ఆ ఇద్దరితో అదృష్టమే దోబూచులాట!
సత్యదేవ్, సుహాస్ ఇద్దరు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 20 Aug 2025 1:00 PM ISTసత్యదేవ్, సుహాస్ ఇద్దరు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. చిన్న పాత్రల తో మొదలైన ఇరువురి ప్రయాణం ప్రధాన పాత్రల వైపు మలుపు తిప్పింది. `జ్యోతిలక్ష్మి`, `బ్లఫ్ మాస్టర్`, `రాగల 24 గంటల్లో`, `తిమ్మరసు` లాంటి చిత్రాల్లో సత్యదేవ్ హీరోగా నటించాడు. `కలర్ ఫోటో`తో సుహాస్ హీరోగా లాంచ్ అయ్యాడు. మరికొన్ని చిత్రాల్లోనూ లీడ్ రోల్స్ పోషించాడు. అలాగని ఇద్దరు కేవలం హీరో పాత్రలకే పరిమితమవ్వలేదు.
విజయం కోసం ఇద్దరు:
ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకుంటున్నారు. కానీ హీరోలగా మాత్రం ఇంకా నిలదొక్కుకోలేదు. ప్రయత్నాలేవి ఆశించిన ఫలితాలివ్వడం లేదు. ఇద్దరితో అదృష్టమే దోబూచులా టాడుతోంది. హీరోగా ఇరువురు సరైన విజయం కోసం ఎదురు చూస్తున్నారు. లైనప్ లో ఉన్న సినిమాలతో జాతకాలు మారుతా యని ఆశిస్తున్నారు. ప్రస్తుతం సత్యదేవ్ వెంకటేష్ మహా దర్శకత్వంలో 'రావ్ బహదూర్' లో నటిస్తు న్నాడు.
సైకలాజికల్ థ్రిల్లర్:
ఇందులో సత్యదేవ్ రెండు భిన్నమైన పాత్రలు పోషిస్తున్నాడు. వృద్ధుడి గెటప్‌లో, రాజా గెటప్‌లో ఓ సత్యదేవ్ లుక్ ఆకట్టుకుంటుంది. ఇతర ప్రచార చిత్రాలు సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చాయి. ఈ చిత్ర నిర్మాణంలో జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ భాగమవ్వడంతో మరింత బజ్ నెలకొంది. రాజవంశం నేపథ్యంలో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా ఇది. ఈ సినిమాపై సత్యదేవ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.
జాతకాలు మారేనా:
తాను అనుకున్న సక్సస్ ఈ సినిమాతో వస్తుం దని ఆశిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది. అటు సుహాస్ హీరోగా రెండు సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. 'కేబుల్ రెడ్డి', 'ఆనందరావు అడ్వెంచర్' చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో తాను అనుకున్న సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నాడు. మరి ఈ సినిమాలతోనైనా హీరోగా వారిద్దరు జాతకాలు మారతాయా? లేదా? అన్నది చూడాలి. అలాగే ఇదే ఏడాది కోలీవుడ్ లోనూ సుహాస్ విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. `మండాడి` సినిమాలో హీరో సూరి కాగా, విలన్ గా సుహాస్ నటిస్తున్నాడు.
