Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : 30 ఇయర్స్ ఇండస్ట్రీ కలయిక!

యంగ్‌ అండ్‌ డైనమిక్‌ డైరెక్టర్స్‌తో సీనియర్‌ సిటిజన్స్‌.. స్పెల్లింగ్‌ తప్పు.. సీనియర్‌ యాక్టర్స్‌ అంటూ బ్రహ్మాజీ తనదైన చతురత ఇక్కడ ప్రదర్శించాడు.

By:  Ramesh Palla   |   24 Aug 2025 3:54 PM IST
పిక్‌టాక్‌ : 30 ఇయర్స్ ఇండస్ట్రీ కలయిక!
X

టాలీవుడ్‌ సీనియర్‌ హీరోలు, హీరోయిన్స్ రెగ్యులర్‌గా గెట్‌ టు గెదర్‌ కావడం మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా 1980 టైమ్‌ హీరోలు ప్రతి ఏడాది గెట్‌ టు గెదర్‌ ఏర్పాటు చేసుకుని ఎంజాయ్‌ చేయడం, అందుకు సంబంధించిన ఫోటోలను షేర్‌ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. హీరోలు, హీరోయిన్స్‌ మాత్రమే కాకుండా అప్పుడప్పుడు దర్శకులు, ఇండస్ట్రీకి చెందిన ఇతర వర్గాల వారు సైతం గెట్ టు గెదర్‌ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సాధారణంగా సెలబ్రిటీలు ఇద్దరు ముగ్గురిని ఒక్క చోట చూడటం చాలా స్పెషల్‌గా చూస్తూ ఉంటాం. అలాంటిది పదుల సంఖ్యలో సెలబ్రెటీలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అలాంటి ఫోటోలు ఎప్పుడూ వైరల్‌ అవుతూ ఉంటాయి.

బండ్ల గణేష్‌ ఏర్పాటు చేసిన పార్టీ

హీరోయిన్స్‌, హీరోలు ఇద్దరు ముగ్గురు కలిసి కనిపించిన ఫోటోలు వైరల్‌ అయినట్లుగానే, తాజాగా సీనియర్‌ నటులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో వైరల్‌ అవుతోంది. 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ అంటూ బ్రహ్మాజీ షేర్‌ చేసిన ఈ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చాలా మంది నటులు ఈ పార్టీకి హాజరు అయ్యారు. ఈ పార్టీని నటుడు కమ్‌ నిర్మాత అయిన బండ్ల గణేష్‌ నిర్వహించాడు. ఇలాంటి గొప్ప మీట్‌ను ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు అంటూ బ్రహ్మాజీ ఎక్స్‌ ద్వారా పోస్ట్‌ చేశాడు. సీనియర్ నటులు ఇప్పటికీ చాలా మంది బిజీ బిజీగా సినిమాలు చేస్తూ ఉంటే, కొందరు మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. వీరు అంతా ప్రముఖ దర్శకులను కలవడంతో మరింతగా ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

ఎక్స్‌లో బ్రహ్మాజీ పోస్ట్‌

యంగ్‌ అండ్‌ డైనమిక్‌ డైరెక్టర్స్‌తో సీనియర్‌ సిటిజన్స్‌.. స్పెల్లింగ్‌ తప్పు.. సీనియర్‌ యాక్టర్స్‌ అంటూ బ్రహ్మాజీ తనదైన చతురత ఇక్కడ ప్రదర్శించాడు. ఆయన ఎప్పుడూ సరదాగా ఉంటాడు. ఈ ఫోటోల్లో కూడా ఆయన చాలా సరదాగా కనిపించారు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీతో వీరు కలిశారు. అంతే కాకుండా ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు ను సైతం వీరు కలవడం అందరి దృష్టిని ఆకర్షించింది. మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ స్టార్స్‌ ఇప్పటికీ మంచి గుర్తింపును కలిగి ఉన్నారు. ఏవో కారణాల వల్ల సినిమాల్లో నటించడం లేదు, కొందరు నటించాలి అనుకున్న ఆఫర్లు రాకపోవడంతో ఇండస్ట్రీలోనే ఉన్నా ఎక్కువగా కనిపించడం లేదు.

రాఘవేంద్ర రావు, కృష్ణవంశీ..

ఈ అరుదైన ఫోటోలో బ్రహ్మాజీ, అలీ, శివాజీ, శివాజీ గణేష్‌, శివాజీ రాజా, రాజా రవీంద్ర, బండ్ల గణేష్‌, శ్రీకాంత్‌ తదితరులు ఉన్నారు. ఎంతో మంది నటీనటులు వచ్చి పోతున్నా వీరు మాత్రం ఇండస్ట్రీలో అలా పాతుకు పోయారు. బ్రహ్మాజీ ఎప్పుడో ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈయన అత్యధిక సినిమాలు చేసిన నటుల జాబితాలో నిలుస్తారు. బ్రహ్మాజీ కామెడీ పాత్రలో చేసినా, విలన్‌ పాత్రలో చేసినా ఆయన ఆకట్టుకుంటారు. ఇక శ్రీకాంత్‌ విలన్‌గా టర్న్‌ తీసుకున్నాడు. ముందు ముందు మరిన్ని సినిమాలతో వచ్చే అవకాశం ఉంది. శివాజీ ఇప్పటికీ ముఖ్య పాత్రలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్‌ ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒకరు ఇద్దరు కాస్త స్లో అయినా ఇతరులు మంచి స్పీడ్‌ మీద ఉన్నారు.