Begin typing your search above and press return to search.

సచిన్‌ కూతురుకి గోవా సిద్దార్థ్‌కి సంబంధం ఏటో..?

ఇప్పుడు సచిన్‌ కుమార్తె సారా టెండూల్కర్‌ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఆమె వివాహ నిశ్చితార్థం గురించి ఇటీవల ప్రముఖంగా కథనాలు వచ్చాయి.

By:  Ramesh Palla   |   5 Sept 2025 10:02 AM IST
సచిన్‌ కూతురుకి గోవా సిద్దార్థ్‌కి సంబంధం ఏటో..?
X

సచిన్‌ ఆట మాని ఎన్నో సంవత్సరాలు అవుతున్నా ఆయన గురించి ఎప్పుడూ మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. నేషనల్‌ సెలబ్రిటీ కావడంతో సచిన్‌ పిల్లల గురించి కూడా ఎప్పుడూ మీడియాలో ఏదో ఒక విషయం గురించి చర్చ జరుగుతూనే ఉంది. సచిన్‌ కూతురు, కుమారుడు గురించి ఎప్పటికప్పుడు మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు సచిన్‌ కుమార్తె సారా టెండూల్కర్‌ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఆమె వివాహ నిశ్చితార్థం గురించి ఇటీవల ప్రముఖంగా కథనాలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదే సమయంలో ఆమె ప్రేమ వ్యవహారం గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. సారా టెండూల్కర్‌ గోవాకు చెందిన సిద్దార్థ్‌ తో ప్రేమలో ఉందనే పుకార్లు సోషల్‌ మీడియాలో తెగ షికారు చేస్తున్నాయి.

ప్రేమలో సారా టెండూల్కర్‌

ఈ మధ్య కాలంలో సారా టెండూల్కర్‌ పదే పదే ఇతడితో ఉన్న ఫోటోలను షేర్‌ చేయడంతో పాటు, అతడిని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఫాలో కావడం వంటి కారణాల వల్ల ఏం జరుగుతుంది అనే చర్చ మొదలు అయింది. గోవాకు చెందిన సిద్దార్థ్‌ కి అక్కడ రెస్టారెంట్‌ వ్యాపారం ఉంది. అంతే కాకుండా అతడు గోవా స్థానిక ఆర్టిస్ట్‌ అని సమాచారం. ఈ మధ్య కాలంలో గోవాలో ఎక్కువగా కనిపిస్తున్న సారా టెండూల్కర్‌ అతడితో దిగిన ఫోటోలను షేర్‌ చేయడం జరుగుతుంది. అంతే కాకుండా అతడు కూడా తన సోషల్‌ మీడియా అకౌంట్స్ ద్వారా సారా టెండూల్కర్‌ తో దిగిన ఫోటోలను షేర్‌ చేస్తూ వస్తున్నాడు. గతంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లను సచిన్‌ కుటుంబ సభ్యులతో కలిసి చూసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అంతే కాకుండా సచిన్‌ ఫ్యామిలీతో అతడు రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్నాడు.

సచిన్‌ ఫ్యామిలీ నుంచి నో రెస్పాన్స్‌

అతడి సోషల్‌ మీడియా అకౌంట్స్ పరిశీలించినా, సారా గతంలో షేర్ చేసిన కొన్ని వీడియోలను చూసినా కూడా వారితో సిద్దార్థ్‌ ఉంటున్నాడు. అంటే వీరిద్దరి మధ్య పరిచయం చాలా కాలంగానే ఉంది. ఇప్పుడు వీరిద్దరి గురించి మీడియా ఎక్కువ ఫోకస్ పెట్టి మరీ వార్తలు రాస్తుంది. ఈ మధ్య కాలంలో సారా టెండూల్కర్‌, సిద్దార్థ్‌ కలిసి లాంగ్ ట్రిప్‌కు వెళ్లిన ఫోటోలు, వీడియోలను షేర్‌ చేశారు. మళ్లీ మళ్లీ సోషల్‌ మీడియాలో వీరి ఫోటోలు కనిపిస్తున్న నేపథ్యంలో అంతా కూడా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం సాగుతోంది అనే గట్టి నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీ కిడ్స్ ప్రేమ వ్యవహారాలు చాలా కామన్‌ విషయం. అయితే సారా టెండూల్కర్‌ విషయంలో ఇలాంటి వార్తలు రావడం కాస్త చర్చనీయాంశం అవుతోంది.

సారా పెళ్లి కి ఏర్పాట్లు..!

ప్రస్తుతం సారా టెండూల్కర్‌ గురించి సోషల్‌ మీడియాలో కుప్పలు తెప్పలుగా వస్తున్న కథనాలపై ఇప్పటి వరకు సచిన్‌ ఫ్యామిలీ నుంచి చిన్న స్పందన కూడా రాలేదు. ఆ మధ్య నిశ్చితార్థం అంటూ వచ్చిన వార్తలపై కూడా స్పందించలేదు. సారా టెండూల్కర్‌ వివాహం విషయంలో సచిన్ రెడీగా ఉన్నాడని, ఏ క్షణంలో అయినా ఆయన నుంచి ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే ఈ పుకార్లకు ఫుల్‌ స్టాప్ పెట్టి సారా టెండూల్కర్‌ పెళ్లి విషయమై అధికారికంగా సచిన్‌ ప్రకటన చేస్తాడేమో చూడాలి. గోవాకు చెందిన సిద్దార్థ్‌ తో సారా టెండూల్కర్‌ పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయని చాలా మంది అంటున్నారు. అసలు విషయం ఏంటి అనేది తెలియాలి అంటే మరికొన్నాళ్లు వెయిట్‌ చేయాల్సిందే.