500 ఎకరాల ఆస్తిపరుడు చివరకు కమెడియన్ గా!
హీరో అవ్వాలని ఎవరికుండదు. మరి అలా అందరూ హీరో లైపోతే మిగతా పాత్రలు ఎవరు పోషిస్తారు. అందుకే పరిశ్రమ కొందర్ని హీరోల వైపు నడిపించదు.
By: Srikanth Kontham | 8 Sept 2025 3:00 PM ISTహీరో అవ్వాలని ఎవరికుండదు. మరి అలా అందరూ హీరో లైపోతే మిగతా పాత్రలు ఎవరు పోషిస్తారు. అందుకే పరిశ్రమ కొందర్ని హీరోల వైపు నడిపించదు. ఇతర పాత్రలవైపు ప్రయాణించేలా చేస్తుంది. ఇండస్ట్రీలో తమిళ కమెడియన్ సత్యన్ ప్రయాణం కూడా ఇలాగే సాగింది. సత్యన్ కోలీవుడ్ స్టార్ హీరోల చిత్రాల్లో కమెడియన్ గా నటిస్తుంటాడు. `స్నేహితుడు` చిత్రంతో సైలెన్సర్ గా బాగా ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో కమెడియన్ గా బిజీ. కానీ సత్యన్ హీరో అవ్వాలనుకుని వచ్చాడు.
కర్పూరంలా కరిగిపోయిన ఆస్తి:
హీరోగా ఓ రెండు సినిమాలు కూడా చేసాడు. వాటిని తన తండ్రి మదంపట్టి శికుమార్ నిర్మించారు. ఈయన అప్పట్లో కోలీవుడ్ లో పెద్ద నిర్మాత. 500 ఎకరాల ఆసామీ కూడా. ఎలాగైనా తనయుడిని హీరో చేయాలని ఎంతో ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే రెండు సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నాడు. ఆ రెండు సిని మాలు తీవ్ర నష్టాలను తెచ్చి పెట్టాయి. అయితే ఈ 500 ఎకరాలు కూడా సినిమా పెట్టుబడి రూపంలో కర్పూరంలా కరిగిపోయాయని ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది.
తన ఫ్యాషన్ తనయుడి రూపంలో:
మదంపట్టి శివకుమార్ కు భారీ ఆస్తులతో పాటు, భవంతులు ఉండేవి. ఎంతో విలాసవంతమైన జీవితం గడిపారు. కానీ సినిమాల్లో నిర్మాతగా మొదలైన తర్వాత ఆయన ఆస్తులన్నీ పొగొట్టుకున్నారు. నిర్మాణ వైఫల్యం ,చేసిన సినిమాలు లాభాలకు బధులు నష్టాలు తేవడంతో ఆయన జీవితమే తల్లికిందులైంది. నిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చడానికి ఉన్న ఆస్తులను అమ్మాల్సిన పరిస్థితి. సరిగ్గా అదే సమ యంలో కొడుకుని కూడా హీరోని చేయాలనే ఆలోచన మరింత క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేసింది.
కమెడియన్ గా గొప్ప సక్సెస్ :
సరైన అవగాహన లేకుండా సినిమాలు తీయడంతో అవి ప్లాప్ అవ్వడం..నష్టాలు రావడం జరిగింది. 2005 లో సత్యన్ `ఇలయవన్` అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మరో సినిమా కూడా తనయు డితో నిర్మించి చేతులు కాల్చుకున్నారు. అటుపై సత్యన్ హీరో ఆశలు వదులుకుని కమెడియన్ గా అవతా రం ఎత్తాడు. ఇక్కడ మాత్రం ఊహించిన దానికంటే పెద్ద సక్సెస్ అయ్యాడు. ఇప్పుడా కమెడియన్ ప్రయా ణంతోనే నిలదొక్కుకుని మళ్లీ గత వైభవాన్ని అందుకుంటున్నాడు.
