Begin typing your search above and press return to search.

కెరీర్‌కు గడువు ఉందా? సీనియర్ స్టార్స్ చెబుతున్న కొత్త సమాధానం!

ఇక 40 దాటితే చాలు ఇక తల్లి, పిన్ని పాత్రలకే పరిమితం కావాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది.

By:  Madhu Reddy   |   12 Feb 2026 7:00 PM IST
కెరీర్‌కు గడువు ఉందా? సీనియర్ స్టార్స్ చెబుతున్న కొత్త సమాధానం!
X

సినిమా ప్రపంచంలో నటీనటుల మీద భిన్నమైన అభిప్రాయం వుండేది. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఎక్కువ వుండేది. అంటే కేవలం ఇరవై ఏళ్ల ప్రాయం వారికే అవకాశాలు ఎక్కువ వస్తాయి అని అనుకునేవారు. ఇక 40 దాటితే చాలు ఇక తల్లి, పిన్ని పాత్రలకే పరిమితం కావాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని, ప్రతిభ ఉంటే ఏ వయసులోనైనా వెండితెరను ఏలవచ్చని మన సీనియర్ తారలు నిరూపిస్తున్నారు. అటు స్టార్ సీనియర్ హీరోస్ సత్తా చాటుతుంటే, వారితో పాటు పోటీ పడుతూ ఇప్పటికీ సీనియర్ తారలు అదరగొడుతున్నారు..

అలుపెరగని మన 'సీనియర్' హీరోలు:

తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ దశాబ్దాలుగా బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటుతూనే ఉన్నారు. 60 నుండి 70 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా డాన్సులు, ఫైట్లు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అయితే, వీరికి ఉన్నంత సుదీర్ఘ కెరీర్ హీరోయిన్లకు సాధ్యమేనా? అనే ప్రశ్న కు సమాధానం గా ఇటు టాలీవుడ్ మరియు బాలీవుడ్ భామలు సమాధానం ఇస్తున్నారు.

ట్రెండ్‌ను మార్చేస్తున్న సీనియర్ బ్యూటీస్:

బాలీవుడ్ వెండితెర రాణి మాధురీ దీక్షిత్ 50 ప్లస్ వయసులో కూడా ఓటీటీల్లో మరియు సినిమాల్లో తన మార్కు చూపిస్తోంది. మీకు తెలుసా? కాజోల్ ఇప్పటికీ లేడీ ఓరియెంటెడ్ కథలతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. వారి గ్లామర్ మరియు ఎనర్జీ నేటి తరం హీరోయిన్లకు సైతం స్ఫూర్తినిస్తాయి. ఇక పోతే, టబు గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి పాత్రలో వైవిధ్యం చూపిస్తూ ఇప్పటికీ మోస్ట్ వాంటెడ్ నటిగా కొనసాగుతోంది. అటు దక్షిణాదిలో రాధిక గారు అటు సినిమాలు, ఇటు సీరియళ్లు, రాజకీయం అంటూ అన్ని రంగాల్లోనూ చురుగ్గా ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.

గడువు ముగియని ప్రతిభ:

అసలు విషయం ఏమిటంటే, ఒకప్పుడు కథలు కేవలం టీనేజ్ ప్రేమ చుట్టూనే తిరిగేవి. కానీ ఇప్పుడు కథాంశాల్లో మార్పు వచ్చింది. జీవితానుభవం ఉన్న పాత్రలకు ప్రాధాన్యత పెరుగుతోంది. "రిటైర్మెంట్" అనే పదానికి వీరి డిక్షనరీలో చోటు లేదని ఈ తారలు నిరూపిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా తమకంటూ ప్రత్యేకమైన పాత్రలను సృష్టించుకుంటూ ముందుకు సాగుతున్నారు.

సినిమా రంగంలో కెరీర్ అనేది వయసు మీద కాదు, నటన మీద ఆధారపడి ఉంటుందని ఈ తారలు స్పష్టం చేస్తున్నారు. హీరోలతో సమానంగా హీరోయిన్లు కూడా సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోవడం మంచి పరిణామం. చరిష్మా ఉంటే చాలు, ఏ వయసులోనైనా స్టార్‌డమ్‌ను ఎంజాయ్ చేయవచ్చని వీరు నిరూపిస్తున్నారు.