికి అటు అభిమానులు ఇటు మేకర్స్ సిద్ధం అయిపోయారు.

అందులో భాగంగానే "షారుఖ్ ఖాన్ ఫిలిం ఫెస్టివల్" పేరిట.. దిల్ సే, ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ప్రెస్, మై హూనా, దేవదాస్ ఇలా మొత్తం ఐదు చిత్రాలు రీ రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. అలాగే ఈ ఫిలిం ఫెస్టివల్ అక్టోబర్ 31 నుండి నవంబర్ 14 వరకు ఇండియాలోని పీవీఆర్ ఐనాక్స్ థియేటర్ లతో పాటూ న్యూజిలాండ్, ఉత్తర అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, యూరప్ వంటి దేశాలలో యష్ రాజ్ ఫిలిమ్స్ సహకారంతో ఈ చిత్రాలు ప్రదర్శించనున్నారు. ప్రస్తుతం ఈ విషయం తెలిసి షారుఖ్ ఖాన్ అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబతున్నారు. ఏది ఏమైనా ఒక హీరోకి సంబంధించి ఇలాంటి కార్యక్రమం చేపట్టడమే కాకుండా దాదాపు ఐదు సినిమాలు రీ రిలీజ్ చేయడానికి సన్నహాలు సిద్ధం చేస్తుండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా మరొకవైపు షారుక్ ఖాన్ కెరియర్ లోనే ఐకానిక్ సినిమాలుగా నిలిచిన చిత్రాలు ఇప్పుడు రీ రీలీజ్ కాబోతుండడంతో ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ.."ఈ సినిమాలోని నా పాత్రలు ఇప్పటికీ కూడా అభిమానుల గుండెల్లో నిలిచిపోయాయి.. నేను మాత్రం మారలేదు. కేవలం నా జుట్టు మాత్రమే కాస్త స్టైలిష్ గా మారింది. ఈ ఫెస్టివల్ ద్వారా అభిమానులతో మళ్ళీ ఆ బంధాన్ని పంచుకోవడానికి చాలా సంతోషంగా ఉంది" అంటూ షారుఖ్ ఖాన్ తెలిపారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి.

షారుఖ్ ఖాన్ విషయానికి వస్తే.. ఇటీవలే ఈయన కొడుకు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన.. దీనిని నేరుగా ఓటీటీ నెట్ఫ్లిక్స్ లో విడుదల చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇందులో పలువురు సెలబ్రిటీలు కూడా నటించారు. అలాగే ఈయన కూతురు సుహానా ఖాన్ కూడా ఇప్పుడు 'కింగ్' సినిమాతో అరంగేట్రం చేస్తోంది. ఇందులో షారుక్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.