Begin typing your search above and press return to search.

అంద‌రూ విల‌న్ ను చేయాల‌ని చూశారు

అస‌లు విషయానికొస్తే టాలీవుడ్ లో న‌టుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న స‌త్య‌దేవ్ హీరోగా మాత్రం తన‌ను తాను ఎలివేట్ చేసుకోలేక‌పోతున్నారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   6 Aug 2025 5:42 PM IST
అంద‌రూ విల‌న్ ను చేయాల‌ని చూశారు
X

సినీ ఇండ‌స్ట్రీకి చాలా మంది వ‌స్తూంటారు. కానీ అందులో కొంద‌రు మాత్ర‌మే త‌మ‌కంటూ ఓ స్పెష‌ల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తూ ఉంటారు. ఆ గుర్తింపు కోసం ఎంత క‌ష్ట‌మైనా స‌రే ఆలోచించకుండా ముందుకెళ్తూ ఉంటారు. అయితే ఎంత క‌ష్ట‌పడినా సినీ ఇండ‌స్ట్రీలో వారి క‌ష్టానికి త‌గ్గ గుర్తింపు వ‌స్తుంద‌ని చెప్ప‌లేం. దానికి ల‌క్ కూడా క‌లిసిరావాలి.

కింగ్‌డ‌మ్ సినిమాతో మెప్పించిన స‌త్య‌దేవ్

అస‌లు విషయానికొస్తే టాలీవుడ్ లో న‌టుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న స‌త్య‌దేవ్ హీరోగా మాత్రం తన‌ను తాను ఎలివేట్ చేసుకోలేక‌పోతున్నారు. స‌త్య‌దేవ్ హీరోగా ప‌లు సినిమాలు చేసిన‌ప్ప‌టికీ వాటిలో ఏదీ క‌మ‌ర్షియ‌ల్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ అవ‌లేదు. మంచి న‌టుడు, అంత‌కు మించిన పెర్ఫార్మర్ కూడా. రీసెంట్ గా వ‌చ్చిన కింగ్‌డ‌మ్ సినిమాతో న‌టుడిగా మ‌రోసారి ప్రూవ్ చేసుకున్నారు స‌త్య‌దేవ్.

ఆ టైమ్ లో చాలా బాధేసింది

కింగ్‌డ‌మ్ సినిమా రిలీజై మంచి రెస్పాన్స్ అందుకున్న నేప‌థ్యంలో స‌త్య‌దేవ్ రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొని త‌నను విల‌న్ చేయాల‌ని చాలా మంది చూసిన‌ట్టు చెప్పారు. ఓ పెద్ద నిర్మాత ఒక‌రు త‌న‌ను ఒక సంద‌ర్భంలో క‌లిసి ఆయ‌న నిర్మించే సినిమాలో విల‌న్ గా చేయ‌మ‌న్నారని, త‌న‌కు హీరో అవాల‌నే కోరిక ఉండ‌టంతో విల‌న్ గా చేయ‌న‌ని చెప్పాన‌ని స‌త్య‌దేవ్ చెప్పారు.

దానికి ఆ నిర్మాత ఎందుకు విల‌న్ గా చేసుకోవ‌చ్చు క‌దా, విల‌న్ గా అయి, సినిమాలు చేస్తే పెద్ద హీరోలంతా నిన్ను క‌నీసం మూడు నాలుగు సినిమాల్లో పెట్టుకుంటారు. నీ సినిమాలు ఎలాగూ ఆడ‌వు క‌దా అని త‌న ముఖం మీదే చెప్పాడ‌ని, ఆయ‌న మాట‌ల‌కు చాలా బాధేసింద‌ని చెప్పారు. బాగానే యాక్ట్ చేస్తా క‌దా ఎందుకు నా సినిమాలు ఆడ‌ట్లేద‌నే యాంగిల్ లో మాత్ర‌మే తాను ఆలోచించేవాడిన‌ని స‌త్య‌దేవ్ చెప్పారు.

ఆ కార‌ణంతోనే గాడ్ ఫాద‌ర్ చేశా

చుట్టుప‌క్క‌ల వాళ్లు మ‌త్రం బాగా న‌టిస్తావు క‌దా విల‌న్ అయిపో అనేవారు, కానీ తాను మాత్రం బాగా చేస్తే హీరో అవాలి కానీ విల‌న్ అవ‌డ‌మేంట‌నుకునే వాడిన‌ని చెప్పారు. అయితే త‌న‌కు విల‌న్ గా చేయ‌డం ఇష్టం లేక‌పోయినా గాడ్ ఫాద‌ర్ సినిమాలో ఆ రోల్ చేయ‌డానికి ఓ కార‌ణం ఉంద‌ని, చిరూ సినిమాలో న‌టిస్తే, డైరెక్ట‌ర్ల కంట్లో ప‌డి త‌న‌కు అవ‌కాశాలొస్తాయ‌ని క‌న్విన్స్ చేయ‌డంతోనే ఆ సినిమా చేసిన‌ట్టు స‌త్య‌దేవ్ చెప్పుకొచ్చారు.