నో టీజర్..ట్రైలర్.. కీలక సీన్‌నే రిలీజ్ చేశారు!
తాజాగా విడుదల చేసిన వీడియో ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. సంతోష్ నారయణ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని తమిళంతో పాటు తెలుగులోనూ అక్టోబర్‌లో రిలీజ్ చేయనున్నారు.
By: Ravindar Gorantla | 17 Feb 2026 11:33 AM ISTవిభిన్నమైన కథలని ఎంచుకుంటూ సరికొత్త చిత్రాలని ప్రేక్షకులకు అందిస్తున్నాడు కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్. కొత్త దనంతో కూడుకున్న కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలతో కథానాయకుడిగా ప్రత్యేకతను చాటుకున్న శివకార్తికేయన్ ఈ ఏడాది పొంగల్‌కు `పరాశక్తి` మూవీతో తమిళ, తెలుగు ప్రేక్షకులని అలరించిన విషయం తెలిసిందే. ఈ మూవీ తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా విడుదలైన అన్ని భాషల్లో రూ.100 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి హీరోగా శివకార్తికేయన్ సత్తా ఏంటో నిరూపించింది.
ఈ మూవీ తరువాత శివ కార్తికేయన్ తన 26వ ప్రాజెక్ట్‌గా `సియోన్`ని ప్రకటించాడు. రాజ్ కమల్ ఇంటర్నేషన్ బ్యానర్‌పై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. శివ కుమార్ మురుగేషన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే పక్కా రూటెడ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతోంది. సోమవారం శివ కార్తికేయన్ మాసీవ్ లుక్‌ని పరిచయం చేసిన మేకర్స్ మంగళవారం (ఫిబ్రవరి 17) `సియోన్ సెలబ్రేషన్స్` పేరుతో ఓ ఆసక్తికరమైన వీడియోని విడుదల చేశారు.
మూడు నిమిషాల 21 సెకన్‌ల నిడివితో సాగే వీడియోని విడుదల చేశారు. జాతర, పోలీస్టేషన్, పెరుమాళ్ స్వామిగా శివకార్తికేయన్ ఎంట్రీకి సంబంధించిన సన్నివేశాలతో ఈ వీడియో ఆకట్టుకుంటోంది. పక్కా తమిళ నేటివిటీతో సాగే ఈ సన్నివేశాలు సినిమా ఏ స్థాయిలో ఉంటుందనే సంకేతాల్ని అందించి ప్రాజెక్ట్‌పై అంచనాల్ని పెంచేస్తోంది. చేతిలో ఐరన్ రాడ్, దానికి గజ్జలు.. కుడి చేతిలో మండుతున్న కాగడా... అడుగులు తడబడుతూ పెరుమాళ్ స్వామిగా శివకార్తికేయన్ కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. టీజర్, ట్రైలర్ కాకుండా ఏకంగా మూడు నిమిషాల 21 సెకన్‌ల వీడియోని విడుదల చేయడం కొత్తగా ఉంది.
ఇందులో శివకార్తికేయన్ సుబ్రహణ్యేశ్వర స్వామి అంశలో పుట్టిన యువకుడిగా, దేవుడికి ప్రతిరూపంగా మాస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. తాజాగా విడుదల చేసిన వీడియో ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. సంతోష్ నారయణ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని తమిళంతో పాటు తెలుగులోనూ అక్టోబర్‌లో రిలీజ్ చేయనున్నారు. తాయ్ కిళవి` చిత్రానికి దర్శకత్వం హించిన శివ కుమార్ మురుగేషన్కిది ఫస్ట్ బిగ్ ఫిల్మ్. ఫస్ట్ మూవీ `తాయ్ కిళవి` ఈ ఫిబ్రవరి 27న విడుదల కాకుంది. అది రిలీజ్ కాకుండానే శివకార్తికేయన్, రాజ్ కమల్ ఇంటర్నేషన్ వంటి పేరున్న వారితో తనకు సినిమా చేసే అవకాశం రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోది.
రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఇదివరకే శివకార్తికేయన్ `అమరన్ ` వంటి బ్లాక్ బస్టర్ మూవీని చేయడం తెలిసిందే. ఆ హిట్ తరువాత మరోసారి కమల్, శివకార్తికేయన్‌ల కాంబినేషన్‌లో పక్కా రూటెడ్ స్టోరీతో రానున్న `సియోన్` మూవీపై సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ వీడియో అందుకు ఏ మాత్రం తగ్గని స్థాయిలో ఉండటంతో ఈ సారి కమల్, శివకార్తికేయన్ తమిళ రూటెడ్ స్టోరీతో ప్రేక్షకుల్ని సర్‌ప్ఐజ్ చేయబోతున్నారని అర్థమవుతోంది.
