ప్రేక్షకులు అలా భావిస్తే సినిమాలు మానేయాల్సిందే!
తాజాగా ఈ వయసు వ్యత్యాసం గురించి కార్తీ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
By: Srikanth Kontham | 11 Dec 2025 7:00 AM ISTహీరో-హీరోయిన్ మధ్య వయసు వ్యత్యాసం 15-20 ఏళ్లు ఉంటే? విమర్శలు ఎదుర్కోవాల్సిందే. వీలైనంత వరకూ మేకర్స్ విమర్శలకు తావు ఇవ్వకుండానే చూస్తుంటారు. కానీ కొన్ని సందర్బాల్లో పాత్ర డిమాండ్ చేసిందనో? మరో కారణం తోనే వయసుతో సంబంధం లేకుండా ఎంపిక చేస్తుంటారు. ఇటీవల రిలీజ్ అయిన `ధురంధర్` సినిమాలో హీరోయిన్ గా నటించిన సారా అర్జున్ విషయంలో ఈ వ్యత్యాసం అన్నది తీవ్ర విమర్శలకు దారి తీసింది. సారా వయసు 18ఏళ్లు కాగా, అందులో హీరోగా నటించిన రణవీర్ సింగ్ వయసు 40 ఏళ్లు.
రణవీర్ సింగ్ కి తప్పలేదు:
ఏకంగా 20 ఏళ్లకు పైగా వ్యత్యాసం ఉన్న నటుడితో 18 ఏళ్ల నటి రొమాన్స్ ఏంటి? అని సోషల్ మీడియా వేదికగా నెటి జనులు విమర్శించారు. కానీ ఈ సినిమా లో హీరో-హీరోయిన్ మధ్య ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాలు లేవు. ఎక్కడా అసభ్యత లేకుండానే ఆదిత్యధర్ ఆ చిత్రాన్ని తెరకెక్కించాడు. కేవలం హింసాత్మక సన్నివే శాలు ఉండంటంతోనే `ఏ` సర్టిఫికెట్ వచ్చింది తప్ప! అందులో మరో కోణం ఆధారంగా కాదన్నది రిలీజ్ తర్వాత తేలిపోయింది.
ప్రేక్షకులు పాత్రలే చూడాలి:
రిలీజ్ అనంతరం వయసు వ్యత్యాసం అన్న టాపిక్ ఎక్కడా రాలేదు. రిలీజ్ కు ముందు ప్రచార సమయంలో విమర్శలొచ్చాయి. తాజాగా ఈ వయసు వ్యత్యాసం గురించి కార్తీ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సినిమాలో నటుడు, నటి మధ్య నిజ జీవితంలో ఉన్న వయసు వ్యత్యాసం గురించి ఆందోళన చెందితే? నటులంతా సినిమాలు తీయడం మానేయాలన్నారు. ప్రేక్షకులు తెరపై పాత్రలను మాత్రమే చూడాలని..వయసు వ్యత్యాసం పట్టించు కోవాల్సి అంశం కాదని అభిప్రా యప్డడారు.
ప్రేక్షకుల కోరిక మేరకు మాధవన్:
అలాగే మాధవన్ కూడా తనకంటే చిన్న వయసున్న హీరోయిన్లతో నటించినని వెల్లడించాడు. అలా నటించడం ప్రేక్షకులకు నచ్చని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అంతకు ముందు సల్మాన్ ఖాన్ కూడా రష్మికా మంద న్నాతో `సికిందర్` లో నటించిన సమయంలో విమర్శలు ఎదుర్కున్నాడు. సల్మాన్ ఖాన్ వయసు 60 ఏళ్లు కాగా అందులో రష్మిక వయసు సగం. ఆమెతో సల్మాన్ ఖాన్ నటించడం ఏంటనే విమర్శలకు ధీటుగా సమాధానం ఇచ్చాడు భాయ్. రష్మిక తల్లికే లేని అభ్యంతరం మీకెందుకంటూ విమర్శల్ని తిప్పి కొట్టాడు.రవితేజతో శ్రీలీల రెండు సినిమాల్లో నటించింది. వీరిద్దరి మధ్య కూడా వ్యత్యాసం భారీగానే ఉంది. `ధమాకా` సమయంలో? విమర్శలొచ్చాయి. అయినా వాటిని పట్టించు కోకుండా ఇద్దరు `మాస్ జాతర` కోసం రెండవ సారి కలిసి పని చేసిన సంగతి తెలిసిందే.
