తినగ తినగ వేప అయినా తీపి శరవణా
అయితే మొదటి సినిమా ది లెజెండ్ కి `లీడర్`కి మధ్య తేడా స్పష్ఠంగా కనిపిస్తోంది. రెండో సినిమాకే అతడు చాలా పరిణతి చెందాడు.
By: Sivaji Kontham | 4 Feb 2026 11:05 PM ISTతినగ తినగ వేప అయినా తీపిగా మారును! ఇతడిని భరించలేము అనుకున్న వాళ్లు కూడా నెమ్మదిగా చూడటానికి అలవాటు పడతారు. ఎవరో నటవారసుడిని ప్రజల మీదికి ఒదిలారు! అని భయపడాల్సిన పని లేదు. దిగులు చెందాల్సిన అవసరం అసలే లేదు. అసలు నటనా ప్రపంచానికి సంబంధం లేకుండా వ్యాపార ప్రపంచంలో మునిగి తేలిన శరవణన్ కుటుంబం నుంచి ఆర్టిస్టు రావడం ఒక ఎత్తు అనుకుంటే, అతడు వరుస సినిమాలతో దండయాత్ర చేయడం మరొక ఎత్తు.
శరవణన్ ఆరంగేట్రమే `లెజెండ్` అనే చిత్రంలో నటించాడు... సినిమా డిజాస్టర్.. అసలు ఇతడు నటుడేనా? డబ్బు ఉంది కదా... ఏ నాటకం అయినా ఆడతారు! అంటూ తీవ్రంగా విమర్శించారు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా అతడు తన సినిమాని రిలీజ్ చేసి ఏం జరుగుతుందో ఈ ప్రజల ఆవేదన ఏమిటో తెలుసుకోవాలనుకున్నాడు. అతడి గట్సీ ఎటెంప్ట్ కి అందరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా జర్నలిస్టులంతా అతడి ప్రయత్నాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.
ఇప్పుడు శరవణన్ `లీడర్`లో నటించాడు.. రెండో సినిమా కి కూడా మొదటి సినిమాకి పెట్టినట్టే డబ్బు బాగా పెట్టాడు.. ఇది సాహసమే అయినా కానీ అతడు తగ్గేదేలే అంటూ ముందుకు ఉరుకుతున్నాడు. ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు.. అతడు శరవణన్ ని తక్కువగా చూడలేదు. ఒక రజనీకాంత్ రేంజులో ఎలివేట్ చేసాడని తాజాగా రిలీజైన టీజర్ చెబుతోంది.
అయితే మొదటి సినిమా ది లెజెండ్ కి `లీడర్`కి మధ్య తేడా స్పష్ఠంగా కనిపిస్తోంది. రెండో సినిమాకే అతడు చాలా పరిణతి చెందాడు. అంతేకాదు.. అతడిని డైరెక్ట్ చేసే దర్శకుడు పరిణతి చెందాడని కూడా అర్థం చేసుకోవచ్చు. నటన అన్నదే తెలియని రా మెటీరియల్ ని ఎలా చూపించాలో సెంథిల్ కరెక్ట్ గానే మెజర్ చేసాడు. ఆరంగేట్ర హీరోని ఎంత ఎలివేట్ చేయాలో? ఎలా చూపించాలో పర్ఫెక్ట్ లెంగ్త్ లో రిలీజ్ చేసాడు. ప్రతి తండ్రి హీరోనే అంటూ అద్భుతమైన డైలాగ్ కూడా చెప్పాడు. లుక్స్ మ్యాటర్ లోను డీసెన్సీని మెయింటెయిన్ చేసాడు. టీజర్ వరకూ ఓకే కానీ పూర్తి సినిమాలో కూడా ఇంతే షటిల్డ్ గా అతడు కనిపిస్తాడా? అతడిని తెరపై చూపించిన దర్శకుడు వందశాతం సఫలయ్యాడా? .. ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానంగా ఈ సినిమా ఉంటుందని భావిస్తున్నారు..
