ఆ ముగ్గురు కంబ్యాక్ కష్టమే?
హీరో అయినా? డైరెక్టర్ అయినా? సక్సెస్ అనే ప్లోకి బ్రేకి పడిన తర్వాత బౌన్స్ బ్యాక్ అవ్వడం అన్నది అంత సులభం కాదు.
By: Srikanth Kontham | 3 Nov 2025 3:00 AM ISTహీరో అయినా? డైరెక్టర్ అయినా? సక్సెస్ అనే ప్లోకి బ్రేకి పడిన తర్వాత బౌన్స్ బ్యాక్ అవ్వడం అన్నది అంత సులభం కాదు. అందులోనూ సక్సెస్ అన్నది లాంగ్ గ్యాప్ లో ఉంటే? తిరిగి పుంజుకోవడం అన్నది దాదాపు ఆసాధ్యమే. సక్సెస్ అనే ట్రాక్ మళ్లీ ఎక్కాలంటే అద్బుతాలు జరిగితే తప్ప సాధ్యం కాదు. అందులోనూ నేడు ఇండస్ట్రీ ఏరేంజ్ లో పరుగులు పెడుతుందో? తెలిసిందే. సక్సస్ దూరమైందంటే? ఆ స్థానం వెంటనే మరో హీరో లేదా? డైరెక్టర్ తో |భర్తీ అవ్వడం వేగంగా జరుగుతుంది. తాజాగా ఇప్పుడో ముగ్గురు సీనియర్ డైరెక్టర్లు మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
పాన్ ఇండియా కథలు వాళ్లకు సాధ్యమేనా?
ప్రత్యేకించి ఇద్దరు దర్శకులు గురించి మాట్లాడుకోవాలి. వాళ్లిద్దరు సక్సెస్ లో ఉన్నంత కాలం పరిశ్రమకు ఎన్నో విజయాలు అందించి వారే. వాళ్ల చేతలు మీదుగా అగ్ర హీరోలే తయారయ్యారు. అలాంటి వాళ్లిద్దరు ఇప్పుడు సినిమా ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. చివరిగా వారిద్దరు రెండేళ్ల క్రితం సినిమా తీసారు. అప్పటి నుంచి మరో సినిమా కోసం ప్రయత్నిస్తున్నారు గానీ అవకాశం రావడం లేదు. స్టార్ హీరోలంతా బిజీగా ఉన్నారు. నిర్మాణ సంస్థలు కూడా పాన్ ఇండియా కాన్సెప్ట్ లు కావాలంటున్నారు. వాళ్లిద్దరికీ ఆ తరహా అనుభవం లేదు.
క్రియేటివిటీపై వయో భారం:
రీజనల్ మార్కెట్ ఫరిదిలో నే సినిమాలు చేసిన అనుభవం ఉంది. వాళ్లిద్దరు ఔడెట్ అయిపోయారని అప్పుడే ప్రచారం సాగింది. కానీ గత విజయాల నేపథ్యంలో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతారే చిన్న నమ్మకం ఎక్కడో ఉండేది. కానీ తాజా సినారేలో ఛాన్స్ రావడమే గగనంగా మారిందనే టాక్ వినిపిస్తోంది. ఈ మధ్యనే ఇద్దరు మళ్లీ సినిమా ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. కానీ సక్సెస్ అవుతారా? అనే నమ్మకాలు మాత్రం కనిపించడం లేదు. ఓ డైరెక్టర్ వయసు 60 ఏళ్లు దాటగా, మరో డైరెక్టర్ 50 ఏళ్లు దాటాయి. 60 ఏళ్ల డైరెక్టర్ ఒకప్పుడు ఎంతో క్రియేటివ్ గానే సినిమాలు చేసేవారు.
చెప్పినంత అందంగా తీయలేడు:
కానీ చాలా కాలంగా ఆయనలో క్రియేటివిటీ కనిపించలేదు. రొటీన్ సినిమా తీస్తున్నాడనే విమర్శలు ఎదుర్కున్నారు. మరో డైరెక్టర్ సొంతగా కథలు రాయలేడు. రైటర్ల మీద ఆధారపడాలి. భారీ యాక్షన్ సన్నివేశాలు తీయడంలో స్పెషలిస్ట్ తప్ప అంతకు మించి క్రియేటివిటీ ఆయనలో కనిపించదు. ఆయన అవకాశాలకు కూడా అందుకే దూరమయ్యాడు. ఇప్పుడాయన సినిమా మేకింగ్ పై వయో భారం కూడా పడుతుంది. వీరితో పాటు మరో డైరెక్టర్ కడా ఉన్నాడు. అతడు కథలతో హీరోల్ని బుట్టలో వేయలగడు. కానీ చెప్పినంత అందంగా సినిమా తీయలేడు. అతడు కూడా మళ్లీ బౌన్స్ బ్యాక్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ అతడికి అవకాశం అంత ఈజీ కాదు.
