కడుపులో బిడ్డ మరణం.. విడాకుల గాయం..అయినా క్షమించిన భార్య!
వివాహ బంధం ముక్కలవడం, అదే సమయంలో కడుపులోనే బిడ్డను కోల్పోవడం వంటి వరుస దిగ్భ్రాంతికర సంఘటనలు ఏ విధంగా కుంగదీసాయో? గుర్తు చేసుకున్నారు.
By: Srikanth Kontham | 22 Jun 2026 5:00 PM ISTవినోద ప్రపంచంలో సెలబ్రిటీల జీవితాలు పైకి ఎంత రంగులమయంగా కనిపించినా? తెర వెనుక జీవితాల్లో తెలియని ఎన్నో గుండెకోతలు.. మానసిక సంఘర్షణలు దాగివుంటాయి. దివంగత ప్రముఖ బాలీవుడ్ నటుడు ఓం పురి మొదటి భార్య రచయిత్రి-దర్శకురాలు సీమా కపూర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని అత్యంత బాధాకరమైన విషయాన్ని పంచుకున్నారు. వివాహ బంధం ముక్కలవడం, అదే సమయంలో కడుపులోనే బిడ్డను కోల్పోవడం వంటి వరుస దిగ్భ్రాంతికర సంఘటనలు ఏ విధంగా కుంగదీసాయో? గుర్తు చేసుకున్నారు.
సీమా కపూర్ - ఓం పురి వైవాహిక జీవితంలో మరొక మహిళ ప్రవేశించినప్పుడు అసలు సమస్యలు మొదలయ్యాయి. సీమా గర్భవతిగా ఉన్న సమయంలోనే పురి జీవితంలోకి నందితా పురి రావడంతో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. అలాంటి పరిస్థితుల్లో మానసిక ప్రశాంతత కోసం సీమా రాజస్థాన్‌లోని తల్లి ఇంటికి వెళ్లారు. అయితే ఆ సమయంలో భర్తకు దూరం కావడం తన జీవితంలో పెద్ద తప్పిదంగా మారిందని దూరం పెరిగే కొద్దీ సమస్యలు మరింత జటిలమై చివరికి విడాకుల పత్రాలు అందుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమయంలో సీమా కపూర్ కుటుంబం అండగా నిలిచింది. ముఖ్యంగా సీమాకపూర్ సోదరుడు, నటుడు అన్ను కపూర్ సోదరి పడుతున్న బాధను చూడలేక ఓం పురిపై చట్టపరమైన పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ సీమా మాత్రం ఎలాంటి కోర్టు కేసులకు, గొడవలకు సిద్ధపడలేదు. చట్టపరమైన పోరాటాలకు దిగితే భవిష్యత్తులో ఆ బంధం మళ్లీ చిగురించే అవకాశాలు పూర్తిగా మూసుకుపోతాయని.. అందుకే తాను నిశ్శబ్దాన్ని .. సహనాన మామర్గాన్ని మాత్రమే ఎంచుకున్నానన్నారు. ఇలాంటి మానసిక ఆందోళనల మధ్యే జీవితంలో అత్యంత విలువైన పుట్టబోయే బిడ్డను కోల్పోవాల్సి వచ్చింది.
ఆ తీరని లోటు నుండి కోలుకోవడానికి సీమా కపూర్ వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. తన బాధను ఎవరితోనూ పంచుకోకుండా? పుట్టని ఆ బిడ్డకు ప్రేమతో లేఖలు రాయడం, ఆ బిడ్డ తరపున తానే సమాధానాలు రాసుకోవడం ద్వారా గుండె నిండా ఉన్న దుఃఖాన్ని కాగితంపైకి తీసుకొచ్చారు. కాలక్రమేణా పరిస్థితులు మారిన తర్వాత ఓం పురి తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడ్డారు. లండన్‌లో శస్త్రచికిత్సకు వెళ్లే ముందు ఆయన సీమాకు ఫోన్ చేసి తను మళ్లీ తిరిగి వస్తానో? లేదో ? తెలియదని అందుకే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరాలనుకుంటున్నానని భావోద్వేగానికి లోనయ్యారు.
మొదటి భార్యకు చేసిన ఓపురీని చాలా కాలం పాటు వెంటాడిందని.. ఆ పశ్చాత్తాపం పాత స్నేహమే భర్తని మళ్లీ ఆమె వద్దకు వచ్చేలా చేశాయని సీమా వెల్లడించారు. సీమాక పూర్ జీవితంలో ఇంతటి మోసాన్ని.. బాధను అనుభవించించినా? మనస్సులో ఓం పురిపై ఎలాంటి ద్వేషాన్ని పెంచుకోలేదు. జీవితంలో అత్యంత సంపూర్ణమైన బంధం ఓం పురితోనే సాధ్యమైందని ఇప్పటికీ నమ్ముతారు. ఎలాంటి విమర్శలు చేయకుండా.. తన అంతరంగాన్ని పూర్తిగా అర్థం చేసుకోగల ఏకైక వ్యక్తి ఓంపురీ మాత్రమేనని కొనియాడారు.
