Begin typing your search above and press return to search.

గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న ధురంధర్ బ్యూటీ!

ఇన్నాళ్లు చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించి.. ఇప్పుడు ఒక్కసారిగా గ్లామర్ డోస్ తో అభిమానులకు పిచ్చెక్కించింది సారా అర్జున్.

By:  Madhu Reddy   |   10 Jan 2026 2:52 PM IST
గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న ధురంధర్ బ్యూటీ!
X

ధురంధర్.. ప్రముఖ నటుడు రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్యాధర్ దర్శకత్వంలో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఇది. ఈ సినిమా రోజురోజుకి కలెక్షన్ల వర్షం కురిపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ సినిమా విడుదలై నెలకు పైగానే అవుతున్నా.. ఇప్పటికీ థియేటర్లలో దూసుకుపోతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అలా 35వ రోజు కూడా రూ.4.25 కోట్లు సాధించి ఇండియాలో రూ.790.25 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా.. రూ.948 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది.





ఇక ప్రపంచవ్యాప్తంగా రూ.1,233 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇకపోతే ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకొని.. ఇన్నాళ్లు చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించి.. ఇప్పుడు ఒక్కసారిగా గ్లామర్ డోస్ తో అభిమానులకు పిచ్చెక్కించింది సారా అర్జున్. సైలెంట్ గా రికార్డులు క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. ఇకపోతే తన క్రేజ్ ను మరింత పెంచుకోవడానికి సోషల్ మీడియాలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇక్కడ గ్లామర్ తో ప్రేక్షకులను కట్టిపడేసే ప్రయత్నం చేసింది. మెరూన్ రెడ్ కలర్ గౌనులో తన అందాలను ఆరబోస్తూ.. ఫాలోవర్స్ లో హీట్ పుట్టించింది. ఇక తాజాగా తన అందాలు ఆరబోస్తూ సారా అర్జున్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.





ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా పేరు సొంతం చేసుకున్న సారా అర్జున్.. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న తెలుగు చిత్రం యుఫోరియాలో నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరొకవైపు ధురంధర్ సినిమా ఇప్పటికీ భారీ కలెక్షన్స్ వసూలు చేస్తుండగా.. మరొకవైపు కొత్త ప్రాజెక్టులు కూడా వస్తుండడంతో ఈమె దశ తిరగబోతోంది అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక్క సినిమాతో సారా అర్జున్ ఊహించని పాపులారిటీ సొంతం చేసుకోవడం గమనార్హం.





విక్రమ్ హీరోగా నటించిన తమిళ చిత్రం థైవ తిరుమల్ చిత్రం ద్వారా బాలనటిగా కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇదే సినిమాను తెలుగులో నాన్న పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. తెలుగుతో పాటు మలయాళం, హిందీ చిత్రాలలో కూడా నటించింది. 2015లో దాగుడుమూతల దండాకోర్ అనే సినిమాలో రాజేంద్రప్రసాద్ మనవరాలిగా నటించింది.. అలా తన అద్భుతమైన నటనతో అప్పట్లోనే భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ చిత్రంలో ఐశ్వర్య రాయ్ చిన్నప్పటి పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు ఏకంగా హీరోయిన్గా తన అందాలు ఆరబోసి ప్రేక్షకులను అలరిస్తోంది. ఏది ఏమైనా సారా అర్జున్ ఇలాగే వరుస అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలగాలని అభిమానులు కోరుకుంటున్నారు.