గోల్డెన్ ఛాన్స్ పట్టేసిన సాత్విక వీరవల్లి..ఈ క్రేజ్ ఏంటి తల్లీ!
‘ఆకాశంలో ఒక తార’తో టాలీవుడ్‌కు పరిచయమవుతున్న సాత్విక వీరవల్లికి మరో అవకాశం దక్కింది. నాగచైతన్య తదుపరి చిత్రంలోనూ ఆమెను హీరోయిన్గా ఖరారు చేస్తున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. తొలి సినిమా విడుదల కాకముందే మరో స్టార్ హీరోతో ఛాన్స్ రావడంతో సాత్విక పేరు చర్చనీయాంశమైంది.
By: Madhu Reddy | 18 Nov 2026 12:38 PM ISTసాత్విక వీరవల్లి.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ ముద్దుగుమ్మ పేరు ఎక్కువగా వైరల్ గా మారింది.. క్యూట్ ఎక్స్ప్రెషన్స్, ఆకట్టుకునే అందంతో వెండితెర పైకి రాకముందే అందరి మన్ననలు సొంతం చేసుకుంటుంది. ఇకపోతే ప్రస్తుతం ఈమె దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఆకాశంలో ఒక తార చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం కాబోతోంది. నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్‌గా నిర్వహించారు. గౌతమ్ మీనన్ తోపాటు శృతిహాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఆకాశంలో ఒక తార సినిమాలో కల్పన పాత్ర కోసం ఒక స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలనుకున్నామని కాకపోతే సాత్విక వీరవల్లికి అవకాశం ఇచ్చామంటూ అల్లు అరవింద్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆయన మాట్లాడుతూ.." మొదట ఈ పాత్ర కోసం ఒక స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలనుకున్నాను. కానీ సాత్విక వీరవల్లి నటన చూసి ఆశ్చర్యపోయాను. అందుకే నాగచైతన్య తదుపరి చిత్రంలో కూడా ఈమెను హీరోయిన్ గా ఖరారు చేస్తున్నాం అంటూ ఆయన బహిరంగంగా ప్రకటించారు. మొత్తానికైతే ఆమె మొదటి సినిమా ఇంకా విడుదల కాలేదు. అప్పుడే మరో స్టార్ హీరో సినిమాలో అవకాశం పొందడం అంటే నిజంగా సాత్విక వీరవల్లి గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
సాత్విక వీరవల్లి విషయానికి వస్తే.. అమెరికాలోని చికాగోలో పుట్టి పెరిగిన ఈమె.. తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి. ఈమె తండ్రి ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణాజిల్లా వీరవల్లికి చెందినవారు. ఈమె ఇల్లినాయిస్ అర్బానా చాంపైన్ విశ్వవిద్యాలయం నుండి ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ డిజైన్ లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ లో డిగ్రీ పూర్తి చేసిన ఈమె.. వండర్ బిల్డ్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో డిగ్రీని పూర్తి చేసింది. సినిమా రంగంలోకి ప్రవేశించడానికి ముందు అమెరికాలోని హెల్త్ కేర్ రంగంలో ఒరాకిల్ సెర్నార్ లో ఇంటర్ ఆపరేబిలిటీ ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ కన్సల్టెంట్ గా అలాగే జి ఈ హెల్త్ కేర్ లో సిస్టమ్స్ ఇంజనీర్ గా పనిచేశారు. ఆకాశంలో ఒక తార సినిమాలో అవకాశం రావడంతో ఐటీ ఉద్యోగానికి రాజీనామా చేసి టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.
