నిర్మాతల కోసం కార్తీ ఇమేజ్ డ్యామేజ్..!
తమిళ హీరో కార్తీ వరుస ఫ్లాప్స్‌తో సతమతం అవుతున్నాడు. భారీ అంచనాల నడుమ వచ్చిన 'సర్దార్ 2' సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాభవంను చవిచూడాల్సి వచ్చింది.
By: Ramesh Palla | 1 Oct 2026 11:53 AM ISTతమిళ హీరో కార్తీ వరుస ఫ్లాప్స్‌తో సతమతం అవుతున్నాడు. భారీ అంచనాల నడుమ వచ్చిన 'సర్దార్ 2' సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాభవంను చవిచూడాల్సి వచ్చింది. చిన్న సినిమా మండాడితో పోటీ పడలేక బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. తమిళ మీడియా వర్గాల కథనాల ప్రకారం సినిమాకి చేసిన ప్రమోషన్ ఖర్చులు సైతం వసూళ్ల రూపంలో రాలేదట. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ సర్దార్ 2 ను ప్రమోట్ చేయడం జరిగింది. కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడటంతో పెట్టిన ఖర్చు అంతా బూడిదలో పోసిన పన్నీరు అన్నట్లుగా మారిందని ఆవేదన వ్యక్తం అవుతోంది. సర్దార్ సినిమాకు ఎలాగూ వసూళ్లు రావడం లేదు కనుక, ముందుగా ఓటీటీ స్ట్రీమింగ్ చేయడం ద్వారా నిర్మాతకు కాస్త ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో సర్దార్ 2 ను మూడు వారాల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకు వచ్చారు.
కార్తీ సర్దార్ 2 వసూళ్లు...
నేటి నుంచి 'సర్దార్ 2' సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో హీరో కార్తీ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కార్తీ గతంలోనూ తన వా వాతియార్ సినిమాను సైతం కేవలం రెండు వారాల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కి తీసుకు రావడం జరిగింది. సాధారణంగా ఓటీటీలో థియేట్రికల్ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత మాత్రమే స్ట్రీమింగ్ చేయాలి. అలా అయితేనే థియేటర్లకు జనాలు వస్తారు. అలా కాదని రెండు మూడు వారాలకే సినిమాను ఓటీటీలో విడుదల చేస్తే థియేటర్లకు జనాలు రావడం మానేస్తారు అనేది విశ్లేషకుల మాట. నాలుగు వారాల గడువును పెంచాలని సినీ ప్రేమికులు కోరుకుంటూ ఉంటే కార్తీ మాత్రం తన వరుస సినిమాలను రెండు, మూడు వారాల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడంను చాలా మంది తప్పుబడుతున్నారు. ఇది ఆయన మార్కెట్‌ను దెబ్బ తీస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మూడు వారాలకే ఓటీటీలో కార్తీ మూవీ...
కార్తీ సినిమా కమర్షియల్‌గా నిరాశ పరచడంతో నిర్మాతకు కొంతలో కొంత అయినా వెసులుబాటు కలుగుతుంది అనే ఉద్దేశంతో ముందస్తు ఓటీటీ స్ట్రీమింగ్‌కి హీరో కార్తీ ఒప్పుకుని ఉంటాడు. కానీ అది ఆయన మార్కెట్ ను దెబ్బ తీస్తుంది. కార్తీ సినిమా థియేటర్‌లో విడుదల అయిన రెండు మూడు వారాల్లోనే ఓటీటీలో వస్తుంది. కనుక ఆయన సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే వరకు వెయిట్ చేయవచ్చు అని ప్రేక్షకులు భావించే అవకాశం ఉంది. తద్వారా ఆయన తదుపరి సినిమాల యొక్క బిజినెస్ పై ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఆ విషయాన్ని కార్తీ గమనించకుండా, ఆలోచన చేయకుండా నిర్మాతకు వచ్చే కొంత మొత్తం కోసం రెండు వారాల తర్వాత లేదా మూడు వారాల తర్వాత ఓటీటీలో సినిమాలను స్ట్రీమింగ్‌కు ఒప్పుకోవడం ఎంత వరకు కరెక్ట్ అనే విషయాన్ని ఆలోచించాలని ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.
కార్తీ ఇమేజ్ డ్యామేజ్...
సర్దార్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపించలేదు. అయినా కూడా నాలుగు వారాల పాటు థియేట్రికల్ రన్ కొనసాగిందని, ఆ తర్వాత ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ చేసి ఉంటే గౌరవ ప్రధంగా ఉండేది అనేది విశ్లేషకుల మాట. అలా కాదని తమ సినిమా డిజాస్టర్ అని తమకు తామే ఒప్పుకుని మూడు వారాల్లోనే ఓటీటీకి తీసుకు వచ్చినట్లు ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సర్దార్ సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో సర్దార్ 2 కి మంచి బజ్ క్రియేట్ అయింది. థియేట్రికల్ రిలీజ్ లో వసూళ్లు సాధించడంలో ఫెయిల్ అయినా కూడా ఇప్పటికే చేసిన పబ్లిసిటీ, క్రియేట్ అయిన బజ్ కారణంగా ఓటీటీలో ఎక్కువ మంది చూస్తారనే ఉద్దేశంతో ఒక వారం ముందుగా స్ట్రీమింగ్‌కు తీసుకు వచ్చినట్లు మేకర్స్ చెబుతున్నారు. కానీ ఈ విషయాన్ని మాత్రం కార్తీ అభిమానులు ఒప్పుకోవడం లేదు. ఆయన భవిష్యత్తు ప్రాజెక్ట్‌లపై ప్రభావం ఉంటుందని, కార్తీ ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా ముందస్తు స్ట్రీమింగ్ పద్దతి ఉందనే విమర్శలు వస్తున్నాయి. నిర్మాతల కోసం కార్తీ తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకుంటున్నాడని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
