స్క్రిప్టు ప్రకారం స్టార్ హీరోయిన్‌ని లైన్‌లో పెట్టిన యంగ్ హీరో
అయితే ఈ ప్రపోజల్ వెనుక అసలు రహస్యాన్ని ఆ ప్రముఖ యువకథానాయకుడు తర్వాత ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అప్పట్లో తను చేసిన ఆ పని పూర్తిగా స్క్రిప్టులో భాగమేనని వివరించారు.
By: Sivaji Kontham | 20 March 2026 8:00 PM ISTవెండితెర కోసం రాసిన స్క్రిప్టులు అప్పుడప్పుడు నిజ జీవితంలో కూడా నిజమవుతుంటాయి. సరిగ్గా ఇదే విషయం ప్రముఖ యువకథానాయకుడు.. ప్రముఖ స్టార్ హీరోయిన్ విషయంలో జరిగింది. ఒకప్పుడు కేవలం సరదా కోసం.. ఒక అవార్డు ఫంక్షన్ స్క్రిప్టు ప్రకారం ఆ యువకథానాయకుడు అడిగిన ప్రశ్న.. కాలక్రమేణా వారిద్దరినీ పెళ్లి పీటల వరకు తీసుకెళ్లి.. ఒక అందమైన ప్రేమకథగా మారింది.
దీనికి సంబంధించిన ఆసక్తికరమైన నేపథ్యం 2018 నాటి స్క్రీన్ అవార్డ్స్ వేడుకలో ఉంది. ఆ సమయంలో వేదికపై ఉన్న యువకథానాయకుడు, ఆ ప్రముఖ స్టార్ హీరోయిన్ స్టేజ్ దిగి వెళ్తున్నప్పుడు తనను ఆపి.. ముఝ్సే షాదీ కరోగే? (నన్ను పెళ్లి చేసుకుంటావా?) అని సరదాగా ప్రశ్నించారు. ఈ అనూహ్యమైన ప్రశ్నతో ఆ స్టార్ హీరోయిన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోగా.. అక్కడే ఉన్న ఆమె లవర్ స్పందన కూడా అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది.
అయితే ఈ ప్రపోజల్ వెనుక అసలు రహస్యాన్ని ఆ ప్రముఖ యువకథానాయకుడు తర్వాత ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అప్పట్లో తను చేసిన ఆ పని పూర్తిగా స్క్రిప్టులో భాగమేనని వివరించారు. ఆ షో నిర్వాహకులు రాసిన స్క్రిప్టు ప్రకారం.. అక్కడ ఉన్న పలువురు హీరోయిన్లను ఇదే విధంగా సరదాగా ఆటపట్టించాలి. కానీ అందరి కంటే ఎక్కువగా ఆ ప్రముఖ స్టార్ హీరోయిన్ తో ఆయన చేసిన ఆ చిలిపి సంభాషణే ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది.
స్క్రిప్టు ప్రకారం మొదలైన ఆ పరిచయం.. ఆ తర్వాత కాలంలో వారిద్దరి మధ్య బలమైన బంధానికి దారితీసింది. కొన్నాళ్ల పాటు రహస్యంగా ప్రేమాయణం సాగించిన ఈ జంట చివరకు 2021లో రాజస్థాన్ వేదికగా అంగరంగ వైభవమైన పెళ్లితో కంచికి చేరుకుంది. ఒకప్పుడు స్టేజ్ మీద జోక్ కోసం అడిగిన పెళ్లి ప్రపోజల్.. నిజ జీవితంలో వాస్తవ రూపం దాల్చడం అభిమానులకు నిజంగా ఒక షాక్ లాంటిది. ఒక రకంగా ఆ ప్రపోజల్ విన్న అగ్ర కథానాయిక లైఫ్ కి కీలకమైన మలుపు.
ప్రస్తుతం స్క్రిప్టు రాసిన వారు కూడా ఊహించని విధంగా ఆ ప్రముఖ యువకథానాయకుడు .. స్టార్ హీరోయిన్ ను పద్ధతిగా లైన్‌లో పెట్టాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. విధి రాసిన స్క్రిప్టు ముందు మనుషులు రాసిన స్క్రిప్టులు ఎంత చిన్నవో ఈ జంటను చూస్తే అర్థమవుతుందని నెటిజన్లు ముచ్చటపడుతున్నారు.
