Begin typing your search above and press return to search.

ఆ రీమేక్ లో క‌ష్ట‌ప‌డే హీరోకే ఛాన్స్!

ఇటీవ‌లే మ‌ల‌యాళంలో రిలీజ్ అయిన `తుడ‌రుమ్` ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే.

By:  Srikanth Kontham   |   4 Dec 2025 4:00 PM IST
ఆ రీమేక్ లో క‌ష్ట‌ప‌డే హీరోకే ఛాన్స్!
X

ఇటీవ‌లే మ‌ల‌యాళంలో రిలీజ్ అయిన `తుడ‌రుమ్` ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వ‌ద్ద 200 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించింది. మొహ‌న్ లాల్, శోభ‌న‌, ప్ర‌కాష్ వ‌ర్మ , థామ‌స్ మాథ్యు, బిను ప‌ప్పు ప్ర‌ధాన పాత్ర‌ల్లో త‌రుణ్ మూర్తి తెర‌కెక్కించిన క్రైమ్ డ్రామా థ్రిల్ల‌ర్ ఇది. ఈ మ‌ధ్య కాలంలో భారీ విజ‌యం సాధించిన క్రైమ్ థ్రిల్ల‌ర్ లో ఈ చిత్రం నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంది. ఈ నేప‌థ్యంలో సినిమా రైట్స్ కోసం అన్ని భాష‌ల నుంచి మంచి పోటీ క‌నిపిస్తుంది. ప్ర‌ముఖుంగా తెలుగు, హిందీ భాష‌ల్లో పోటీ ఎక్కువ‌గా ఉంది. ఈ నేప‌థ్యంలో హిందీలో ఈ చిత్రాన్ని త‌రుణ్ మూర్తి రీమేక్ బాద్య‌త‌లు తీసుకున్నాడు.

టాలీవుడ్ లోనూ తానే డైరెక్ట‌రా?

ఇప్ప‌టికే అక్క‌డ షూటింగ్ కూడా ప్రారంభం కావాల్సి ఉంద‌ని అనివార్య కార‌ణాల‌తో వీలు ప‌డ‌లేదన్నారు. అయితే ఇందులో మొహ‌న్ లాల్ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తున్నారు? అన్న‌ది రివీల్ చేయ‌లేదు. కానీ ఆపాత్ర‌కు ఏ హీరోను తీసుకుంటారు? అనే ప్ర‌శ్న‌కు అజ‌య్ దేవ‌గ‌ణ్ అయితే బాగా కష్ట‌ప‌డ‌తార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. బాలీవుడ్ హీరోల్లో త‌న‌కు బాగా న‌చ్చిన న‌టుడిగా అజ‌య్ పేరు చెప్పారు. దీంతో లాల్ పాత్ర‌కు అజ‌య్ నే తీసుకునే అవ‌కా శాలున్నాయి. అలాగే తెలుగులో కూడా రీమేక్ అవుతుంది. కానీ ఆ ఛాన్స్ అత‌డే తీసుకుంటాడా? మ‌రో ద‌ర్శ‌కుడికి అప్ప‌జెప్పుతాడా? అన్న‌ది చూడాలి.

టాలీవుడ్ సీనియ‌ర్స్ లో ఎవ‌రిదా ఛాన్స్:

మ‌రి హీరో ఎవ‌రు? అంటే టాలీవుడ్ లో కూడా అంతే క‌ష్ట‌ప‌డే న‌టుడికే ఛాన్స్ ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఆ ఛాన్స్ కూడా సీనియ‌ర్ హీరోల‌కే ఉంటుంది. మాతృక‌లో న‌టించిన మోహ‌న్ లాల్ సీనియ‌ర్ న‌టుడు. మొహ‌న్ లాల్ వ‌య‌సు 65 ఏళ్లు, కాగా అజ‌య్ దేవ‌గ‌ణ్ వ‌య‌సు 56 ఏళ్లు. ఈ నేప‌థ్యంలో తెలుగులో 50 ఏళ్లు దాటిన న‌టుడికే ఆ ఛాన్స్ ఉంటుంది. అందులో టాలీవుడ్ నుంచి ఆ న‌లుగురు సీనియ‌ర్స్ కూడా ఈ క‌థ‌కు అర్హులే. చిరంజీవి వ‌య‌సు 70 ఏళ్లు కాగా, వెంకేష్‌, నాగార్జున, బాల‌య్య వ‌య‌సులు దాదాపు స‌మానం.

అంతా రీమేక్ రాజాలే:

వాళ్లు కూడా ఇప్ప‌టికే 60 ఏళ్లు క్రాస్ చేసారు. మ‌రి వీరిలో క‌ష్ట‌ప‌డే న‌టుడు ఎవ‌రు? అంటే అంద‌రూ శ్ర‌మించే న‌టులే. కానీ ఆ థ్రిల్ల‌ర్ కు ఏ న‌టుడు సూట‌వుతాడు? అన్న‌దే కీల‌కం. అలాగే రీమేక్ సినిమాల‌కు అభ్యంత‌రం చెప్పే న‌టులు కాదు. ఆ సీనియ‌ర్ హీరోలంతా రీమేక్ రాజేలా. స‌రైన క‌థ‌లు దొర‌క‌ని సంద‌ర్భంలో రీమేక్ ల‌పైనే ఆధార ప‌డుతుంటారు.