Begin typing your search above and press return to search.

సీనియర్ బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్ చేసినట్టేనా..?

ఒకప్పుడు హీరోయిన్స్ కేవలం యువ హీరోలు కాస్త క్రేజ్ తెచ్చుకుంటే స్టార్ హీరోలతో నటించడానికి మాత్రమే ఇష్టపడే వారు.

By:  Ramesh Boddu   |   25 Oct 2025 9:15 AM IST
సీనియర్ బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్ చేసినట్టేనా..?
X

ఒకప్పుడు హీరోయిన్స్ కేవలం యువ హీరోలు కాస్త క్రేజ్ తెచ్చుకుంటే స్టార్ హీరోలతో నటించడానికి మాత్రమే ఇష్టపడే వారు. అమ్మాయి బాగుంది.. టాలెంట్ కూడా ఉంది కదా అని సీనియర్ హీరో ఛాన్స్ ఇస్తే మాత్రం బాబోయ్ వాళ్లతో చేస్తే ఇంకేమైనా ఉందా కెరీర్ కి ఎండ్ కార్డ్ పడినట్టే అని ఫీల్ అయ్యే వారు. స్టార్ ఫాలోయింగ్.. కోట్ల కొద్దీ అభిమానులు ఉన్నా కూడా అదేంటో సీనియర్ హీరో ఛాన్స్ అంటే చాలు ఆమడదూరం వెళ్లే వాళ్లు. అది వాళ్ల తప్పు కాదు సీనియర్స్ తో చేస్తే వీళ్లని సైడ్ చేస్తారన్న రూమర్ అలా క్రియేట్ అయ్యింది.

సీనియారిటీ ఉన్న కథానాయికలు సీనియర్ స్టార్స్ తో..

ఐతే ఇప్పుడు ఆ సీన్ పూర్తిగా మారిపోయింది. సినిమాలను సీనియర్, జూనియర్ అన్నది కాకుండా కథ పరంగా చూస్తున్నారు. అందుకే ఇప్పుడు సీనియర్ హీరోలతో కూడా జత కడుతున్నారు యువ హీరోయిన్స్. ఆల్రెడీ సీనియారిటీ ఉన్న కథానాయికలు సీనియర్ స్టార్స్ తో నటించడం లో కిక్ ఏముండదు. కానీ యువ హీరోయిన్స్ వారితో కలిసి నటిస్తేనే స్క్రీన్ చాలా అందంగా ఉంటుంది. అలాంటి కాంబినేషన్స్ ఇప్పుడు చాలా వస్తున్నాయి.

కన్నడ భామలు ఈ విషయంలో కూడా తన ముందుచూపుతో వెళ్తున్నారు. కన్నడ నుంచి వచ్చిన హీరోయిన్స్ కి పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ వస్తుంది. ఐతే వీరిలో కొంతమంది సీనియర్స్ తో నటించడం మాకు ఓకే అనేస్తున్నారు. ఆల్రెడీ ఆషిక రంగనాథ్ కింగ్ నాగార్జునతో నా సామి రంగ సినిమాలో నటించి మెప్పించింది. నెక్స్ట్ రవితేజతో అనార్కలిలో నటిస్తుంది అమ్మడు.

శ్రీనిధి నెక్స్ట్ బిగ్ స్టార్ ఛాన్స్..

ఇక ఇదే దారిలో కె.జి.ఎఫ్ భామ శ్రీనిధి శెట్టి కూడా విక్టరీ వెంకటేష్ తో జత కడుతుంది. త్రివిక్రం తో వెంకటేష్ చేస్తున్న సినిమాలో శ్రీనిధి హీరోయిన్ గా చేస్తుంది. ఈమధ్యనే తెలుసు కదా సినిమాలో సిద్ధుతో రొమాన్స్ చేసిన శ్రీనిధి నెక్స్ట్ బిగ్ స్టార్ ఛాన్స్ అందుకుంది. ఆల్రెడ్దీ వెంకటేష్ తో మీనాక్షి చౌదరి లాంటి భామలు చేశారు. సో సీనియర్స్ అని లైట్ తీసుకోకుండా వాళ్ల ఛాన్స్ తో టాప్ క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు సీనియర్ హీరోల సినిమాల్లోనే యాక్టింగ్ కి స్కోప్ ఉండే ఛాన్స్ ఉంటుంది.

అఖండ 2 లో కూడా సం యుక్త మీనన్ నటిస్తుంది. సో ఇలా ప్రతి హీరోయిన్ సీనియర్ హీరోనా స్టార్ హీరోనా అన్న తేడా లేకుండా వచ్చిన సినిమా ఛాన్స్ అందులో తమ పాత్ర ప్రాధాన్యత చూసి ముందడుగు వేస్తున్నారు. ఈ మార్పు వల్ల ఆడియన్స్ కి కూడా కొత్త కాంబినేషన్స్ చూసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.