Begin typing your search above and press return to search.

సీతాప‌య‌నం సినిమా కాదు, ఒక ఎమోష‌న్

కుటుంబ బంధాల గొప్పతనాన్ని, మానవీయ విలువలను హృద్యంగా ఆవిష్కరించే చిత్రంగా రూపొందిన సీతాపయనం ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం ఘనంగా జరిగింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   11 Feb 2026 10:48 PM IST
సీతాప‌య‌నం సినిమా కాదు, ఒక ఎమోష‌న్
X

కుటుంబ బంధాల గొప్పతనాన్ని, మానవీయ విలువలను హృద్యంగా ఆవిష్కరించే చిత్రంగా రూపొందిన సీతాపయనం ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం ఘనంగా జరిగింది. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వం వహించి నిర్మించిన ఈ చిత్రంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా నటించారు. యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా కీలక పాత్ర పోషించారు. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ వేడుకకు హాస్య బ్రహ్మ, పద్మశ్రీ డా. బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ ఈవెంట్ లో బ్రహ్మానందం మాట్లాడుతూ, అర్జున్ మంచి మనిషి మాత్రమే కాదు, నిజమైన జెంటిల్మెన్. రియల్ హీరోలను సత్కరించడం గొప్ప విషయం. ‘జై హింద్ 2’లో ఆయనతో పని చేశాను. ఎప్పుడూ సౌమ్యంగా ఉంటారు. ఐశ్వర్యకు ఈ చిత్రంతో మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. అనూప్ రూబెన్స్ సంగీతం అద్భుతంగా ఉంద‌న్నారు.

అర్జున్ సర్జా ఎమోష‌న‌ల్ కామెంట్స్

దర్శక, నిర్మాత అర్జున్ సర్జా మాట్లాడుతూ, సీతా పయనం ఒక్కరి ప్రయాణం కాదని, ఇది ఎమోష‌న‌ల్ జ‌ర్నీ అని, నా కూతురు ఐశ్వర్యను పాజిటివ్ కథతో పరిచయం చేయాలనుకున్నా అన్నారు. ఇది కమర్షియల్ సినిమా అయినప్పటికీ, బంధాల విలువలను చాటి చెబుతుందని, సత్య రాజ్ గారు తండ్రి పాత్రలో అద్భుతంగా నటించారు. ప్రకాష్ రాజ్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అనూప్ రూబెన్స్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. మేం హృదయంతో ఈ సినిమా తీశామ‌న్నారు.

హీరోయిన్ ఐశ్వర్య అర్జున్ మాట్లాడుతూ, ఇది త‌న‌కు సినిమా మాత్రమే కాదు, ఓ ఎమోషన్ అన్నారు. ప్రేమ, కుటుంబం, విలువల గురించి మాట్లాడే కథ ఇదని, త‌న‌కు ఈ అవకాశం ఇచ్చిన నాన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటాన‌న్నారు. ప్రేక్షకులు థియేటర్‌లో ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

హీరో నిరంజన్ మాట్లాడుతూ, మా బాబాయ్ ఉపేంద్రకు తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన ప్రేమ త‌న‌క్కూడా దక్కాలని కోరుకుంటున్నా అన్నారు. ఇది కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా అని, అర్జున్ గారికి, ఐశ్వర్యకు థ్యాంక్స్ అన్నారు.

రియల్ హీరోల స్పందన ఇదే..

డా. ప్రకాష్ ఆమ్టే మాట్లాడుతూ అడవుల్లో నివసించే ప్రజల కోసం తమ సేవలను వివరించారు. డా. మందాకిని ఆమ్టే స్కూల్, హాస్పిటల్ నిర్మాణం గురించి చెప్పారు. ట్యాంక్ బండ్ శివ తన సేవా ప్రయాణంలో భార్య మద్దతు గురించి ప్రస్తావించారు. దుశ్చర్ల సత్యనారాయణ పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను నొక్కి చెప్పారు.

సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, నటుడు సత్య రాజ్, నిర్మాత అశోక్ కుమార్, ప్రసన్న కుమార్, డైలాగ్ రైటర్ సాయి మాధవ్ మాట్లాడుతూ సీతా ప‌య‌నం సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. మొత్తానికి భావోద్వేగాలు, ఫ్యామిలీ వాల్యూస్, అద్భుతమైన సంగీతం, బలమైన నటీనటుల సమాహారంతో రూపొందిన ‘సీతా పయనం’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రంగా నిలుస్తుందని చిత్ర యూనిట్ చాలా ధీమాగా ఉంది.