సీనియర్ భామల కెరీర్ ఎలా ఉండబోతుంది?
కోటి ఆశలతో కొత్త ఏడాది 2026 లోకి అడుగు పెట్టేసాం. ఎవరి ప్రణాళికలు వారు సిద్దం చేసుకుంటున్నారు.
By: Srikanth Kontham | 2 Jan 2026 10:00 PM ISTకోటి ఆశలతో కొత్త ఏడాది 2026 లోకి అడుగు పెట్టేసాం. ఎవరి ప్రణాళికలు వారు సిద్దం చేసుకుంటున్నారు. గత ఏడాది సాధించలేనివి కనీసం కొత్త సంవత్సరంలోనైనా చేధించానని ఆశపడేవారెంతో మంది. మరి సీనియర్ భామలు ఈ ఏడాది ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. త్రిష, తమన్నా, కాజల్ అగర్వాల్, అనుష్క శెట్టిల ప్రయాణం ఎలా ఉండబోతుంది? అంటే వారిపై ఓ లుక్ వేయాల్సిందే. అందాల త్రిష ఈ ఏడాది మూడు సినిమాలతో మూడు భాషల్లో ప్రేక్షకుల ముందుకొస్తుంది. మెగాస్టార్ చిరంజీవికి జోడీగా `విశ్వంభర`లో నటించింది.
ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విజయం సాధిస్తే? త్రిషకు టాలీవుడ్ లో కలిసొస్తుంది. మిగతా సీనియర్ హీరోలతో బ్యాక్ టూ బ్యాక్ ఛాన్సులు అందు కోవచ్చు. తర్వాత తరం స్టార్లు కూడా పరిగణలోకి తీసుకునే అవకాశాలున్నాయి. అలాగే తమిళ్ లో `కరప్పు`లో నటించింది. ఈ సినిమా కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. మాలీవుడ్ లో రామ్ అనే చిత్రంలో నటిస్తోంది. గత ఏడాది పట్టాలెక్కిన సినిమా అనివార్య కారణాలతో డిలే అవుతుంది.
కానీ ఈ ఏడాది మాత్రం రిలీజ్ లాంఛనమే. ఆ భాషల్లో కూడా సక్సస్ కీలకమే. మరో నటి మిల్కీబ్యూటీ తమన్నా? లైనప్ చూస్తే మొత్తం బాలీవుడ్ కి పరిమితమైనట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం హిందీలోనే ఐదు సినిమాల్లో నటిస్తోంది. ఓ `రోమియో`, `రేంజర్`, రోహిత్ శెట్టి సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. ఈ మూడిటింపైనా భారీ అంచనాలే ఉన్నాయి. అలాగే `వి. శాంతారం` అనే చిత్రంతో పాటు `వివాన్` అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది.
ఇవన్నీ కూడా షూటింగ్ దశలోనే ఉన్నాయి. సౌత్ లో మాత్రం ఏ ఒక్క చిత్రం కమిట్ అవ్వలేదు. తమన్నా కూడా బాలీవుడ్ పైనే సీరియస్ గా పని చేస్తోంది. అందాల చందమామ కాజల్ 2025లో కనిపించ కపోయినా? కొత్త ఏడాదిలో మాత్రం అలరించడం ఖాయమే. మలయాళంలో `ఐయామ్ గేమ్` అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న `రామాయణం` రెండు భాగాల్లోనూ కీలక పాత్ర పోషిస్తోంది. `ది ఇండియన్ స్టోరీ` అనే మరో హిందీ సినిమా కూడా చేస్తోంది. తమిళ్ లో `ఇండియన్ 3`లో నటిం చింది. కానీ సినిమా రిలీజ్ కు నోచుకోలేదు. కొత్త ఏడాదిలోలైనా రిలీజ్ అవుతుందా? అన్నది చూడాలి.
స్వీటీ అనుష్క కు `భాగమతి` తర్వాత సరైన సక్సెస్ లేదు. చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. మరి 2026 లో నైనా కంబ్యాక్ అవుతుందా? అన్నది చూడాలి.` కథనార్: ది వైల్డ్ సార్సరర్` చిత్రంతో మాలీవుడ్ లో లాంచ్ అవుతుంది. చేతిలో ఉన్నది కూడా ఒకే ఒక్క చిత్రం. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంటే మలయాళంలో బిజీ అయ్యే అవకాశాలున్నాయి.
