ఆ కేసులో షారుక్, దీపికకు ముందస్తు బెయిల్
తయారీలో లోపాలున్న ఓ వాహనానికి సంబంధించిన మోసం కేసులో బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణెతో పాటూ హ్యుండయ్ కు చెందిన ఆరుగురు అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
By: Sravani Lakshmi Srungarapu | 11 Sept 2025 1:19 PM ISTబాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణెకు రాజస్థాన్ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హ్యుండాయ్ కార్ల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న షారుక్, దీపికలపై రాజస్థాన్ కు చెందిన కీర్తి సింగ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వారిద్దరూ కార్ల కంపెనీని ప్రమోట్ చేయడం వల్ల తాను ఓ కారు కొని నష్టపోయానని, వారిద్దరూ కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన కేసు వేశారు.
తయారీలో లోపాలున్న ఓ వాహనానికి సంబంధించిన మోసం కేసులో బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణెతో పాటూ హ్యుండయ్ కు చెందిన ఆరుగురు అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. షారుక్, దీపికా హ్యుండయ్ ఆటోమొబైల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. రాజస్థాన్ లోని భరత్‌పూర్ లో ఈ కేసులో సదరు నటులపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
తప్పుదోవ చేసేలా సెలబ్రిటీల ఎండార్స్‌మెంట్స్
2022లో కొనుగోలు చేసిన హ్యుండాయ్ అల్కాజర్ ఎస్‌యూవీలో కొన్ని నెలల్లోనే టెక్నికల్ ఇష్యూస్ రావడంతో కీర్తి సింగ్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి కంప్లైంట్ చేశారు. ఎన్నిసార్లు ఫాలో అప్ చేసినా కంపెనీ వారు ప్రాబ్లమ్ ను సాల్వ్ చేయకపోవడంతో సమస్యలను పరిష్కరించడంలో కంపెనీ విఫలమైందని ఆరోపించారు. ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేసినందుకు దీపికా, షారుఖ్ ను కూడా ఆయన నిందితులుగా పేర్కొన్నారు.
ఇష్టమైన బ్రాండ్లను ప్రమోట్ చేసినందుకు షారుఖ్, దీపికా బాధ్యత వహించాలని, వారి ఎండార్స్‌మెంట్స్ వినియోగదారులను తప్పుదోవ పట్టించాయని చెప్పగా, రాజస్తాన్ హైకోర్టును నటీనటులు ఆశ్రయించారు. కేసును పరిశీలించిన కోర్టు వారికి ముందుస్తు బెయిల్ మంజూరు చేసి నెక్ట్స్ విచారణను సెప్టెంబర్ 25న ఉంటుందని పేర్కొంది.
