Begin typing your search above and press return to search.

సారా టెండూల్క‌ర్ ఆదాయం స్కైలోకి

కేవ‌లం న‌ట‌న‌లోనే కాదు.. సోష‌ల్ మీడియాల ప్ర‌మోష‌న్స్‌, వాణిజ్య‌ ప్ర‌క‌ట‌న‌ల‌తో ఆదాయం, ర‌క‌ర‌కాల కంపెనీల్లో పెట్టుబ‌డుల ద్వారా సారా టెండూల్క‌ర్ ఇప్ప‌టికే 40 కోట్ల నిక‌ర ఆదాయాన్ని ఆర్జించింద‌ని లెక్క‌లు చెబుతున్నాయి.

By:  Sivaji Kontham   |   19 Dec 2025 6:00 PM IST
సారా టెండూల్క‌ర్ ఆదాయం స్కైలోకి
X

నేటి జెన్ జెడ్ స్టార్ కిడ్స్ న‌ట‌నారంగంలో ప్ర‌భావం చూపిస్తూ, ఆకాశ‌మే హ‌ద్దుగా దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. స్టార్లుగా కోట్లాది రూపాయ‌ల పారితోషికాలు అందుకుంటూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. కేవ‌లం 25 వ‌య‌సు లోపే ఈ ఘ‌న‌త‌ను సాధించ‌డం నిజంగా ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంది. కేవ‌లం న‌ట‌న‌లోనే కాదు.. సోష‌ల్ మీడియాల ప్ర‌మోష‌న్స్‌, వాణిజ్య‌ ప్ర‌క‌ట‌న‌ల‌తో ఆదాయం, ర‌క‌ర‌కాల కంపెనీల్లో పెట్టుబ‌డుల ద్వారా సారా టెండూల్క‌ర్ ఇప్ప‌టికే 40 కోట్ల నిక‌ర ఆదాయాన్ని ఆర్జించింద‌ని లెక్క‌లు చెబుతున్నాయి. సారా కేవ‌లం రెండేళ్ల‌లోనే త‌న వార్షిక ఆదాయం రేంజును అమాంతం పెంచుకోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

2023లో సారా టెండూల్కర్ వార్షిక ఆదాయం రూ. 50 లక్షల నుండి రూ. 1 కోటి మధ్య ఉంటుందని అంచనా. ఈ ఆదాయం ప్రధానంగా మోడల్‌గా వివిధ ఫ్యాషన్ బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా వ్యవహరించడం ద్వారా, అలాగే ఆన్‌లైన్ స్టోర్ అయిన `సారా టెండూల్కర్ షాప్` ద్వారా సాధ్య‌మైంది. సామాజిక మాధ్య‌మాల ద్వారా బ్రాండ్ ప‌బ్లిసిటీతోను అద‌నంగా ఆర్జిస్తోంది.

అయితే గ‌డిచిన ఈ రెండేళ్ల‌లోనే సారా టెండూల్క‌ర్ త‌న గ్రాఫ్ ని అమాంతం పెంచుకుంది. ఈ భామ‌ ఒక్కో బ్రాండ్ ప్ర‌చారానికి 30-80 ల‌క్ష‌లు వ‌సూలు చేస్తోంది. ఒక ఇన్ స్టా పోస్టుకు 15-20ల‌క్ష‌లు డిమాండ్ చేస్తోంది. 2025 నాటికి సారా

40 కోట్ల నిక‌ర ఆదాయం (5మిలియ‌న్ డాల‌ర్లు) ఉన్న‌ట్టు అంచ‌నా. ఈ వివ‌రాల‌ను బ‌ట్టి, భారతదేశంలోని అగ్రశ్రేణి సెలబ్రిటీ ఇన్‌ఫ్లూయెన్స‌ర్ ల‌లో ఒక‌రిగా సారా ఉంది. మోడలింగ్ - ఫ్యాషన్ సంబంధిత‌ ప్రాజెక్ట్‌లతో నికర ఆదాయం పెంచుకున్న సారా టెండూల్క‌ర్ నిరంత‌ర‌ అంకితభావంతో ఈ రంగంలో దూసుకుపోతోంది.

అయితే బ్రాండ్ ప‌బ్లిసిటీలో దూసుకుపోతున్న సారా టెండూల్క‌ర్.. న‌టనారంగంలోకి ప్ర‌వేశం ఎప్పుడు? అంటే దీనికి స‌రైన స‌మాధానం లేదు. సారా టెండూల్క‌ర్ ఇండ‌స్ట్రీలో దిగ్గ‌జ కుటుంబాల‌తో స‌న్నిహిత సంబంధాల‌ను క‌లిగి ఉంది.

ఇటీవ‌ల వ‌రుస‌గా సారా ఖాతాలోకి ప్ర‌ఖ్యాత బ్రాండ్లు వ‌చ్చి చేరుతున్నాయి. స్టార్ హీరోలు కోక్ ప్ర‌చారంలా.. సారా టెండూల్క‌ర్ హెయిర్ సీర‌మ్ ప్ర‌చారంలోను దూసుకుపోతోంది. ప్ర‌ఖ్యాత గోల్డెన్ గూస్ కి ఇండియాలో సారా టెండూల్కర్ ప్ర‌చార‌క‌ర్త‌గా కొన‌సాగుతోంది. వీట‌న్నిటి ద్వారా సారా ఆదాయం కోట్ల‌లో ఉంది.