Begin typing your search above and press return to search.

పర్ఫెక్ట్ టైమింగ్ లో 'సతి లీలావతి'.. మెగా లావణ్యపై పాజిటివ్ వైబ్స్

వేసవి సెలవుల్లో థియేటర్లకు వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ ఒక పక్కా లోకల్ ఎంటర్టైనర్ సిద్ధమైంది

By:  M Prashanth   |   25 April 2026 10:55 AM IST
పర్ఫెక్ట్ టైమింగ్ లో సతి లీలావతి.. మెగా లావణ్యపై పాజిటివ్ వైబ్స్
X

వేసవి సెలవుల్లో థియేటర్లకు వచ్చే ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ ఒక పక్కా లోకల్ ఎంటర్టైనర్ సిద్ధమైంది. యాక్షన్ సినిమాలు, భారీ బడ్జెట్ హడావుడి మధ్య రిలేషన్ షిప్ డ్రామాలు పలకరించి చాలా కాలమైంది. ఆ లోటును భర్తీ చేసేందుకు లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జంటగా ‘సతి లీలావతి’ మే 8న రాబోతోంది. ‘భీమిలి కబడ్డీ జట్టు’ ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి.




ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాల్లో ఏదో ఒక సీరియస్ ఎమోషన్ ఉంటుంది, కానీ ‘సతి లీలావతి’ మాత్రం పూర్తి సరదాగా సాగిపోయే కథ. భార్యాభర్తల మధ్య ఉండే ఆధిపత్య పోరాటాన్ని కామెడీ యాంగిల్‌లో చూపిస్తూనే, నేటి తరం జంటలు రిలేట్ చేసుకునేలా ఈ మూవీని రూపొందించినట్లు నిర్మాత నాగ మోహన్ తెలిపారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో నాగా మోహన్ నిర్మించిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ క్లీన్ ‘U’ సర్టిఫికెట్ ఇచ్చింది.

అంటే ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఇంట్లోని చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కలిసి చూడొచ్చని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. సినిమా సక్సెస్ లో సంగీతం పాత్ర ఎప్పుడూ కీలకమే. మిక్కీ జె. మేయర్ అందించిన మెలోడీ సాంగ్స్ ఇప్పటికే వినేందుకు చాలా రిఫ్రెషింగ్‌గా ఉన్నాయి. అలాగే టీజర్ కంటెంట్ కూడా జనాలను బాగా ఎట్రాక్ట్ చేసింది. లావణ్య త్రిపాఠి కొణిదెల తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మేజిక్ చేస్తుంటే, దేవ్ మోహన్ తన స్టైలిష్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్నారు.

వీరికి తోడు సప్తగిరి, నరేష్, విటివి గణేష్ వంటి కమెడియన్ల టైమింగ్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. బినేంద్ర మీనన్ విజువల్స్ పోస్టర్లలోనే చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి. సాధారణంగా మే నెలలో వచ్చే సినిమాలకు సమ్మర్ అడ్వాంటేజ్ ఉంటుంది. వేడి తాపాన్ని మర్చిపోయి కాసేపు హాయిగా నవ్వుకోవాలని ఆడియన్స్ కోరుకుంటారు. ఆ అంచనాలను అందుకోవడానికి ‘సతి లీలావతి’ పర్ఫెక్ట్ పాప్‌కార్న్ మూవీలా కనిపిస్తోంది.

కేవలం రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ తరహాలో కాకుండా, భార్యాభర్తల బంధంలోని విలువను సున్నితంగా టచ్ చేసినట్లు తెలుస్తోంది. ఉదయ్ పొట్టిపాడు డైలాగ్స్ కూడా కథలోని ఇంటెన్సిటీని పెంచేలా ఉన్నాయని టీమ్ చెబుతోంది. ఇక సమ్మర్ హాలిడేస్ లో అన్ని వర్గాల ఆడియెన్స్ కోసం ఈ ‘సతి లీలావతి’ అస్త్రం సిద్ధమైంది. తాతినేని సత్య తన పాత ఫామ్ ను మళ్ళీ రిపీట్ చేస్తే, మే 8న బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ రావడం ఖాయం. ఒక ఫ్రెష్ జోడీని వెండితెరపై చూడాలనుకునే వారికి ఈ సినిమా ఒక మంచి ఆప్షన్ కాబోతోందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. మరి ఈ సమ్మర్ బరిలో సతి లీలావతి ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో, భార్యాభర్తల చిలిపి గొడవలు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాయో వేచి చూడాలి.