Begin typing your search above and press return to search.

పగలు షూటింగ్.. రాత్రిళ్లు సాఫ్ట్వేర్ ఉద్యగం.. ఈ హీరో కష్టం చూసారా?

డబ్బు ఇదం జగత్ అన్నారు పెద్దలు.. డబ్బు లేనిదే ఏ పని సాధ్యపడదు.. ఆఖరికి తాగడానికి మంచి నీళ్లు కావాలి అన్నా సరే డబ్బు కావాల్సిందే.

By:  Madhu Reddy   |   17 Aug 2025 11:56 AM IST
పగలు షూటింగ్.. రాత్రిళ్లు సాఫ్ట్వేర్ ఉద్యగం.. ఈ హీరో కష్టం చూసారా?
X

డబ్బు ఇదం జగత్ అన్నారు పెద్దలు.. డబ్బు లేనిదే ఏ పని సాధ్యపడదు.. ఆఖరికి తాగడానికి మంచి నీళ్లు కావాలి అన్నా సరే డబ్బు కావాల్సిందే. మరి ఈ డబ్బు కావాలి అంటే ప్రతి ఒక్కరు రెక్కలు ముక్కలు చేసుకోవాలి. అంతేకాదు ప్రస్తుతం ఉన్న కాలంలో డబ్బుతోనే మనిషికి విలువ లభిస్తుంది అనేది కూడా వాస్తవమని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒక హీరో ఏకంగా డబ్బు సంపాదనలో పడి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పగలు సినిమా షూటింగ్ లకి వెళ్తూ.. రాత్రిళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక ఈ హీరో కష్టం చూసి పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదని కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. మరి ఆ హీరో ఎవరు? ఎందుకు ఆయనకు అంత కష్టం వచ్చింది? అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఆయన ఎవరో కాదు హీరో సత్యదేవ్.. విలక్షణమైన నటుడిగా పేరు సొంతం చేసుకున్న ఈయన ఒకవైపు హీరోగా నటిస్తూనే.. మరొకవైపు సీనియర్ హీరోల చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్నారు. విశాఖపట్నంకి చెందిన సత్యదేవ్.. 2011లో ప్రభాస్ హీరోగా వచ్చిన 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమాలో గెస్ట్ పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. తర్వాత వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు.

అలా బ్లఫ్ మాస్టర్, జ్యోతిలక్ష్మి, క్షణం అంటూ పలు చిత్రాలు చేసిన ఈయన హీరోగా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు పలు చిత్రాలలో హీరోగానే కాకుండా విలన్ పాత్రలు కూడా చేసి ఆకట్టుకుంటున్నారు. అలాంటి సత్య దేవ్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించారట . నైట్ షిఫ్ట్ లు చేస్తూ ఉదయం పూట షూటింగ్లలో పాల్గొనేవారు అని సమాచారం.. ముఖ్యంగా ఐబీఎం లో ఒక టీం ని కూడా లీడ్ చేశారట. ఆ సమయంలో తన తోటి నటులకు ఈయన సినిమాలో నటిస్తున్నారనే విషయం తెలియకుండా జాగ్రత్త పడినట్లు సమాచారం. అలా పగులు షూటింగ్లకు వెళ్లి.. రాత్రిళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ కష్టపడ్డారట సత్యదేవ్. అలా క్షణం తీరిక లేకుండా కష్టపడడం వల్లే నేడు స్టార్ సెలబ్రిటీగా పేరు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సత్యదేవ్ కి సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది చూసిన అభిమానులు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సత్యదేవ్ ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు

ఇక సత్యదేవ్ విషయానికి వస్తే.. ఈయన అసలు పేరు కంచరాన వాణి వెంకట సత్యదేవ్. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జూలై 7న జన్మించిన ఈయన తెలుగు, హిందీ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఎంవిజిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ పూర్తి చేసిన సత్యదేవ్.. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. హీరోగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేశారు సత్యదేవ్. అంతేకాదు గాడ్స్ ఆఫ్ ధర్మపురి, లాక్డ్ వంటి వెబ్ సిరీస్ లలో కూడా నటించారు.