సైలెంట్ గా ఓటీటీ గేమ్ మార్చేస్తున్న మహి వి రాఘవ్.. వరుసగా నాలుగో హిట్
ఈ మధ్య ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఎక్కడ చూసినా ఒకే ఫార్ములా చుట్టూ తిరిగే కంటెంట్ ఎక్కువగా కనిపిస్తోంది.
By: M Prashanth | 22 Jun 2026 9:54 AM ISTఈ మధ్య ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఎక్కడ చూసినా ఒకే ఫార్ములా చుట్టూ తిరిగే కంటెంట్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటి టైమ్ లో దర్శకుడు మహి వి రాఘవ్ స్థాపించిన త్రీ ఆటమ్ లీవ్స్ సంస్థ కంప్లీట్ గా డిఫరెంట్ రూట్ తీసుకుంది. యాత్ర, ఆనందో బ్రహ్మ, పాఠశాల లాంటి సినిమాలతో థియేటర్లలో తన మార్క్ చూపించిన ఆయన డిజిటల్ స్పేస్ లో కూడా సాలిడ్ స్ట్రాటజీతో దూసుకుపోతున్నారు. రొటీన్ కు భిన్నంగా ఒరిజినల్ కథలను నమ్ముకుని ఓటీటీ ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు.
ప్రొడ్యూస్ చేసిన లేటెస్ట్ సిరీస్ సేవ్ ద టైగర్స్ 3 ఇప్పుడు జనాల్లో హాట్ టాపిక్ గా మారింది. జూన్ 19 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఫాంటసీ కామెడీ సిరీస్ వ్యూస్ పరంగా నిజంగానే దుమ్ములేపుతోంది. రీసెంట్ గా వచ్చిన తెలుగు రీజినల్ ఓటీటీ కంటెంట్ లో చూసుకుంటే ఇదే బిగ్గెస్ట్ హిట్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతకుముందు వచ్చిన రెండు సీజన్ల క్రేజ్ ను ఏమాత్రం తగ్గనీయకుండా ఈ మూడో పార్ట్ తో కూడా ఆడియన్స్ కు సాలిడ్ కిక్ ఇచ్చారు.
ఈ ప్రాజెక్ట్ జనాలకు ఇంతలా కనెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అందులోని కాస్టింగ్. ప్రియదర్శి, వెన్నెల కిషోర్, జోర్దార్ సుజాత లాంటి వాళ్లు తమ నేచురల్ యాక్టింగ్ తో మ్యాజిక్ చేశారు. వీళ్లకు తోడుగా మహి వి రాఘవ్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. థియేటర్ కు వచ్చే జనాల మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఇంట్లో ఫోన్లలో చూసే ఆడియన్స్ పల్స్ ఎలా ఉంటుంది అనే క్లారిటీ ఆయనకు పక్కాగా ఉండటమే ఈ కంటిన్యూస్ సక్సెస్ కు అసలైన కారణం అనే కామెంట్స్ వస్తున్నాయి.
ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ లో త్రీ ఆటమ్ లీవ్స్ ట్రాక్ రికార్డ్ చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. సేవ్ ద టైగర్స్ మొదటి రెండు సీజన్లు, ఆ తర్వాత వచ్చిన డార్క్ కాన్సెప్ట్ సైతాన్, ఇప్పుడు లేటెస్ట్ గా సేవ్ ద టైగర్స్ 3. ఇలా తీసిన నాలుగు సిరీస్ లు సూపర్ హిట్ అయ్యాయి. నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ మెయింటైన్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఒక్క ప్రాజెక్ట్ తేడా కొట్టినా కెరీర్ గ్రాఫ్ పడిపోయే ఈ టైమ్ లో ఆయన బ్యాలెన్స్ ఎక్కడా మిస్ అవ్వలేదు.
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు వింటే ఆయన థాట్ ప్రాసెస్ ఎంత క్లియర్ గా ఉందో అర్థమవుతుంది. జనాలు వాళ్ళ ఇంట్లో కూర్చుని మన కంటెంట్ చూసి ఎంజాయ్ చేస్తున్నారా లేదా అనేదే తన దృష్టిలో అసలైన సక్సెస్ అని ఆయన చెప్పారు. మన సిరీస్ ను ఎంత మంది కళ్లు చూస్తున్నాయి, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అనేది మాత్రమే తనకు ముఖ్యమని చాలా ప్రాక్టికల్ గా చెప్పుకొచ్చారు.
త్రీ ఆటమ్ లీవ్స్ కేవలం వ్యూస్ తెచ్చుకోవడానికే పరిమితం అవ్వలేదు. లోకల్ కథలను ఓటీటీలో ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేయొచ్చు అనేదానికి ఈ బ్యానర్ ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా మారింది. ఒరిజినల్ కంటెంట్ తో పాటు వాళ్లు ఫాలో అవుతున్న బిజినెస్ మోడల్స్ మిగతా ప్రొడక్షన్ హౌస్ లకు ఒక ఉదాహరణ లాగా పనిచేస్తున్నాయి. ఇక రాబోయే రోజుల్లో తెలుగు డిజిటల్ కంటెంట్ లో ఇంకా ఎలాంటి కంటెంట్ ని అందిస్తారో చూడాలి.
