Begin typing your search above and press return to search.

సినీ హీరోతో సారా టెండూల్క‌ర్ పెళ్లి కుదిరిందా?

సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా, సన్నీ డియోల్ కుమారుడు రాజ్‌వీర్ డియోల్‌ను పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదని సారా పీఆర్ స్పష్టం చేసింది. వీరిద్దరూ ఇప్పటివరకు కనీసం కలుసుకోలేదని, సారా ప్రస్తుతం సింగిల్‌గా ఉంటూ తన కెరీర్‌పై దృష్టి పెట్టిందని వెల్లడించింది. ఈ తరహా ఊహాగానాలు అనవసరమైనవని పేర్కొంది.

By:  Sivaji Kontham   |   23 Nov 2026 5:53 PM IST
సినీ హీరోతో సారా టెండూల్క‌ర్ పెళ్లి కుదిరిందా?
X

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‍ -డా.అంజలిల‌ కుమార్తె సారా టెండూల్కర్, బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్-పూజా డియోల్ కుమారుడు రాజ్‌వీర్ డియోల్ వివాహం చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా వైర‌ల్ గా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలు నిజ‌మా? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.

స‌చిన్ టెండూల్కర్ ఆట నుంచి వివ‌ర‌ణ ఇచ్చాక ఎంట‌ర్ ప్రెన్యూర్ గా వ్యాపారాల‌ను విస్త‌రిస్తున్నారు. అదే స‌మ‌యంలో ఆయ‌న వార‌సురాలు సారా త‌న సొంత గుర్తింపు కోసం ప్ర‌య‌త్నిస్తుండ‌టం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. సారా టెండూల్క‌ర్ ఇప్ప‌టికే మోడ‌ల్ గా, ఎంట‌ర్ ప్రెన్యూర్ గా త‌న‌కంటూ ఒక సొంత శైలిని సృష్టించుకుని దూసుకెళుతున్నారు. అర్జున్ న‌టుడిగా కెరీర్ ని కొన‌సాగించడానికి ఆస‌క్తిగా ఉన్నాడు. 2023లో దోనో అనే చిత్రంతో న‌టుడిగా ఆరంగేట్రం చేసారు. ఇప్పుడు సారా- రాజ్ వీర్‌ జంట ఫోటోలను వైర‌ల్ చేస్తూ మీడియాలో పెళ్లి వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేయ‌డంతో.. దీనిపై పెద్ద చ‌ర్చ సాగుతోంది. అయితే ఈ వార్త‌ల్లో ఎలాంటి వాస్తవం లేదని.. ఇద్దరి మధ్య పెళ్లి ప్రసక్తే లేదని సారాకు సన్నిహిత వర్గాలు కొట్టిపారేశాయి. అంతేకాకుండా వీరిద్దరూ ఇప్పటివరకు కనీసం ఒకరినొకరు కలుసుకోలేదని కూడా స్పష్టం చేశాయి.

సారా ప్రస్తుతం సింగిల్‌గా ఉంటూ తన పనిపై దృష్టి పెట్టింది. ఇలాంటి ఊహాగానాలు అనవసరమైనవి.. ఇబ్బంది కలిగించేవి! అని సారా పీఆర్ జాతీయ మీడియాకు వెల్ల‌డించారు. హుందాగా, గౌరవప్రదంగా వ్యవహరించడానికే సారా ఇష్టపడతారు కాబట్టి ఈ గాసిప్స్ పై త‌నే స్వయంగా స్పందించే అవకాశం లేదని పేర్కొంది.

గతంలో వివాహం గురించి తన అభిప్రాయాలను సూటిగా షేర్ చేసిన‌ సారా.. తన సోదరుడు అర్జున్ టెండూల్కర్ పెళ్లి తనకు భవిష్యత్తు వివాహంపై ఒక ముందస్తు అవగాహనను ఇచ్చిందని చెప్పారు. అది తనకు ఒక `ట్రయల్ రౌండ్`లా అనిపించిందని.. తనకు ఏం కావాలి? ఏం వద్దు? అనే విషయంలో ఇప్పుడు ఒక స్పష్టత వచ్చిందని `వోగ్` ఇంటర్వ్యూలో సారా వ్యాఖ్యానించారు.

నేటి జెన్ జీ ప్రేమ వ్య‌వ‌హారాలు, బంధాలపై కూడా సారా తన మనసులోని మాటను వెల్లడించారు. తన తరం వారు వివాహాన్ని సీరియస్‌గానే తీసుకుంటారని.. అయితే బంధంలో ఇబ్బందులు తలెత్తి కలిసిపోని పరిస్థితి వస్తే దాని నుంచి బయటకు రావడానికి కూడా వెనుకాడరని సారా టెండూల్క‌ర్ అభిప్రాయపడ్డారు. నిశ్చితార్థం తర్వాత పెళ్లికి ముందు భాగస్వామి లేదా వారి కుటుంబ సభ్యుల నిజస్వరూపం తెలిసి.. ఇక ముందుకు వెళ్లలేమని భావించిన సందర్భాలను తాను చూశానని... పెళ్లికి ముందే అలాంటి బంధం నుంచి వైదొలగడం మంచి నిర్ణయమేనని సారా స్పష్టం చేశారు. గత తరాలతో పోలిస్తే జెన్ జీ తరం తమ కోసం తాము నిలబడటంలో మరింత ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.