Begin typing your search above and press return to search.

తాడోపేడో తేల్చుకోవాల్సిందే!

ఒక‌ప్పుడు హిట్ తో వెలిగిపోయిన హీరోలంతా ఇప్పుడు ప్లాప్ ల‌తో వెనుకబ‌డ్డారు. ఉన్న ప‌ళంగా హిట్ కొడితే త‌ప్ప ఫాంలో కి రావ‌డం క‌ష్టం.

By:  Srikanth Kontham   |   12 Jan 2026 8:15 AM IST
తాడోపేడో తేల్చుకోవాల్సిందే!
X

ఒక‌ప్పుడు హిట్ తో వెలిగిపోయిన హీరోలంతా ఇప్పుడు ప్లాప్ ల‌తో వెనుకబ‌డ్డారు. ఉన్న ప‌ళంగా హిట్ కొడితే త‌ప్ప ఫాంలో కి రావ‌డం క‌ష్టం. మ‌రోవైపు యువ హీరోలు విజ‌యాల‌తో దూసుకొస్తున్నారు. డిఫ‌రెంట్ కంటెంట్ తో స‌క్సెస్ ఖాతాలో వేసుకుని వారికే పోటీగా త‌యార‌వుతున్నారు. ఈ క్ర‌మంలో కొంత మంది సీనియ‌ర్ స్టార్స్ హిట్ అందు కుంటే త‌ప్ప బిజీ అవ్వ‌డం క‌ష్టం. మాస్ రాజా ర‌వితే, మ్యాచో స్టార్ గోపీచంద్, నంద‌మూరి వార‌సుడు క‌ల్యాణ్ రామ్, యంగ్ హీరో శ‌ర్వానంద్, ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్, యూత్ స్టార్ నితిన్ లాంటి స్టార్లకిప్పుడు స‌క్సెస్ అత్యంత కీల‌కం.

తాడోపేడో తేల్చుకోవాల్సిన స‌మ‌యం సైతం ఆస‌న్న‌మైంది. చేతిలో సినిమాలుంటే స‌రిపోదు. హిట్ తోనే అస‌లైన మ‌జా. ఓ సారి ఈ హీరోల లైన‌ప్ చెక్ చేస్తే స‌రి. ఈ సంక్రాంతికి శ‌ర్వానంద్ `నారీ నారీ న‌డుమ మురారీ` అంటూ ఇద్ద‌రు భామ‌ల ముద్దుల ప్రియుడిగా ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు. సినిమాపై పాజిటివ్ బ‌జ్ ఉంది. ఇద్ద‌రు సీనియ‌ర్లు ఉన్నా? కాన్పిడెంట్ గా వ‌స్తున్నాడంటే? కంటెంట్ పై న‌మ్మ‌కం క‌నిపిస్తుంది. ఇదే ఏడాది `బైక‌ర్`, `భోగీ` అంటూ మ‌రో రెండు సినిమాల‌తోనే ప్రేక్ష‌కుల్లోనే ఉంటాడు. కానీ అవి హిట్ సినిమాలు అవ్వాల్సిందే.

మాస్ రాజా ర‌వితేజ కూడా పొంగ‌ల్ కి సంద‌డి చేస్తున్నాడు. `భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి` అంటూ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన ర్ తో వ‌స్తున్నాడు. సినిమాపై పాజిటివ్ బ‌జ్ ఉంది. ఈ సారి రాజా కొడ‌తాడ‌ని అంతా విశ్వ‌శిస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాల్సిందే. ఈ చిత్రం త‌ర్వాతే రాజా కొత్త ప్రాజెక్ట్ ల‌కు సైన్ చేయ‌నున్నాడు. మ్యాచో స్టార్ గోపీచంద్ హిట్ చూసి చాలా కాల‌మ‌వుతోంది. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తోన్న ఫ‌లించ‌డం లేదు. `ఘాజీ` ఫేం సంక‌ల్ప్ రెడ్డి తో పెద్ద ప్ర‌యోగం చేస్తున్నాడు. ఏడ‌వ శతాబ్దపు క‌థ‌లో న‌టిస్తున్నాడు. సినిమాపై బ‌జ్ బాగానే ఉంది.

ఇంకా ఎలాంటి ప్ర‌చార చిత్రాలు బ‌య‌ట‌కు రాలేదు. షూటింగ్ కూడా నెమ్మ‌దిగా జ‌రుగుతుంది. కానీ ఇదే ఏడాది రిలీజ్ అయ్యే ప్రాజెక్ట్ ఇది. ఈ సినిమాతో గోపీచంద్ హిట్ అందుకోవాల్సిందే. అలాగే నంద‌మూరి వార‌సుడు క‌ల్యాణ్ రామ్ కి `బింబిసార` త‌ర్వాత స‌రైన హిట్ ప‌డ‌లేదు. సినిమాలైతే చేస్తున్నాడు గానీ వాటి ఫ‌లితాలు మాత్రం తీవ్ర నిరాశ‌కే గురి చేస్తున్నాయి. `బింబిసార` త‌ర్వాత చేసిన మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. దీంతో త‌దుప‌రి ఏ సినిమా చేసినా అది హిట్ బొమ్మ మాత్ర‌మే అవ్వాల‌ని చూస్తున్నాడు. `బింబిసార 2` ప్ర‌క‌ట‌న వ‌చ్చిన నేప‌థ్యంలో ఈ ఈ చిత్రాన్నే ప‌ట్టాలెక్కించే అవ‌కాశం ఉంది.