Begin typing your search above and press return to search.

నెక్స్ట్ లెవల్ సర్ప్రైజ్… సేవ్ ది టైగర్స్ 4లో స్టార్ ఎంట్రీ రాబోతుందా?

సేవ్ ది టైగర్స్ 3'కు వచ్చేసరికి షోరన్నర్ మహి వి రాఘవ్ ప్లాన్ మార్చి సరికొత్త ప్రయోగం చేశారు.

By:  Madhu Reddy   |   28 Jun 2026 2:33 PM IST
నెక్స్ట్ లెవల్ సర్ప్రైజ్… సేవ్ ది టైగర్స్ 4లో స్టార్ ఎంట్రీ రాబోతుందా?
X

తెలుగు ఓటీటీ ప్రపంచంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన 'సేవ్ ది టైగర్స్' వెబ్ సిరీస్ హవా అస్సలు తగ్గడం లేదు. రీసెంట్‌గా జియో హాట్‌స్టార్‌లో రిలీజైన సీజన్ 3 సూపర్ హిట్ అవ్వడంతో, మేకర్స్ ఇప్పుడే అస్సలు గ్యాప్ ఇవ్వకుండా సీజన్ 4 కోసం క్రేజీ ప్లాన్స్ వేస్తున్నారు. ఇక ఈసారి సీజన్‌ని మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తూ కథలోకి ఒక స్టార్ హీరోని రంగంలోకి దించేందుకు షోరన్నర్ మహి వి రాఘవ్ గట్టిగా ట్రై చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

ఊపుమీదున్న టైగర్స్ టీమ్:

భార్యాభర్తల మధ్య జరిగే సరదా గొడవలతో క్లీన్ కామెడీగా వచ్చిన 'సేవ్ ది టైగర్స్' మూడు సీజన్లు కూడా బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా సీజన్ 3 కి వచ్చిన రెస్పాన్స్ చూసి డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇక ఆడియెన్స్ కనెక్ట్ అయిన విధానం, కథలో ఇచ్చిన ట్విస్టులు సిరీస్ రేంజ్‌ని మార్చేశాయి. అందుకే ఇప్పుడు సీజన్ 4ని అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

రంగంలోకి స్టార్ హీరో?:

ఈ సిరీస్‌లో ముగ్గురు భార్యాభర్తల ఈగోలు, వాళ్ల మధ్య వచ్చే కామెడీ గొడవలే మెయిన్ హైలైట్. అయితే, సీజన్ 4లో ఒక స్టార్ హీరోకి ఒక క్రేజీ రోల్ ఇవ్వాలని టీమ్ గట్టిగా అనుకుంటోందట. ఇక ఆ స్టార్ హీరో క్యారెక్టర్ ఈ ముగ్గురు మొగుళ్ల జీవితాల్లోకి వస్తే ఎలా ఉంటుంది? అనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే సదరు స్టార్ హీరోతో సంప్రదింపులు కూడా మొదలైనట్లు సమాచారం.

సేవ్ ది టైగర్స్ 3'కు వచ్చేసరికి షోరన్నర్ మహి వి రాఘవ్ ప్లాన్ మార్చి సరికొత్త ప్రయోగం చేశారు. మొదటి రెండు సీజన్లలో కేవలం భార్యాభర్తల మధ్య ఉండే ఈగోలు, గిల్లికజ్జాల చుట్టూనే కథ నడిపిన ఆయన... మూడో సీజన్ వచ్చేసరికి కథలోకి ఇంద్రుడిని తీసుకువచ్చి క్రేజీ ఫాంటసీ ఎలిమెంట్‌ను యాడ్ చేశారు. పెళ్లి తర్వాత మూడు జంటల మధ్య జరిగే రోజువారీ గొడవలను ఎంటర్టైనింగ్‌గా చూపిస్తూనే, ఈ సీజన్‌లో పెట్టిన కాస్మిక్ ట్విస్ట్ ఆడియన్స్‌కు ఒక ఫ్రెష్ ఫీలింగ్‌ని ఇచ్చింది. ఈ డిఫరెంట్ అటెంప్ట్ సిరీస్‌కు ఓ కొత్త కోణాన్ని తీసుకొచ్చి, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో వంద శాతం సక్సెస్ అయింది.

బిగ్గెస్ట్ తెలుగు వెబ్ సిరీస్:

తెలుగు ఓటీటీ హిస్టరీలోనే అతిపెద్ద సిరీస్‌గా 'సేవ్ ది టైగర్స్' రికార్డు సృష్టించింది. వరుసగా మూడు హిట్లు ఇచ్చిన బ్రాండ్ ఇమేజ్‌ని కాపాడుకోవడం కోసం నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఇక ఒకవేళ అంతా అనుకున్నట్లు జరిగి, ఆ స్టార్ హీరో గనుక ప్రాజెక్ట్‌లోకి వస్తే సీజన్ 4 టాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ వెబ్ సిరీస్ చాప్టర్‌గా మారడం ఖాయం.

ప్రస్తుతానికైతే సీజన్ 4 స్క్రిప్ట్ వర్క్, స్టార్ హీరో ఎంట్రీకి సంబంధించిన ప్లానింగ్ నడుస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఆ స్టార్ హీరో ఎవరనేది మరియు మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. మూడు సీజన్లతో నవ్వించిన ఈ టైగర్స్, నాలుగో సీజన్లో ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారో చూడాలి..