Begin typing your search above and press return to search.

2026 లో సీనియ‌ర్ బ్యూటీలదే హ‌వా!

ఈ సినిమా విజ‌యంతో త్రిష టాలీవుడ్ లో బిజీ అవ్వాల‌ని ఎదురు చూస్తోంది. నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా `ది గ‌ర్ల్ ప్రెండ్` తో గ‌త ఏడాది మంచి విజ‌యాన్ని అందుకుంది.

By:  Srikanth Kontham   |   11 Jan 2026 7:00 AM IST
2026 లో సీనియ‌ర్ బ్యూటీలదే హ‌వా!
X

గ‌త ఏడాది పాన్ ఇండియా హీరోలే కాదు, సీనియ‌ర్ బ్యూటీలు కూడా వెండి తెర‌పై మెరిసింది లేదు. కొత్త సినిమాల‌కు క‌మిట్ అయినా అవి షూటింగ్ పూర్తి కాక‌పోవ‌డం స‌హా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ప్రేక్ష‌కుల‌కు దూరంగా ఉండాల్సి వ‌చ్చిం ది. కానీ 2026 లో మాత్రం సీనియ‌ర్ భామ‌లు త్రిష‌, న‌య‌న‌తార‌, సాయి ప‌ల్ల‌వి, ర‌ష్మికా మంద‌న్నా, త‌మ‌న్నా, స‌మంతా లాంటి భామ‌లు అల‌రించడానికి రెడీ అవుతున్నారు. ముందు గా లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార `మ‌న‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు` తో ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది. ఈసినిమాలో న‌య‌న‌తార ఎంతో అందంగా క‌నిపిస్తుంది.

సంప్ర‌దాయ చీర క‌ట్టులో న‌య‌న్ ఫోటోలు నెట్టింట వైర‌ల్ గానూ మారాయి. చిరుతో న‌య‌న్ రొమాంటిక్ స‌న్నివేశాలు పాట‌ల్లో అంతే అందంగా హైలైట్ అవుతున్నాయి. ఈ సినిమాతో పాటు, మ‌రో ఏడు సినిమాల‌తో అమ్మ‌డు ఏడాదంతా ప్రేక్ష‌కుల మ‌ధ్య‌లోనే ఉంటుంది. అలాగే మ‌రో సీనియ‌ర్ బ్యూటీ త్రిష ప‌దేళ్ల త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌కరి స్తుంది. చిరంజీవికి జోడీగా `విశ్వంభ‌ర‌`లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో జాప్యంగా కార‌ణంగా రిలీజ్ వాయిదా ప‌డుతోన్న‌నేప‌థ్యంలో ఎట్టి ప‌రిస్థితుల్లో స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమా విజ‌యంతో త్రిష టాలీవుడ్ లో బిజీ అవ్వాల‌ని ఎదురు చూస్తోంది. నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా `ది గ‌ర్ల్ ప్రెండ్` తో గ‌త ఏడాది మంచి విజ‌యాన్ని అందుకుంది. తొలి లేడీ ఓరియేంటెడ్ చిత్రంతోనే స‌క్సెస్ ను ఖాతాలో వేసుకుంది. దీంతో కొత్త ఏడాదిలో `మైసా` అనే హార‌ర్ థ్రిల్ల‌ర్ తో భారీ హిట్ అందుకోవాల‌ని ఎదురు చూస్తోంది. ఈ సినిమా రిలీజ్ తేదీ ఫిక్స్ అవ్వాల్సి ఉంది. `తండేల్` త‌ర్వాత తెలుగు సినిమాకు దూర‌మైన‌ సాయి ప‌ల్ల‌వి ఇదే ఏడాది `రామాయ‌ణం`తో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. హిందీ సినిమా అయినా పాన్ ఇండియాలో తెలుగు స‌హా అన్ని భాష‌ల్లోనూ రిలీజ్ అవుతున్న చిత్ర‌మిది.

ఇందులో అమ్మ‌డు సీత‌మ్మ పాత్ర‌లో అల‌రించ‌నుంది. `ఖుషీ` త‌ర్వాత తెలుగు తెర‌పై క‌నిపించ‌ని మ‌రో సీనియ‌ర్ స‌మంత ఇదే ఏడాది `మా ఇంటి బంగారం`తో అల‌రించ‌డానికి రెడీ అవుతోంది. నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్రాన్ని స‌మంత నటిస్తూ నిర్మిస్తోంది. స‌మంత నుంచి రిలీజ్ అవుతోన్న మ‌రో లేడీ ఓరియేంటెడ్ చిత్ర‌మిది.మిల్కీబ్యూటీ త‌మ‌న్నా మాత్రం హిందీకే పరిమిత‌మైంది. తెలుగులో అమ్మ‌డు కొత్త సినిమా ఏదీ చేయ‌లేదు. బాలీ వుడ్ లో న‌టిస్తోన్న మూడు చిత్రాలు ఇదే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. మ‌రి ఈ సినిమాల‌తో సీనియ‌ర్లు ఎంత బిజీ అవుతారో చూడాలి.