Begin typing your search above and press return to search.

స్పెష‌ల్: స‌చిన్ టెండూల్క‌ర్ కాబోయే కోడ‌లి హంగామా

క్రికెట్ గాడ్ స‌చిన్ టెండూల్క‌ర్ కుమార్తె సారా టెండూల్క‌ర్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఈ బ్యూటీ త‌న‌దైన అందం, ప్ర‌తిభ‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

By:  Sivaji Kontham   |   23 Aug 2025 9:14 AM IST
స్పెష‌ల్: స‌చిన్ టెండూల్క‌ర్ కాబోయే కోడ‌లి హంగామా
X

క్రికెట్ గాడ్ స‌చిన్ టెండూల్క‌ర్ కుమార్తె సారా టెండూల్క‌ర్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఈ బ్యూటీ త‌న‌దైన అందం, ప్ర‌తిభ‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. సారా టెండూల్కర్‌కు ఇన్‌స్టాలో 8 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత విస్తృతంగా ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీలలో ఒకరిగా సారా పేరు వినిపిస్తోంది. అంతేకాదు.. సారా ఇప్పుడు తండ్రి బాట‌లోనే ఎంటర్ ప్రెన్యూర్ గా ఎదిగేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇందులో భాగంగా `పైలేట్స్ అకాడెమీ` పేరుతో ముంబైలో తొలి ఫిట్ నెస్ సెంట‌ర్ ని సారా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్స‌వంలో టెండూల్క‌ర్ కుటుంబం అంతా క‌నిపిస్తోంది. అయితే రిబ్బ‌న్ క‌టింగ్ ఈవెంట్లో స‌చిన్ కాబోయే కోడ‌లు సానియా చందోక్ ఉత్సాహంగా క‌నిపించారు కానీ, కుమారుడు అర్జున్ మాత్రం క‌నిపించ‌లేదు. అత‌డు బ‌హుశా ఆట‌లో నిమ‌గ్న‌మై ఉండ‌టం వ‌ల్ల ఈ వేడుక‌కు అటెండ్ కాలేక‌పోయాడ‌ని భావిస్తే, వేడుక ఆద్యంతం కాబోయే కోడ‌లి హంగామా స్ప‌ష్ఠంగా క‌నిపించింది.

స‌చిన్ స్వ‌యంగా సోష‌ల్ మీడియాల్లో ఫోటోల‌ను షేర్ చేయ‌గా, అవి ఇంట‌ర్నెట్ లో వేగంగా దూసుకెళుతున్నాయి. ఇటీవ‌లే అర్జున్ టెండూల్క‌ర్- సానియా చందోక్ నిశ్చితార్థం పూర్త‌యింద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఈ నిశ్చితార్థం గురించి స‌చిన్ కుటుంబం కానీ, సానియా కుటుంబం కానీ అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. కొద్దిమంది బంధుమిత్రుల స‌మ‌క్షంలో ఈవెంట్ జ‌రిగింద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇక అప్ప‌టి నుంచి సానియా చందోక్ టెండూల్క‌ర్ కుటుంబంతో క‌నిపిస్తోంది. ఇప్పుడు సారా టెండూల్క‌ర్ పైలేట్స్ స్టూడియో లాంచింగ్ వేడుక‌లోను కోడ‌లు పిల్ల సానియా చందోక్ హైలైట్ గా క‌నిపిస్తోంది. ఉత్సాహం నిండిన హృద‌యాల‌తో టెండూల్క‌ర్ కుటుంబంలో క‌లిసిపోయి క‌నిపిస్తోంది సానియా.

సానియా చందోక్ ముంబైలోని ప్ర‌ముఖ‌ బిజినెస్ కుటుంబం నుంచి వ‌చ్చిన వ‌నిత‌. మ‌హిళా ఎంట‌ర్ ప్రెన్యూర్ గా దూసుకుపోతోంది. ముంబైకి చెందిన పెంపుడు జంతువుల పోషణ- సంక్షేమ సంస్థ `మిస్టర్ పావ్స్ పెట్ స్పా & స్టోర్ LLP` డైరెక్టర్ అయిన సానియా చందోక్ 25 వ‌యసులో బిజినెస్ ఉమెన్ గా రాణిస్తోంది. గ్రావిస్ గ్రూప్ ఛైర్మన్ అయిన ప్రముఖ ముంబై వ్యాపారవేత్త రవి ఘాయ్ కి సానియా మనవరాలు. ఇప్పుడు ప్ర‌ఖ్యాత క్రికెట్ దిగ్గ‌జం టెండూల్క‌ర్ కుటుంబంలో అడుగుపెడుతుండ‌డంతో సానియా ఇమేజ్ అమాంతం పెర‌గ‌నుంది.

స‌చిన్ కుమార్తె సారా టెండూల్క‌ర్ వ్యాపార‌వేత్త‌గా త‌న ప్ర‌యాణాన్ని ప్రారంభించింది. దీనికోసం ఇటుక ఇటుక పేర్చుకుంటూ త‌న ప్ర‌యాణాన్ని అజేయంగా సాగిస్తోంద‌ని, ఇది త‌మ‌కు గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని స‌చిన్ టెండూల్క‌ర్ ఆనందం వ్య‌క్తం చేసారు. త‌ల్లిదండ్రులుగా పిల్ల‌లు నిజంగా ఇష్ట‌ప‌డే ప‌నిని చేయాల‌ని కోరుకుంటాము. పోష‌కాహార ఉద్య‌మం మా జీవితాల్లో ఒక భాగం. ఇప్పుడు ఫిట్ నెస్ వెల్ నెస్ రంగంలో సారా ప్ర‌యాణానికి అభినంద‌న‌లు అని స‌చిన్ ఎమోష‌న‌ల్ అయ్యారు.

ఇక స‌చిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ క్రికెట‌ర్ గా త‌న కెరీర్ ని నిర్మించుకోవ‌డంలో బిజీగా ఉన్నారు. అత‌డు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ముంబై ఇండియన్స్ జట్టులో సభ్యుడు. దేశీయ క్రికెట్‌లో గోవాకు ప్రాతినిధ్యం వహిస్తాడు.ఐపీఎల్ 2025 సీజన్‌లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని టీమ్ లో ఉన్నాడు.