లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. టీజర్ తో ఫన్నీ ట్రీట్!
ప్రస్తుతం ‘సతీ లీలావతి’ మూవీ షూటింగ్ పూర్తయ్యి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్పీడ్‌లో సాగుతున్నాయి.
By: M Prashanth | 29 July 2025 11:46 AM ISTటాలీవుడ్‌లో వినూత్నమైన ఫన్ ఎంటర్‌టైనర్‌లలో ఒకటిగా బజ్ క్రియేట్ చేస్తున్న చిత్రం ‘సతీ లీలావతి’. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జంటగా కనిపించనున్నారు. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్ వంటి హిట్ సినిమాలు తీసిన తాతినేని సత్య దర్శకత్వం వహించడంతో ఈ ప్రాజెక్ట్‌పై మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రముఖ నటీనటులు వి.కె.నరేష్, వి.టి.వి.గణేష్, సప్తగిరి, మొట్ట రాజేంద్రన్, జాఫర్ సాదిక్, జోషి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
టీజర్ లో ఫన్నీ వేప్స్
మంగళవారం రిలీజ్ చేసిన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ పెళ్లి అనంతరం హ్యాపీ మూడ్‌తో స్టార్ట్ అయిన టీజర్.. తర్వాతి సీన్‌లోనే కామెడీ మోడ్‌లోకి మారడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. లావణ్య, దేవ్ మోహన్ మధ్య చిన్న గొడవల్లో వి.కె.నరేష్, సప్తగిరి, వి.టి.వి.గణేష్ వంటి క్యారెక్టర్స్ ఎంటర్ చేయడంతో మరింత వినోదాన్ని చేకూర్చనున్నాయి. భార్య, భర్తల మధ్య జరిగే చిన్న సమస్యలు, దానికి పరిష్కారాలు.. ఇవన్నీ ఫన్నీ టచ్‌తో చూపించబోతున్నారన్నమాట.
ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యేలా..
‘సతీ లీలావతి’ కథలో ప్రధానంగా భార్యాభర్తల మధ్య రిలేషన్, చిన్న చిన్న గొడవలు, వాటిపై కుటుంబ సభ్యులు కలగజేసుకోవడం.. ఇవన్నీ చక్కటి హాస్యంతో, హార్ట్ టచింగ్ ఎమోషన్‌తో చూపించబోతున్నారు. ముఖ్యంగా లావణ్య త్రిపాఠి ప్రెజెన్స్, దేవ్ మోహన్ కామెడీ టైమింగ్ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ అవుతాయి. ఈ సినిమా టీజర్‌లో చూపించిన హ్యూమర్, ఎమోషన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతున్నాయి.
ప్రస్తుతం ‘సతీ లీలావతి’ మూవీ షూటింగ్ పూర్తయ్యి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్పీడ్‌లో సాగుతున్నాయి. అనుకున్న ప్లానింగ్ ప్రకారం సినిమాను త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలని మేకర్స్ సిద్ధమవుతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకునేలా, ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించడంపై ఫోకస్ పెట్టారు.
సాంకేతిక నిపుణులు
మిక్కీ జే మేయర్ సంగీతం, బినేంద్ర మీనన్ సినిమాటోగ్రఫీ, సతీష్ సూర్య ఎడిటింగ్ వంటి టాలెంటెడ్ టెక్నికల్ టీమ్ ఈ సినిమాకు మరింత బలాన్ని తెచ్చింది. మ్యూజిక్, విజువల్స్, కామెడీ, ఎమోషన్.. ఇలా అన్ని రూట్లలో కంటెంట్ పక్కాగా ఉంటుంది అని చిత్ర బృందం చెప్పుకొస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో మంచి స్పందన తెచ్చుకున్న ‘సతీ లీలావతి’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌కు కూడా కనెక్ట్ అయ్యేలా సినిమాను రూపొందించారని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
