ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న 'సేవ్ ద టైగర్స్' సీజన్ 3.. ఈసారి అంతకుమించి!
ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత టాలీవుడ్ ను మొదలుకొని కొరియన్ వరకు ఎన్నో సీరీస్ లు, చిత్రాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్నాయి.
By: Madhu Reddy | 24 May 2026 1:28 PM ISTఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత టాలీవుడ్ ను మొదలుకొని కొరియన్ వరకు ఎన్నో సీరీస్ లు, చిత్రాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్నాయి. అందులో కొన్ని సీరీస్ లు, చిత్రాలు మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యేకించి సీరీస్ ల విషయానికి వస్తే.. తదుపరి సీజన్ ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూసే ఆడియన్స్ కూడా లేకపోలేదు. అలాంటి సీరీస్ లలో సేవ్ ద టైగర్స్ కూడా ఒకటి. ఇప్పటికే రెండు సీజన్లు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి వినోదాన్ని పంచగా.. ఇప్పుడు మూడవ సీజన్ కూడా స్ట్రీమింగ్ కి సిద్ధమయింది.ఈ మేరకు జియో హాట్ స్టార్ ఒక పోస్టర్ ను కూడా పంచుకుంది. దీన్ని చూస్తుంటే రెండు సీజన్లకు మించి ఈ సీజన్ ఉండబోతోంది అనే విషయం మాత్రం మనకు అర్థమవుతుంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
స్ట్రీమింగ్ కి సిద్ధం అయిన సేవ్ ద టైగర్స్ సీజన్ 3..
2023లో జియో హాట్ స్టార్ వేదికగా విడుదలైన తొలి సీజన్ సేవ్ ద టైగర్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. ఆ తర్వాత వచ్చిన రెండవ సీజన్ కూడా అదే రేంజిలో స్పందన సొంతం చేసుకోవడం గమనార్హం. మూడవ సీజన్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు? ఇక ఆ ఎదురు చూపులకు తెరదించుతూ సేవ్ ద టైగర్స్ సీజన్ 3 కూడా రాబోతోంది. ఈ మేరకు పంచుకున్న పోస్టర్ చూస్తుంటే కథలో కాస్మిక్ ట్విస్ట్ ఉండబోతోందని తెలుస్తోంది. తొలి రెండు సీజన్ లలో అలరించిన కృష్ణ చైతన్య -దేవయాని శర్మ, ప్రియదర్శి - జోర్దార్ సుజాత, అభినవ గోమటం - పావని గంగిరెడ్డి జంటలు సీజన్ 3లో కూడా అలరించనున్నాయి. అయితే ఈ సీజన్ 3లో సర్ప్రైజ్ గా వెన్నెల కిషోర్ తనదైన కామెడీతో నవ్వించబోతున్నారు.
సరికొత్త ట్విస్ట్.. ఊహించని సర్ప్రైజ్..
ముఖ్యంగా ఈ సీజన్ మొదటి రెండు సీజన్లకు కాస్త భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. పాత జంటలతో పాటు సరికొత్త ఊహించని సర్ప్రైజ్లు సరికొత్త పాత్రలు కూడా ఇందులో ఉండబోతున్నట్లు సమాచారం. కామెడీ కోసం వెన్నెల కిషోర్ ఎంట్రీ ఇస్తుండడంతో ఇప్పుడు సీజన్ అంతకుమించి అంచనాలు పెరిగిపోయాయి. ఇకపోతే ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సీరీస్ మూడవ సీజన్ త్వరలోనే జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు త్వరలోనే అధికారిక డేట్ ను కూడా అనౌన్స్ చేయనున్నారు చిత్రబృందం. ప్రదీప్ అద్వైతం, మహి వి రాఘవ్ సృష్టించిన ఈ కథకు తేజ కాకుమాను, అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం వహించారు.
ఇకపోతే సీజన్ వన్ లో గంగవ్వ, జబర్దస్త్ రోహిణి ,హర్షవర్ధన్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్య కృష్ణన్ , వేణు ఎల్దండి, షీరత్ కపూర్ , జయ శ్రీ రాచకొండ, అనంత్ బాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక సీజన్ 2 లో మురళీధర్ గౌడ్, అంబటి శ్రీనివాస్ , ముక్కు అవినాష్ తదితరులు నటించారు. సీజన్ 3 లో వెన్నెల కిషోర్ రాబోతున్నారు. ఈ సీజన్ మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
