వాడుకొమ్మంటే సత్యని టీమ్ ఆడుకుందా?
కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో నటిస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ `జెట్ లీ`. ఆద్యంతం వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీకి `మత్తు వదలరా` ఫేమ్ రితేష్ రాణా దర్శకుడు.
By: Ravindar Gorantla | 9 March 2026 9:00 PM ISTకమెడియన్ సత్య ప్రధాన పాత్రలో నటిస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ `జెట్ లీ`. ఆద్యంతం వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీకి `మత్తు వదలరా` ఫేమ్ రితేష్ రాణా దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చెర్రి, హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. రితేష్ రానా కామెడీ టర్పోలెన్స్ మిక్స్ ఆఫ్ యాక్షన్ థ్రిల్లర్. హై ఆక్టేన్ కామెడీ డ్రామాగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుని అంచనాల్ని పెంచేసింది.
చిన్న సినిమాల్లో మంచి టాక్‌ని సొంతం చేసుకుని అంతటా హైప్‌ని క్రియేట్ చేసింది. రియా సింఘా కథానాయికగా నటిస్తోంది. వెన్నెల కిషోర్, అజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రీసెంట్‌గా విడుదల చేసిన గ్లింప్స్‌లో నువ్వు హీరోవా.. టైర్ వన్నా..టైర్ టూనా..టైర్ త్రీనా..అంటూ సత్యతో కలిసి వెన్నెల కిషోర్ చేసిన హంగామా నవ్వులు పూయించింది. ప్రచా చిత్రాలతో విభిన్నంగా సినిమాని ప్రమోట్ చేస్తూ వస్తున్న టీమ్ సినిమాపై హైప్‌ని క్రియేట్ చేస్తూ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.
మార్నింగ్ షో నుంచే ఫుల్ మీల్స్ పెడతాం అంటూ డైరెక్టర్ రితేజ్ రానా ప్రామిస్ చేసి ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందిస్తూనే ప్రమోషన్స్‌ని కూడా అదే పంథాలో చేస్తూ చిన్న సినిమాల ప్రమోషన్స్‌కి సరికొత్త ఫార్ములాని అందిస్తున్నాడు. దీంతో ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా హాట్ టాపిక్‌గా మారింది. సమ్మర్ రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా షూటింగ్ ఫైనల్‌గా పూర్తయింది. ఈ విషయాన్ని కూడా టీమ్ ఫన్నీగా తెలియజేస్తూ రిలీజ్ చేసిన వీడీయో నవ్వులు పూయిస్తోంది.
లైటింగ్‌కి ధర్మాకోల్ పట్టుకునే బాయ్ లేకపోవడంతో సత్య రంగంలోకి దిగి ధర్మాకోల్ షీట్ పట్టుకోవడం..సత్య నువ్వు పట్టుకోవడం ఏంటీ? మన వాళ్లు ఎవరూ లేరా..ఏయ్ శశీ..కీర్తీ..అని సెట్ బాయ్స్‌ని కేకేయాడం..దానికి సత్య.. బ్రో బ్రో..షాట్ ఉన్నప్పుడు కెమెరా ముందు.. షాట్ గ్యాప్‌లో క్యారవాన్‌లో ఉండే హీరోని కాదు బ్రో..ఇది మన సినిమా..మనం చేసుకుంటే తప్పేముంది బ్రో...వాడుకోండీ...వాడుకోండీ.. అనడం..దాన్ని బాయ్ నుంచి డైరెక్టర్ వరకు సీరియస్‌గా తీసుకుని సత్యని అన్ని రకాలుగా వాడుకోవడం..అన్ని పనులు సత్యతోనే చేయించడం...చివరకు యాక్షన్.. కట్ కూడా చెప్పించడం..
ఫైనల్‌గా వీడియో ఎండ్‌లో డైరెక్టర్ `వ్రాప్ అప్` అంటూ షూటింగ్ పూర్తయిందని ఎండ్ చెప్పడం.. చాలా కష్టపడ్డావ్..బాగా జరిగింది కదా..సరే నేను ఇంటికి వెళ్తా..నువ్వు ఎడిట్ రూమ్ కెళ్లు..అని వెళ్లిపోవడం.. వాడుకొమ్మంటె ఆడుకున్నారు కదరా!` అని సత్య నిట్టూర్చడం నవ్వులు పూయిస్తోంది. సినిమా ప్రారంభం నుంచి ఇదే తరహా వీడియోలతో ఆకట్టుకుంటూ ప్రమోట్ చేస్తున్న టీమ్ షూటింగ్ పూర్తయిన విషయాన్ని తెలియజేయడాన్ని కూడా ఇలా ఫన్నీ వీడియోతో చెప్పడం బాగుంది. సత్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా రేపు సమ్మర్‌లో థియేటర్లలోనూ ఇదే తరహాలో నవ్వులు పూయించాలని అంతా కోరుకుంటున్నారు.
