ఫారిన్ కార్లలో తిరిగిన తల్లి..కొడుక్కి తెలిసే సరికి!
'చిత్తూరు నాగయ్య..సావిత్రి గారిని ఎంతో దగ్గరగా చూసిన వాడిని నేను. సావిత్రి గారితో అన్నయ్యకు మంచి సాన్నిహిత్యం ఉండేది.
By: Srikanth Kontham | 24 Sept 2025 10:44 AM IST'మహనటి' సావిత్రి వృత్తి- వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకమే. నటిగా ఎంత ఫేమస్ అయ్యారు? ఫాంలో ఉన్న సమయంలో ఆమె పారితోషికం రేంజ్..హీరోలు సైతం అమె డేట్ల కోసం ఎదురు చూడటం...కోట్లలో సంపాదన..లగ్జరీ జీవితం.. దాతృ హృదయంలోనూ గొప్ప మానవతా వాదిగా సావిత్రికి పేరుంది.` మహానటి` రూపంలో ఆమె వైభవం ఎలా ఉండేదన్నది నేటి జనరేషన్ యువతకి నాగ్ అశ్విన్ సినిమా రూపంలో చెప్పే ప్రయత్నం చేసారు. నిజంగా సావిత్ర ఫాంలో ఉన్నంతకాలం సినిమాలాగే ఆమె నిజ జీవితం ఉండేదని ఇప్పటికీ సీనియర్లు చెబుతుంటారు. అలాంటి సావిత్రి గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు రాజబాబు సోదరుడు చిట్టిబాబు పంచుకున్నారు.
అమ్మా ఈ కారు పేరేంటి?
'చిత్తూరు నాగయ్య..సావిత్రి గారిని ఎంతో దగ్గరగా చూసిన వాడిని నేను. సావిత్రి గారితో అన్నయ్యకు మంచి సాన్నిహిత్యం ఉండేది. ఆ కారణంగా నాకు బాగా తెలిసారు. కలిసినప్పుడు సరదాగా మాట్లాడేవాడిని. ఓ సారి సావిత్రి గారికి సన్మానం చేద్దామని అన్నయ్య చెప్పారు. ఆ కార్యక్రమానికి సావిత్రి గారిని దగ్గరుండి తీసుకురమ్మని నాకు ఓ ఫారిన్ కారు ఇచ్చి పంపించాడు. ఆ కారు తీసుకుని సావిత్రి గారి కోసం ఎయిర్ పోర్ట్ కు వెళ్లాం. అప్పటికి సావిత్రిగారి అబ్బాయి సతీష్ చిన్న పిల్లాడు. అప్పుడే సతీష్ ఆ కారు చూసి అమ్మా? ఈ కారు పేరేంటి? అని అడిగాడు.
కన్నీటి పర్యంతం అయిన తల్లి:
ఆ మాటకు సావిత్రి గారు ఎంతో బాధపడ్డారు. కన్నీరు పెట్టుకున్నారు. తన గత జీవితాన్ని తలుచుకుని మదన పడ్డారు. సతీష్ పుట్టక ముందు తన దగ్గరే ఎన్నో ఫారిన్ కార్లు ఉండేవని చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. ఆ సంఘటన ఇప్పటికీ బాగా గుర్తు అని చిట్టిబాబు తెలిపారు. పాత తరం నటులు ఎంతగా సంపాదించే వారో అంతగా విలాసాలకు పోయేవాళ్లు అన్నది చాలా మంది నటుల విషయంలో ప్రూవ్ అయింది.
శోభన్ బాబు స్పూర్తితో:
అలాంటి వాళ్లను చూసి తర్వత తరం వారు జాగ్రత్త పడ్డారని..ఆ కారణంగానే చాలా మంది ఆస్తులు కూడబెట్టగలిగామని సీనియర్ నటులు మురళీ మోహన్ కూడా ఓ సందర్భంలో తెలిపారు. ఇండస్ట్రీలో తనకు ఇలాంటి విలువైన సలహాలు శోభన్ బాబు ఇచ్చేవారని తెలిపారు. ఇండస్ట్రీ డబ్బు సంపాదించు కోవడంతో నేర్పడంతో పాటు చెడు అలవాట్లను కూడా నేర్పుతుందని..అక్కడ బ్యాలెన్స్ తప్పితే మాత్రం అదే రంగుల జీవితం చిన్నా భిన్నంగా మారుతుందని నేటి జనరేషన్ యువతకి హితబోద చేస్తుంటారు.
