Begin typing your search above and press return to search.

టాలీవుడ్.. నెలంతా లాభాలే లాభాలు!

ఆ తర్వాత వారం.. మిరాయ్, కిష్కింధపురి సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ రెండు చిత్రాలు.. వాటిని అందుకుని సత్తా చాటాయి.

By:  M Prashanth   |   20 Sept 2025 8:04 PM IST
టాలీవుడ్.. నెలంతా లాభాలే లాభాలు!
X

మరో పది రోజుల్లో సెప్టెంబర్ నెల పూర్తి కానుంది. ఎప్పటిలానే అనేక తెలుగు సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద లక్ ను టెస్ట్ చేసుకోవడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే సెప్టెంబర్ నెల అంతా థియేటర్స్ కళకళలాడాయి. ఇప్పటికీ ఆడుతూనే ఉన్నాయి. ఎన్నాళ్లకెన్నాళ్లకు అన్నట్లు ఉంది పరిస్థితి.

వివిధ సినిమాలు సూపర్ హిట్ గా నిలవడంతో థియేటర్స్ కు ఆడియన్స్ తరలివెళ్తున్నారు. సినిమాలు చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. చాలా గ్యాప్ తర్వాత ఇలా కొన్ని రోజులుగా వసూళ్ల విషయంలో భారీ నెంబర్స్ నమోదు అవుతున్నాయి.

సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ అయిన లిటిల్ హార్ట్స్ మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. చిన్న మూవీగా విడుదలైన ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. ఇప్పటి వరకు రూ.34 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు అందుకుని దూసుకుపోతోంది. బడ్జెట్ కు ఐదు రెట్లు లాభాలు సాధించింది. మరిన్ని ప్రాఫిట్స్ అందుకునే దిశలో మూడో వారంలో అడుగుపెట్టింది.

ఆ తర్వాత వారం.. మిరాయ్, కిష్కింధపురి సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ రెండు చిత్రాలు.. వాటిని అందుకుని సత్తా చాటాయి. రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుని లాభాల బాటలో పయనిస్తున్నాయి.

అటు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన మిరాయ్.. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి అరుదైన ఘనతను అందుకుంది. ఇప్పుడు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కొనసాగిస్తోంది. ఇటు కిష్కింధపురి ఇప్పటి వరకు రూ.22 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. కేవలం తెలుగులోనే రిలీజ్ అయిన ఆ మూవీ.. ఓ రేంజ్ లో సందడి చేస్తోంది.

అలా సెప్టెంబర్ లో లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కింధపురి.. పోటీ పడుతూనే బాక్సాఫీస్ వద్ద రాణిస్తున్నాయి. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ సెప్టెంబర్ 25వ తేదీన విడుదల కానుంది. భారీ అంచనాల మధ్య వస్తున్న ఆ మూవీ.. ఓ రేంజ్ లో వసూళ్లు రాబట్టడం ఖాయం. దీంతో సెప్టెంబర్ నెలంతా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షమే. మేకర్స్ కు లాభాలే లాభాలు.