Begin typing your search above and press return to search.

మాల్దీవుల్లో 'దురంధ‌ర్' బ్యూటీ పార్టీల‌తో చిలౌట్

సారా అర్జున్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బాల న‌టిగా కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు హీరోయిన్ గాను రాణిస్తోంది.

By:  Sivaji Kontham   |   2 Nov 2026 9:19 AM IST
మాల్దీవుల్లో దురంధ‌ర్ బ్యూటీ పార్టీల‌తో చిలౌట్
X

సారా అర్జున్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బాల న‌టిగా కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు హీరోయిన్ గాను రాణిస్తోంది. దురంధ‌ర్, దురంధ‌ర్ 2 చిత్రాల్లో అద్భుత న‌ట‌న‌తో క‌ట్టి ప‌డేసిన సారా, కెరీర్ ప‌రంగా వ‌డి వ‌డిగా అడుగులు వేస్తోంది. కొద్దిరోజులుగా ఈ అమ్మ‌డు రామ్ చ‌ర‌ణ్- సుకుమార్ కాంబినేష‌న్ లో సెట్స్ పైకి వెళుతున్న ఆర్.సి17లో న‌టిస్తోందంటూ ప్ర‌చారం సాగుతోంది. కానీ దీనికి ఇంకా ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌నా రాలేదు.





మ‌రోవైపు సారా ఒంట‌రి దీవుల్లో ఫ్యామిలీతో వెకేష‌న్ ని ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు అంత‌ర్జాలంలోకి వ‌చ్చాయి. మాల్దీవుల అందాల న‌డుమ‌ నీలిసముద్ర తీరాన సారా అర్జున్ చేసిన సందడి సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. మాల్దీవుల్లోని ఫ్లై వేల్ అనే లొకేషన్ ట్యాగ్‌లతో సారా షేర్ చేసిన‌ ఈ ట్రిప్ ఫోటోలు, మోక్ టైల్ పార్టీ వైబ్స్ నెటిజన్ల దృష్టిని విశేషంగా ఆకర్షించాయి.





నీలి స‌ముద్ర తీరంలో సూర్యకాంతి వెలుగులు.. వేవీ హెయిర్.. పసుపు రంగు డ్రెస్‌లో సారా డిఫరెంట్ లుక్స్ చూసి అభిమానులు మైమరచిపోతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ కామెంట్ సెక్షన్‌లో అభిమానులు త‌న‌ అందాన్ని `మోవానా`.. `ఐలాండ్ ప్రిన్సెస్`, `డిస్నీ ప్రిన్సెస్` అని అభివర్ణిస్తూ ప్రశంసల వర్షం కురిపించారు.





సారా పోస్ట్ చేసిన ప్రశాంతమైన బీచ్ క్లిప్పింగ్స్, మాల్దీవుల రిసార్ట్ వైబ్స్ చూసిన కొందరు నెటిజన్లు సరదాగా కవితలు అల్లుతూ మెసేజ్‌లు షేర్ చేస్తున్నారు. బాలనటిగా తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులకు దగ్గరైన ఈ చిన్నారి.. ఇప్పుడు కళ్లు చెదిరే మోడ్రన్ లుక్‌తో సోషల్ మీడియాలో సరికొత్త గ్లామర్ సెన్సేషన్‌గా మారింది.





ప్రఖ్యాత దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ `ధురంధర్` సిరీస్‌లో రణ్‌వీర్ సింగ్ సరసన యాలీనా జమాలీ అనే కీలక పాత్రలో మెప్పించింది. ఈ సిరీస్ భార‌తీయ చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మునుపెన్న‌డూ లేనంత పెద్ద విజ‌యం సాధించింది. బాలనటి నుంచి ఏకంగా పాన్-ఇండియా రేంజ్ బిగ్ ప్రాజెక్ట్స్‌లో లీడ్ రోల్స్ దక్కించుకోవడంతో సారా ఇమేజ్ గ్రాఫ్ వేగంగా పెరిగింది.





ప్రస్తుతం సారా అర్జున్ నటిస్తున్న త‌దుప‌రి చిత్రాల వివ‌రాల్లోకి వెళితే.. యుఫోరియా అనే సినిమాతో తెలుగు చిత్రసీమలో నాయికగా ప్రవేశించినా.. దురంధ‌ర్ ఫ్రాంఛైజీతో సంచ‌ల‌నాలు న‌మోదు చేసినా కానీ.. సారా కెరీర్ ప‌రంగా ఆచితూచి అడుగులు వేస్తోంది. ఆర్.సి 17లో త‌న పాత్ర క‌న్ఫామ్ అయిందా లేదా? అనేది తేలాల్సి ఉంది. వీటితో పాటు, దర్శకుడు ఎ.ఎల్. విజయ్‌తో రీ-యూనియన్ ప్రాజెక్ట్ కూడా పరిశ్రమలో చ‌ర్చ‌గా మారింది.