అంతరిక్షం కంటే ముందు 150 కాఫీ షాప్‌లకు వెళ్లిందట..!
‘ఆకాశంలో ఒక తార’తో గుర్తింపు తెచ్చుకున్న సాత్విక వీరవల్లి ఇప్పుడు తన కాఫీ ప్రేమతో వార్తల్లో నిలిచింది. ఇప్పటివరకు 150 కాఫీ షాపులను సందర్శించి, అక్కడి కాఫీకి రివ్యూలు ఇచ్చినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. మరోవైపు రామ్‌చరణ్–సుకుమార్ సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటించనుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
By: Ramesh Palla | 25 Nov 2026 12:35 PM ISTప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సాత్విక వీరవల్లి. అమెరికా నుంచి టాలీవుడ్‌కి వచ్చి సందడి చేస్తోంది. తెలుగు మూలాలు ఉండటం ఈమెకు అదనపు ఆకర్షణ. ఆకాశంలో ఒక తార సినిమాలో దుల్కర్ సల్మాన్‌కు జోడీగా నటించి, కల్పన అనే ఒక సాధారణ అమ్మాయి నుంచి అంతరిక్ష యానం చేసే అమ్మాయి పాత్రలో నటించడం ద్వారా సాత్విక వీరవల్లి అందరి దృష్టిని ఆకర్షించింది. చాలా తక్కువ సమయంలోనే ఈమె టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఆకట్టుకునే రూపం ఈమె సొంతం అని ఇప్పటికే నిరూపితం అయ్యింది. తాజాగా ఆకాశంలో ఒక తార సినిమా విడుదల తర్వాత ఈమె యాక్టింగ్ ప్రతిభ ఏంటో తెలిసిందే. ఆ పాత్రను చేయడం అంటే ఈజీ కాదు, కలలు కంటున్న అమ్మాయి జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించిన సాత్విక ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది.
ఆకాశంలో ఒక తార హీరోయిన్...
ఆకాశంలో ఒక తార సినిమా విడుదల తర్వాత కూడా సాత్విక బిజీగా ఉంది. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ తో సాత్విక బిజీ బిజీగా ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సాత్విక కాఫీ గురించి చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా చాలా మందికి కాఫీ అంటే ఇష్టం ఉంటుంది. కానీ సాత్విక కి అంతకు మించి అన్నట్లుగా ఉంది. ఆమె ఇప్పటి వరకు ఏకంగా 150 కాఫీ షాప్ లకు వెళ్లి అక్కడ ఉన్న కాఫీ ని టేస్ట్ చేసిందట. కాఫీ రివ్యూలను సైతం ఇచ్చిందట. సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె తన కాఫీ రివ్యూలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈమెను ఆకాశంలో ఒక తార దర్శకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి ఎంపిక చేసినట్లు చెప్పాడు. కనుక ఈమె కాఫీ వీడియోలు ఏమైనా చూసి ఉంటాడేమో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాఫీ అంటే తనకు చాలా చాలా ఇష్టం అని చెప్పడం ద్వారా సాత్విక అందరి దృష్టిని ఆకర్షించింది.
సాత్విక వీరవల్లి నటించిన...
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 150 కాఫీ షాప్స్ లో కాఫీని టేస్ట్ చేయడం, దానికి రివ్యూ కూడా ఇవ్వడం చిన్న విషయం కాదని నెటిజన్స్ అంటున్నారు. ఈమె అందరిక్షం వెళ్లడానికి ముందు ఇన్ని కాఫీ షాప్స్ కి వెళ్లిందా అంటూ వీడియోలు పంచుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. హైదరాబాద్ లో తనకు నచ్చిన కాఫీ షాప్స్ పేరు చెప్పి వాటిని ప్రమోట్ చేసింది. కాఫీ ఎక్కడ ఉన్నా, ఆ కాఫీ బాగుందంటే తప్పకుండా నేను అక్కడికి వెళ్తాను అన్నట్లుగా ఈమె చెప్పింది. 150 కాఫీ షాప్ ల రివ్యూ ఇవ్వడం మామూలు విషయం కాదు. కాఫీ లవర్స్ కి ఈమె ఇన్సిపిరేషన్ అంటూ కొందరు సోషల్ మీడియాలో సరదా కామెంట్స్ చేస్తున్నారు. సాత్విక వీరవల్లి గురించి సోషల్ మీడియాలో ఇప్పుడు కాఫీ లవర్ అని కూడా చర్చ జరుగుతోంది. చికాగోలో పుట్టినప్పటికీ ఈమె తండ్రి ఏపీ కి చెందిన వ్యక్తి కావడంతో తెలుగు మూలాలు ఉన్నాయి. అలాగే తమిళ్ మూలాలు సైతం ఈమెలో ఉన్నట్లు సమాచారం.
రామ్ చరణ్, సుకుమార్ కాంబో...
ఆకాశంలో ఒక తార సినిమా విడుదలకు ముందే ఈమెను రామ్ చరణ్ మూవీలో ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో రూపొందబోతున్న సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. కానీ కచ్చితంగా కల్పన పాత్రతో మెప్పించడం వల్ల చరణ్ కి జోడీగా నటించే అవకాశం దక్కించుకోవచ్చు అంటున్నారు. అతి త్వరలోనే సుకుమార్ అండ్ టీం నుంచి ఈ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ సినిమాలో చరణ్ విభిన్నమైన మేకోవర్ లో కనిపించబోతున్నట్లు సమాచారం అందుతోంది. రంగస్థలం, పుష్ప సినిమాలను మించి ఆర్‌సీ-సుక్కూ కాంబో మూవీ ఉండబోతున్నట్లు ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. సుకుమార్ దాదాపు రెండు ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. షూటింగ్ ప్రారంభంకు ముందు హీరోయిన్ విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
