చరణ్‌పై శాడిస్టులు నెగెటివిటీ ప్రచారం చేస్తున్నారు!
ప్రస్తుత డిజిటల్ యుగంలో సెలబ్రిటీలపై సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ట్రోలింగ్, అనవసరపు నెగిటివిటీపై ప్రముఖ సీనియర్ నటుడు ఘాటుగా స్పందించారు.
By: Sivaji Kontham | 28 May 2026 9:44 AM ISTప్రస్తుత డిజిటల్ యుగంలో సెలబ్రిటీలపై సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ట్రోలింగ్, అనవసరపు నెగిటివిటీపై ప్రముఖ సీనియర్ నటుడు ఘాటుగా స్పందించారు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ఆన్‌లైన్ ట్రోలింగ్‌కు సంబంధించిన అంశాలపై ఈ నటుడు చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. తనకు, తన కుటుంబానికి రామ్‌చరణ్ అంటే వ్యక్తిగతంగా ఎంతో ఇష్టమని పేర్కొన్న సదరు నటుడు చరణ్ వంటి అంకితభావం గల నటుడిపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కేవలం నెగిటివిటీని వ్యాప్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న వారి ధోరణిని ఆయన తీవ్రంగా ఖండించారు.
సినిమా రంగం వెనుక ఉండే అసలు ఒత్తిడిని సామాన్యులు అర్థం చేసుకోలేరని ఈ సందర్భంగా వివరించారు. షూటింగ్ అయిపోయాక హీరోలు చాలా ప్రశాంతంగా.. ఖాళీగా ఉంటారని చాలామంది భావిస్తారని.. కానీ అది నిజం కాదని స్పష్టం చేశారు. సినిమా రిలీజ్ డేట్ మేనేజ్మెంట్.. సెన్సార్ ఫార్మాలిటీస్.. నిర్మాత ఆర్థిక భద్రత వంటి ఎన్నో రకాల సమస్యలు, లక్ష భారాలు ఒక ప్రధాన హీరో నెత్తిపై ఉంటాయని చెప్పారు. ఇలాంటి మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు మాట్లాడే క్రమంలో చిన్న తప్పులు దొర్లడం పెద్ద విషయం కాదన్నారు. ఈ కష్టాన్ని పక్కన పెట్టేసి కేవలం చిన్న తప్పులను మాత్రమే వెతికి పట్టుకుని నెగిటివిటీని స్ప్రెడ్ చేయాలని చూసేవారిలో శాడిజం, పర్వర్షన్ స్పష్టంగా కనిపిస్తున్నాయని మండిపడ్డారు.
అయితే ఇలాంటి అనవసరపు ట్రోల్స్ - విమర్శల గురించి రామ్‌చరణ్ అస్సలు పట్టించుకోరని ఈ సీనియర్ నటుడు వెల్లడించారు. చరణ్ మానసిక స్థితి చాలా దృఢమైనదని, అతడు ఎవరినీ అస్సలు కేర్ చేయాల్సిన అవసరం కూడా లేదని అభిప్రాయపడ్డారు. పనిలేని వాళ్లు కేవలం తమ ఉనికి కోసం లేదా ఐడెంటిటీ కోసం ఇతరులను కిందికి లాగాలని చూస్తారని.. అలాంటి వారికి ఏదో ఒకరోజు కచ్చితంగా బుద్ధి వస్తుందని వ్యాఖ్యానించారు. ట్రోలింగ్ సంస్కృతి ఎంత పెరిగినా.. నిజమైన శ్రమ ఎప్పటికీ వృథా పోదని ఆయన నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ముఖ్యంగా రామ్‌చరణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `పెద్ది` కోసం అతడు పడిన కష్టాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. చరణ్ ఈ సినిమా కోసం శారీరకంగా, మానసికంగా ఎంతో శ్రమించారని.. భారీ డైలాగులను సైతం ఎంతో పర్‌ఫెక్ట్‌గా పలికారని కొనియాడారు. పాత్రకు తగినట్టుగా చరణ్ తన బాడీ లాంగ్వేజ్‌ను, రూపాన్ని పూర్తిగా మార్చుకున్న తీరు అద్భుతమని అభినందించారు. అంతగా కష్టపడి ఒక గొప్ప సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పబ్లిక్ ప్రమోషన్స్ వంటి వేదికలపై ఒకటి రెండు చిన్న పొరపాట్లు జరగడం చాలా సహజమని ఆయన సమర్థించారు.
పెద్ది చిత్రంలో విలనిజం మాత్రమే కాకుండా.. డీప్ రూటెడ్ ఎమోషన్స్ కలిగిన ఒక బలమైన పిల్లర్ లాంటి పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఈ నటుడు విజయనగరం యాసను పలికించడం కోసం డబ్బింగ్ థియేటర్‌లో గంటల తరబడి శ్రమించారట. చరణ్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఈ సీనియర్ హీరో మాటలను బట్టి చరణ్ తనపై వచ్చే ట్రోలింగ్ ని అస్సలు పట్టించుకోడని అర్థం చేసుకోవచ్చు. ఇటీవల పెద్ది ప్రమోషనల్ ఈవెంట్ లో టీమిండియా క్రికెటర్ బుమ్రాను పొరపాటున ఫుట్ బాల్ ఆటగాడు అని చరణ్ వ్యాఖ్యానించారు. దీనిపై చాలా మంది నెటిజనులు ట్రోల్ చేస్తూ ప్రచారం సాగించడంపై సీనియర్ నటుడు ఇప్పుడిలా కౌంటర్ ఇచ్చారు.
