సత్యదేవ్ #RB స్టోరీ ఏంటి..?
ఆల్రెడీ ఒక సినిమా తీసి హిట్ అందుకున్న డైరెక్టర్ తోనే సత్యదేవ్ సినిమా చేస్తున్నాడు. #RBబి అంటూ ఒక సినిమా వస్తుంది. ఈ సినిమాను వెంకటేష్ మహా డైరెక్ట్ చేస్తున్నాడు.
By: Ramesh Boddu | 11 Aug 2025 3:24 PM ISTటాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్స్ లో ఒకరైన సత్యదేవ్ ఈమధ్యనే థియేటర్ లోకి కింగ్ డం అంటూ వచ్చాడు. విజయ్ దేవరకొండ లీడ్ రోల్ లో నటించిన ఆ సినిమాలో సత్యదేవ్ కూడా మంచి రోల్ లో నటించాడు. ఆ సినిమాలో సెకండ్ హీరో అంటే అది సత్యదేవ్ అని చెప్పొచ్చు. ఐతే ఓ పక్క లీడ్ రోల్ సినిమాలు చేస్తూనే మరోపక్క కంటెంట్ ఉన్న సినిమాలో భాగమైనా చాలని అనుకుంటున్నాడు. ఇదే కాకుండా రీసెంట్ గా ప్రైమ్ వీడియోస్ లో అరేబియా కడలి సినిమాతో వచ్చాడు.
లీడ్ రోల్ సినిమాలు చేస్తూ..
ఆ సినిమా ఎప్పుడు తీశారో కానీ ఆ మూవీ ట్రైలర్ చూస్తే అదేదో తండేల్ సినిమా కథనే మళ్లీ తీశారనిపించేలా ఉంది. ఇక ఇదిలాఉంటే ప్రస్తుతం సత్యదేవ్ తన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ ఒక సినిమా తీసి హిట్ అందుకున్న డైరెక్టర్ తోనే సత్యదేవ్ సినిమా చేస్తున్నాడు. #RBబి అంటూ ఒక సినిమా వస్తుంది. ఈ సినిమాను వెంకటేష్ మహా డైరెక్ట్ చేస్తున్నాడు.
ఈ మూవీని సూపర్ స్టార్ మహేష్ నిర్మాణ సంస్థ జి.ఎం.బి సమర్పిస్తుంది. మహేష్ ప్రెజెంట్ చేస్తున్నాడు అంటే సంథింగ్ స్పెషల్ మూవీ అని చెప్పొచ్చు. వెంకటేష్ మహా కేరాఫ్ కంచెరపాలెం సినిమాతోనే అతని టాలెంట్ చూపించాడు. ఇక ఆ తర్వాత ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య కూడా చేశాడు. ఆ సినిమాలో సత్యదేవ్ లీడ్ రోల్ చేశాడు. ఆ తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం మళ్లీ ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నాడు.
#RB అర్ధం..
ఇంతకీ ఈ సినిమా కథ ఏంటి.. #RB అర్ధం ఏంటన్నది రేపు అంటే ఆగష్టు 12 మధ్యాహ్నం 12 గంటలకు రివీల్ అవుతుంది. ఈ సినిమా ప్రీ లుక్ తో అయితే ఒంటి నిండా బంగారం తో ఒకరు కనిపిస్తున్నారు. అంతేకాదు అనుమానం పెనుభూతం అనే కోట్ కూడా సంథింగ్ క్యూరియస్ గా ఉంది. ఈ సినిమాకు మహేష్ బాబు బ్యాక్ సపోర్ట్ ఇవ్వడం తప్పకుండా ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది.
వెంకటేష్ మహా టాలెంట్ తో పాటు కాస్త కాన్ ఫిడెన్స్ కూడా ఎక్కువే. ఆమధ్య ఈ డైరెక్టర్ కె.జి.ఎఫ్ మీద చేసిన కామెంట్స్ కొన్ని ఆ సినిమా ఫ్యాన్స్ ని హర్ట్ చేశాయి. ఐతే తనకు ఏది అనిపిస్తే అది బయట చెప్పే వెంకటేష్ అప్పటికీ వెనక్కి తగ్గలేదు. మరి వెంకటేష్ మహా, సత్యదేవ్ ఈసారి ఎలాంటి ప్రాజెక్ట్ తో వస్తారో చూడాలి. పోస్టర్ రేపు ఎలాగు వస్తుంది కాబట్టి అదొ చూశాక వెంకటేష్ మహా ఈసారి ఏం చేస్తున్నాడన్నది తెలుస్తుంది.
