Begin typing your search above and press return to search.

సత్యదేవ్ 'సమవర్తి'.. ఈసారి అడవిలో మిస్ అవ్వడంట..

అజయ్‌ నాగ్‌ వి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా ఎకోలాజికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ గా రూపొందుతోంది. లేటెస్ట్ ఆ మూవీ టీజర్‌ ను మేకర్స్‌ విడుదల చేశారు. టీజర్ చూస్తే ఈసారి సత్యదేవ్‌ అడవిలోకి దిగి గట్టిగానే పోరాడబోతున్నట్లు అర్థమవుతోంది.

By:  M Prashanth   |   19 Sept 2026 11:37 PM IST
సత్యదేవ్ సమవర్తి.. ఈసారి అడవిలో మిస్ అవ్వడంట..
X

వైవిధ్యమైన కథలు, పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ హీరో సత్యదేవ్‌ మరోసారి కొత్త తరహా కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ సమవర్తి. అజయ్‌ నాగ్‌ వి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా ఎకోలాజికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ గా రూపొందుతోంది. లేటెస్ట్ ఆ మూవీ టీజర్‌ ను మేకర్స్‌ విడుదల చేశారు. టీజర్ చూస్తే ఈసారి సత్యదేవ్‌ అడవిలోకి దిగి గట్టిగానే పోరాడబోతున్నట్లు అర్థమవుతోంది.

సమవర్తి టీజర్‌ ను పులి, జింక కథతో మొదలుపెట్టారు. అడవిలో పులి సుమారు 20 ఏళ్లు బలంగా జీవిస్తుందని, జింక మాత్రం ఎనిమిదేళ్లే జీవిస్తుందని వాయిస్ ఓవర్ ద్వారా చెబుతారు. నేపాల్‌ లో ఓ పులి ఇప్పటివరకు 49 మందిని చంపిందని, అయితే వారందరికీ ఏం జరిగిందో ఇప్పటికీ తెలియదనే డైలాగ్స్ ఆసక్తిని పెంచుతాయి. పులికి జింక కనిపిస్తుంది కానీ.. జింకకు పులి కనిపించదు.. కలర్ బ్లైండ్నెస్ అనే డైలాగ్ తో టీజర్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది.

ఆ వాయిస్ ఓవర్‌ కు తగ్గట్టుగానే అడవుల నరికివేత, గిరిజనుల లైఫ్ స్టైల్, అడవిపై డామినేషన్ కోసం జరిగే పోరాటాన్ని టీజర్‌ లో చూపించారు. అడవిని కాపాడే వ్యక్తిగా సత్యదేవ్‌ కనిపించారు. మహదేవ్‌ రోల్ లో ఆయన లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఇంటెన్స్‌ గా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన చెప్పే డైలాగులు పాత్రకు మరింత స్ట్రెంత్ ను తీసుకొచ్చాయి.

సమవర్తి టీజర్‌ రొటీన్ యాక్షన్ సినిమాలకు భిన్నంగా కనిపిస్తోంది. అడవులను బ్యాక్‌ డ్రాప్‌ గా తీసుకుని కథను ఇంట్రెస్టింగ్ గా నడిపించినట్లు తెలుస్తోంది. టీజర్‌ లో కనిపించే అడవి ప్రాంతాలు చాలా నేచురల్ గా ఉన్నాయి. సినిమా కోసం సౌత్ లోని ఏడు అడవులు, 42 లొకేషన్లలో షూటింగ్ జరిపినట్లు మేకర్స్‌ తెలిపారు. దీంతో సినిమాలోని విజువల్స్‌ కు నేచురాలిటీ వచ్చినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.

అలాగే శ్రీకాంత్‌ రోల్ కూడా ఆసక్తిని పెంచుతోంది. అయితే కథలో అసలు సమస్య ఏంటి, మహదేవ్‌ కు ఎదురయ్యే సవాళ్లు ఏంటి అనే విషయాలను మాత్రం టీజర్‌ లో పూర్తిగా రివీల్ చేయలేదు. యాక్షన్, ఎమోషన్, సస్పెన్స్‌ ను కలిపి సినిమాపై ఆసక్తి పెంచేలా టీజర్‌ ను కట్ చేశారు. టీజర్ చివర్లో సత్యదేవ్ చెప్పే ఈసారి మిస్ అవ్వదు అనే డైలాగ్ స్పెషల్ గా నిలిచింది.

గత సినిమాలతో పోలిస్తే ఈసారి ఒక స్ట్రాంగ్ మాస్ హిట్ అందుకోవాలనే ప్రయత్నం కనిపిస్తోంది. చివర్లో వచ్చే పులి ఎంట్రీ కూడా సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచింది. అలా సమవర్తి టీజర్ సత్యదేవ్‌ నుంచి మరో విభిన్నమైన అడవి నేపథ్య యాక్షన్ థ్రిల్లర్‌ను పరిచయం చేస్తోంది. శివచరణ్ రెడ్డి జక్కిడి, శశిధర్ రెడ్డి పదమాటి నిర్మిస్తున్న ఆ మూవీపై టీజర్‌ తో హైప్ మరింత పెరిగిందనే చెప్పాలి.