సత్యదేవ్ రూట్ మళ్లీ మారింది!
టాలీవుడ్ లో కంటెంట్ బేస్డ్ సినిమాలతో ప్రతీసారి ఎట్రాక్ట్ చేసే నటుల్లో సత్యదేవ్ ఒకరు. కమర్షియల్ సక్సెస్ ల కంటే విభిన్నమైన పాత్రలకే ప్రాధాన్యం ఇచ్చే ఈ వెర్సటైల్ యాక్టర్, లేటెస్ట్ మూవీ 'సమవర్తి'తో మరో డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నాడు.
By: M Prashanth | 17 Sept 2026 10:44 PM ISTటాలీవుడ్ లో కంటెంట్ బేస్డ్ సినిమాలతో ప్రతీసారి ఎట్రాక్ట్ చేసే నటుల్లో సత్యదేవ్ ఒకరు. కమర్షియల్ సక్సెస్ ల కంటే విభిన్నమైన పాత్రలకే ప్రాధాన్యం ఇచ్చే ఈ వెర్సటైల్ యాక్టర్, లేటెస్ట్ మూవీ 'సమవర్తి'తో మరో డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నాడు. రీసెంట్ గా చేతిలో విల్లు, మండుతున్న బాణంతో ఉన్న కొత్త పోస్టర్ వదిలి సెప్టెంబర్ 19న టీజర్ రాబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అడవి నేపథ్యం, జంతువులు, ఆయుధాలతో డిజైన్ చేసిన ఈ సరికొత్త లుక్ సోషల్ మీడియాలో బాగానే హైలెట్ అవుతోంది.
రీసెంట్ గా వచ్చిన రావు బహదూర్ లో సత్యదేవ్ కనిపించిన తీరుకు, ఇప్పుడు సమవర్తిలో కనిపిస్తున్న విధానానికి అసలు పోలికే లేదు. ఆ చిత్రంలో వయసు మళ్లిన పాత్ర కోసం ప్రోస్తెటిక్ మేకప్ వేసుకుని కనిపించగా, కేవలం రెండు నెలల వ్యవధిలోనే పూర్తిగా రస్టిక్ యాక్షన్ అవతారంలోకి మారిపోయాడు. సినిమా సినిమాకూ పాత్రల ఎంపికలో ఆయన చూపిస్తున్న ఈ వైవిధ్యమే సత్యదేవ్ కు స్పెషల్ ఇమేజ్ తెచ్చిపెట్టింది.
నిజానికి సత్యదేవ్ కెరీర్ గ్రాఫ్ చూస్తే ఎప్పుడూ ఒకే రూట్ లో వెళ్లలేదు. బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, గాడ్సే నుంచి మొన్నటి జీబ్రా వరకు కథ మారిన ప్రతిసారీ తనను తాను కొత్తగా ప్రజెంట్ చేసుకుంటూ వచ్చాడు. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా, సేఫ్ జోన్ లోకి వెళ్లి రొటీన్ సినిమాలు చేయకుండా ప్రతిసారీ ఏదో ఒక కొత్త ప్రయోగాన్ని నమ్ముకోవడమే అతని బలం.
ఇక సమవర్తి విషయానికి వస్తే మేకింగ్ స్కేల్ కూడా భారీగానే పెరిగింది. అజయ్ నాగ్ వి దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం సౌత్ ఇండియాలోని ఏడు దట్టమైన అడవులు, సుమారు 42 లొకేషన్లలో షూట్ చేశారు. దిలీష్ పోతన్, రాజీవ్ కనకాల లాంటి పవర్ ఫుల్ యాక్టర్స్ కూడా తోడవడంతో సినిమాపై మంచి హైప్ ఏర్పడింది. రుద్ర పిక్చర్స్, పంచభూత ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ సౌత్ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
నటుడిగా విమర్శకుల ప్రశంసలు పుష్కలంగా అందుకుంటున్న సత్యదేవ్ కు థియేటర్ల దగ్గర భారీ ఓపెనింగ్స్ పడటమే అసలైన సవాలుగా మారింది. సమవర్తిలో యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల మొదటి రోజే డీసెంట్ కలెక్షన్లు రాబట్టే అవకాశం కనిపిస్తోంది. టీజర్, ట్రైలర్ కనుక ఆడియన్స్ కు గట్టిగా కనెక్ట్ అయితే బిజినెస్ పరంగా కూడా సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవుతుంది. ఇక రాబోయే టీజర్ తో కథలోని అసలు కాన్ఫ్లిక్ట్ ఏంటనేది పూర్తి క్లారిటీ రానుంది. మరి ఈ ఇంటెన్స్ యాక్షన్ అడ్వెంచర్ తో సత్యదేవ్ బాక్సాఫీస్ వద్ద కోరుకున్న బిగ్ బ్రేక్ అందుకుంటాడో లేదో చూడాలి.
