కట్టప్ప సంచలన నిర్ణయం?
అదే కట్టప్ప పాత్ర ఆయన ఇంటి పేరుగానూ మారిపోయింది. అయితే ఇప్పుడాయన సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది.
By: Srikanth Kontham | 7 Aug 2025 3:00 AM ISTకోలీవుడ్ నటుడు సత్యరాజ్ పరిచయం అవసరం లేని పేరు. దేశంలో అన్ని భాషల్లోనూ సినిమాలు చేసిన నటుడాయన. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో సుదీర్గమైన ప్రస్థానం ఆయన సొంతం. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న నటుడు. తండ్రి, అన్నయ్య లాంటి పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. నేటి జనరేషన్ యువతకు ఆయన 'కటప్ప'గా ఎంతో ఫేమస్. 'బాహుబలి' లో కట్పప్ప పాత్ర ఆయనకు పాన్ ఇండియాలోనే ఎనలేని గుర్తింపును తీసుకొచ్చింది.
అదే కట్టప్ప పాత్ర ఆయన ఇంటి పేరుగానూ మారిపోయింది. అయితే ఇప్పుడాయన సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. ఓ సినిమా ప్రచారంలో భాగంగా సత్యరాజ్ తండ్రి, విలన్ పాత్రలపై అనాసక్తిని వ్యక్తం చేసారు. కొంత కాలంగా ఇవే పాత్రలు పోషిచండంతో బోర్ కొట్టేసిందన్నారు. ఇప్పటి కిప్పుడు ఆ పాత్రలకు రిటైర్మెంట్ ప్రకటించలేదు గానీ తండ్రి పాత్రలు చేయడం నచ్చలేదన్నారు. ఇంకా వినూత్నమైన పాత్రలను కోరుకుంటున్నట్లు ఆయన మాటల్ని బట్టి అర్దమవుతుంది.
సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో కొన్ని సినిమాలు చేస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కంటే ఆ తరహా పాత్రలనే ఆయన కోరుకుంటున్నట్లు కనిపిస్తుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎక్కువ సినిమాలు చేయడం కంటే? తానే మెయిన్ లీడ్ అయితే అవి కొన్ని పాత్రలే అయినా మంచి గుర్తింపు దక్కుతుందని ఆశిస్తున్నట్లు కని పిస్తుంది. అది జరగాలంటే? దర్శక, రచయితలు సత్యరాజ్ కోసం సిద్దమవ్వాలి. సత్యరాజ్ వయసు ఇప్పటికే 70 ఏళ్లు. అయినా ఎక్కడా కింగ లేదు.
ఇటీవలే నాగార్జున సైతం సత్యరాజ్ న్యూ లుక్ చూసి షాక్ అయ్యారు. తన వయసున్న రజనీకాంత్ తాతయ్య అయినా? సత్యరాజ్ మాత్రం నవ మన్మధుడిలా ముస్తాబై కూలీ ఈవెంట్ కి విచ్చేయడం విశేషం. ఒకవేళ సత్యరాజ్ డాడ్ పాత్రలకు గుడ్ బై చెబితే గనుక ఆ స్థానం భర్తీ కూడా చిన్న విషయం కాదు. కొంత కాలంగా తెలుగు డైరెక్టర్లకు సత్యరాజ్ ఓ ఆప్షన్ గా మారిపోయారు. డాడ్ రోల్స్ రాస్తే అందరూ ఆయన చుట్టూనే తిరుగుతున్నారు. సత్యరాజ్ నో చెబితే ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందే.
