ఒక్క సినిమా వల్ల ఇంత గజిబిజినా?
టాలీవుడ్ లోని సినిమాల రిలీజ్ డేట్లు సస్పెన్స్ సినిమాలను మించిపోతున్నాయి. రోజురోజుకీ సినిమాల రిలీజ్ డేట్లలో మార్పులు రావడం, రోజుకో కొత్త వార్త వినిపించడం చాలా కామనైపోయింది.
By: Sravani Lakshmi Srungarapu | 24 Aug 2025 3:00 AM ISTటాలీవుడ్ లోని సినిమాల రిలీజ్ డేట్లు సస్పెన్స్ సినిమాలను మించిపోతున్నాయి. రోజురోజుకీ సినిమాల రిలీజ్ డేట్లలో మార్పులు రావడం, రోజుకో కొత్త వార్త వినిపించడం చాలా కామనైపోయింది. ఇప్పుడు సెప్టెంబర్ లో వచ్చే సినిమాల లిస్ట్ కూడా అంతే అయింది. సెప్టెంబర్ లో వచ్చే ఒక్క సినిమా రిలీజ్ డేట్ మారడం వల్ల మిగిలిన రిలీజులన్నీ మారనున్నట్టు తెలుస్తున్నాయి.
మిరాయ్.. రెండు వారాలు వెనక్కి..
ఆగస్ట్ 27న రిలీజవాల్సిన మాస్ జాతర సినిమా అనుకోకుండా వాయిదా పడటంతో వినాయక చవితికి పెద్దగా హడావిడి ఏం కనిపించడం లేదు. అయితే ఆగస్ట్ ముగిసినా సెప్టెంబర్ లో చాలానే రిలీజులున్నాయి. హను మాన్ ఫేమ్ తేజ సజ్జ హీరోగా వస్తోన్న మిరాయ్ సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ కావాల్సింది కానీ ఇప్పుడు ఆ సినిమా మరో రెండు వారాలు వెనక్కి వెళ్లినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మేకర్స్ నుంచి ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.
ఓ రోజు ముందుగా ఘాటీ?
ఈటీవీ విన్ ఒరిజినల్ మూవీ లిటిల్ హార్ట్స్ ఆ డేట్ ను వాడుకోవడానికి రెడీ అయింది. రీసెంట్ గా రిలీజైన లిటిల్ హార్ట్స్ ట్రైలర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక సెప్టెంబర్ 5న వస్తుందని చెప్పిన అనుష్క ఘాటీ ఓ రోజు ముందుకు జరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. శివ కార్తికేయన్ మదరాసి సెప్టెంబర్ 5నే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.
ఆగస్ట్ నుంచి పోస్ట్‌పోన్ అయిన మాస్ జాతర సెప్టెంబర్ లో అంటున్నారు కానీ క్లారిటీ లేదు. అయితే తేజ సజ్జ మిరాయ్ సినిమా వల్ల ఆ తర్వాత సెప్టెంబర్ 12న రావాల్సిన బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కింధపురి లాంటి సినిమాలకు ఎఫెక్ట్ పడొచ్చు. ఆ సినిమా వాయిదా పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక సెప్టెంబర్ 25న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజి రిలీజ్ కానుంది. ప్రస్తుతానికైతే సెప్టెంబర్ రిలీజుల్లో ఇలా రీషెడ్యూల్ అయ్యే అవకాశముంది. వీటిలో మళ్లీ మార్పులు జరిగినా షాకయ్యే పన్లేదు.
