వారితో కమ్ములకు సెట్.. మూడో సారి కన్ఫర్మ్
దర్శకుడిగా శేఖర్ కమ్ముల కెరీర్‌ను ఆరంభించి 25 ఏళ్లు పూర్తి అయిన విషయం తెల్సిందే.
By: Ramesh Palla | 28 Aug 2025 11:11 AM ISTదర్శకుడిగా శేఖర్ కమ్ముల కెరీర్‌ను ఆరంభించి 25 ఏళ్లు పూర్తి అయిన విషయం తెల్సిందే. ఈ పాతిక ఏళ్లలో శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన సినిమాలు కేవలం 10. రెండు మూడు ఏళ్లకు ఒక్క సినిమా చొప్పున చేస్తున్న శేఖర్ కమ్ముల ఇకపై అయినా కాస్త స్పీడ్ పెంచాలని ఆయన అ భిమానులు కోరుకుంటున్నారు. ఈ ఏడాదిలో 'కుబేర' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శేఖర్ కమ్ముల వచ్చే ఏడాదిలో తన కొత్త సినిమాను తీసుకు రావాలని అనుకుంటున్నాడట. అందుకోసం ఇప్పటికే చర్చలు మొదలు అయ్యాయని అంటున్నారు. కుబేర సినిమాకు ముందు 'లవ్ స్టోరీ' సినిమాను కమ్ముల తీసుకు వచ్చాడు. లవ్ స్టోరీ తర్వాత కమ్ముల దాదాపు నాలుగు ఏళ్లు తీసుకుని కుబేర సినిమాతో వచ్చిన విషయం తెల్సిందే. కుబేర సినిమాను అనుకున్న సమయం కంటే దాదాపు ఏడాది ఆలస్యంగా పూర్తి చేసి విడుదల చేశాడు.
వినాయక చవితి సందర్భంగా శేఖర్ కమ్ముల మూవీ..
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా అనగానే అంచనాలు భారీగా ఉంటాయి. అందుకే ఆయన ఆ అంచనాలను అందుకునే విధంగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తాడు. అందులో భాగంగానే స్క్రిప్ట్‌తో పాటు, మేకింగ్‌కు కమ్ముల ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. కుబేర సినిమా సమయంలోనే కమ్ముల ఒక స్క్రిప్ట్‌ను ఫైనల్ చేశాడని తెలుస్తోంది. అంతే కాకుండా కుబేర సినిమాను నిర్మించిన సునీల్ నారంగ్, రామ్మోహన్‌ల నిర్మాణంలోనే కమ్ముల తదుపరి సినిమాను చేయాలని నిర్ణయించుకున్నారు. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఏషియన్ మూవీస్ అఫిషియల్‌గా ఈ విషయాన్ని ప్రకటించింది. శేఖర్ కమ్ముల తన 11వ సినిమాను తమ బ్యానర్‌లో చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించడంతో అందరి దృష్టిని ఆకర్షించారు.
కుబేర తర్వాత మళ్లీ...
లవ్ స్టోరీ, కుబేర సినిమాలను శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌లో చేసిన దర్శకుడు శేఖర్ కమ్ముల తదుపరి సినిమాను సైతం అదే బ్యానర్‌లో చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. దాంతో సదరు నిర్మాతలకు దర్శకుడు కమ్ములకు ఎంతగా సెట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఒక దర్శకుడు కంటిన్యూగా ఒక బ్యానర్‌లో చేయడం మనం అరుదుగా చూస్తూ ఉంటాం. ఒక్క సినిమా చేయగానే నిర్మాత, దర్శకుల మధ్య ఏదో తరహాలో గొడవలు వస్తుంటాయి. అందుకే ఎక్కువ శాతం దర్శకులు తమ ప్రతి సినిమాను వేరు వేరు బ్యానర్‌లలో చేస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. కానీ అతి కొద్ది మంది దర్శకులు మాత్రం ఇలా ఒక బ్యానర్‌కి స్టిక్ అయ్యి ఉంటారు. అనిల్ రావిపూడి దిల్ రాజు బ్యానర్‌లో ఎక్కువ సినిమాలు చేసినట్లు, త్రివిక్రమ్ హాసిని హారిక బ్యానర్‌లో చేసినట్లు ఇప్పుడు శేఖర్ కమ్ముల సైతం సునీల్ నారంగ్ వారి బ్యానర్‌లో సినిమాలు చేస్తున్నారు.
సునీల్ నారంగ్ బ్యానర్‌లో..
శేఖర్ కమ్ముల ముందు ముందు మరిన్ని సినిమాలను వీరి బ్యానర్‌లో సినిమాలు చేస్తారని తెలుస్తోంది. లవ్ స్టోరీ సినిమా కమర్షియల్‌గా బిగ్ హిట్ కాకున్నా కూడా కుబేర సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో పాటు... బ్యానర్ స్థాయిని పెంచింది. అందుకే నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కర్ రామ్మోహన్ లు శేఖర్ కమ్ములను వదిలి పెట్టడం లేదు అని కొందరు అంటున్నారు. సోషల్ మీడియాలో శేఖర్ కమ్ముల సినిమా గురించి అధికారికంగా ప్రకటన చేశారు. కానీ ఇప్పటి వరకు హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, కథ ఏంటి ఇలాంటి విషయాలను వెళ్లడించలేదు. ఈ ఏడాది చివరి వరకు సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. అతి త్వరలోనే శేఖర్ కమ్ముల నుంచి పూర్తి వివరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
