Begin typing your search above and press return to search.

క‌వ‌ర్ పేజీపై సారా అర్జున్ మైండ్ బ్లోవింగ్ ఫోజులు

సారా అర్జున్.. ఈ పేరు వినగానే మనకు `నాన్న` (దైవ తిరుమగళ్) చిత్రంలో విక్రమ్ కుమార్తెగా నటించిన ఆ చిన్నారి గుర్తుకు వస్తుంది.

By:  Sivaji Kontham   |   2 May 2026 1:00 AM IST
క‌వ‌ర్ పేజీపై సారా అర్జున్ మైండ్ బ్లోవింగ్ ఫోజులు
X

సారా అర్జున్.. ఈ పేరు వినగానే మనకు `నాన్న` (దైవ తిరుమగళ్) చిత్రంలో విక్రమ్ కుమార్తెగా నటించిన ఆ చిన్నారి గుర్తుకు వస్తుంది. కానీ ఇప్పుడు ఆ చిన్నారి 20 వ‌య‌సు డ్రీమ్ గాళ్ గా ఎదిగింది. భారతీయ చిత్ర పరిశ్రమలో `నెక్స్ట్ బిగ్ థింగ్`గా అవతరించింది. తాజాగా `ఎల్లే ఇండియా` డిజిటల్ కవర్ స్టార్‌గా మెరిసిన సారా.. తన కెరీర్- వ్యక్తిగత ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసింది. కేవలం అందం మాత్రమే కాకుండా.. నటన లో త‌న‌కు ఉన్న పరిణతి ఎల్లే క‌వ‌ర్ స్టోరీ ఇంటర్వ్యూలో స్పష్టంగా రివీలైంది.





ప్రస్తుతం `ధురంధర్` ఫ్రాంచైజీతో బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల వసూళ్లను చూసిన‌ సారా ఈ విజయంపై చాలా స్పష్టతతో ఉంది. ప్రస్తుతం త‌న‌చుట్టూ జరుగుతున్నవన్నీ చూస్తుంటే చాలా కృతజ్ఞతగా ఉంద‌ని.. కానీ ఈ క్షణం విలువను నేను భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మాత్రమే పూర్తిగా అర్థం చేసుకోగలనని తెలిపింది. త‌న‌ దృష్టి అంతా జీవితంలోని తదుపరి అధ్యాయంపైనే ఉందని కూడా సారా పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీలోనే పెరగడం వల్ల ఇక్కడి గెలుపోటములు.. అనిశ్చితిపై త‌న‌కు పూర్తి అవగాహన ఉంద‌ని కూడా సారా పేర్కొంది.





నటన గురించి సారా చెబుతూ..``కెమెరా ముందుకు వచ్చినప్పుడు నేను సారా అనే వ్యక్తిని పూర్తిగా మర్చిపోతాను. మరొకరి పాత్రను పోషిస్తున్నప్పుడు మనలోని అడ్డంకులు, బిడియం అన్నీ తొలగిపోతాయి. నాకు నటన అంటే అందరూ నన్ను చూడటం కాదు.. ఆ పాత్రలో నేను లీన‌మైపోవడం`` అని తన వృత్తి పై ఉన్న క‌సిని సారా చాటుకుంది. కేవలం 20 ఏళ్ల వయస్సులోనే ఇంతటి స్థిరమైన ఆలోచనా ధోరణి త‌నను ఉన్న‌త స్థాయిలో నిల‌బెడుతుంద‌న‌డంలో సందేహం లేదు.





తాను గ్లామర్ ప్రపంచంలో ఉన్నా నిజాయితీగా ఉండటమే ముఖ్యమని న‌మ్ముతాన‌ని సారా చెబుతోంది. ప్రేక్షకులు ఎప్పుడూ నిజాయితీకి, పర్ఫెక్షన్‌కు మధ్య ఉన్న తేడాను గుర్తించగలరు. అందుకే నేను ఎప్పుడూ నిజాయితీగా ఉండటానికే ప్రయత్నిస్తాను! అని సారా తెలిపారు.





ఫ్యాషన్ అండ్ స్టైలింగ్ విషయంలో కూడా సారా తనదైన ముద్ర వేస్తోంది. ఎల్లే క‌వ‌ర్ పేజీపై సారా గ్లామ‌ర్ డోస్ దుమారం రేపుతోంది. ముఖ్యంగా సారా కోసం ఎంపిక చేసుకున్న ప్ర‌యోగాత్మ‌క బ్లేజ‌ర్లు.. థై సొగ‌సుల్ని ఎలివేట్ చేసే డిజైన‌ర్ దుస్తులు త‌న‌లోని గ్లామ్ యాంగిల్ ని మ‌రో లెవ‌ల్లో ఆవిష్క‌రించాయి. ఎల్లే షూట్ కోసం స్టెల్లా మాక్‌కార్ట్నీ.. ధ్రువ్ కపూర్ వంటి ప్రముఖ డిజైనర్ల దుస్తులలో అద్భుతంగా కనిపించారు.

మొత్తానికి చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రయాణాన్ని మొదలుపెట్టి నేడు వేల కోట్ల వసూళ్లు సాధించిన చిత్రాల్లో న‌టిగా ఉన్న సారా అర్జున్ భ‌విష్య‌త్ లో భారతీయ సినిమాను ఏలబోయే స్టార్ హీరోయిన్‌గా కనిపిస్తోంది. ఈ ప్ర‌తిభావ‌ని నటనలోని సహజత్వం.. కెరీర్ జ‌ర్నీపై ఉన్న స్పష్టత త‌న‌ను ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం నిలబెడతాయని చెప్పడంలో సందేహం లేదు.